బుగులు (తెలంగాణ కథ 2020)


బుగులు (తెలంగాణ కథ 2020) అనేది సింగిడి (తెలంగాణ రచయితల సంఘం) ప్రచురించిన పుస్తకం. తెలంగాణ కథా సిరీస్ లో భాగంగా ప్రచురించబడిన ఎనమిదవ పుస్తకం ఇది. 13 కథలున్న ఈ పుస్తకంలోని కథలు 2020 నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను అనేక కోణాల్లో, ఎంతో సమర్థవంతంగా చిత్రించాయి.[1]

బుగులు (తెలంగాణ కథ 2020)
బుగులు (తెలంగాణ కథ 2020) పుస్తక ముఖచిత్రం
కృతికర్త: కథా సంకలనం
సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్
డా. వెల్దండి శ్రీధర్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: సింగిడి (తెలంగాణ రచయితల సంఘం)
విడుదల: అక్టోబరు, 2021
పేజీలు: 148

సంపాదకులు

మార్చు

కథల నేపథ్యం

మార్చు

సమాజానికి సాహిత్యం ప్రతిఫలిస్తుంది అన్నమాటకు అనుగుణంగా కరోనా నేపథ్యంలో అనేక కథలు రాయబడ్డాయి. అలా కరోనా కేంద్రకంగా రాసిన నాలుగు కథలు ఈ సంకలనంలో కూడా చేర్చబడ్డాయి. ‘చూపుడు వేలు’ (అఫ్సర్), ‘పరిందా’ (డా. షాజహానా) కథలు కరోనాకున్న మతం రంగును బట్టబయలు చేస్తే ‘కాసెపుల్ల’ (డా. వెల్దండి శ్రీధర్), ‘ఆరడుగుల దూరం’ (పెద్దింటి అశోక్‌కుమార్) కథలు కరోనా కాలంలో నలిగిపోయిన స్త్రీల జీవితాలను, మానవీయ సంబంధాలను కేంద్రంగా చేసుకొని రాసిన కథలు. కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా, ఉన్న ఉద్యోగాలే పోతున్న తీరుని ‘ఉడో’ (ఉప్పులేటి సదయ్య) కథ వివరించింది. విద్య ప్రాధాన్యతను, నాణ్యమైన విద్యను అందించడంలోని అలసత్వాన్ని ‘చెప్పదలుచుకున్న మాటేదో..’ (సంహితా కిరణ్) కథ వర్ణించింది. అమ్మాయిలకు 18 ఏళ్ళకి ముందే వివాహాలు జరిగినపుడు, అట్లాంటి బాలికలు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ, ఇబ్బందులను ‘నాకూ.. భయమేస్తోంది..’ (యామిని నల్ల) కథలో మానవీయంగా చిత్రించబడింది. తెలంగాణ ప్రజల పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దడానికి రైతులు కొత్త తరహా పంటలను పండించాలని ఆపిల్‌తోటలను పెంచి సామాన్య ప్రజల విటమిన్ లోపాన్ని ఎదుర్కోవాలన్న నేపథ్యంలో ‘కేడ కొడ్స్తా’ (అక్కల చంద్రమౌళి) కథ రాయబడింది. మానసికంగా ఆందోళనకు గురైన వారు ప్రతిరోజు యోగ, ధ్యానం చేసి మానసిక ప్రశాంతతను పొందాలన్న నేపథ్యంలో ‘మెడిటేషన్’ (పూడూరి రాజిరెడ్డి) కథ రాయబడింది. ఒంటరితనం శాపమైపోయిన వారి సమస్యలకు ఆధునిక టెక్నాలజీ సహాయం గురించిన సమాధానాన్ని వెతికే ప్రయత్నంలో ‘డియర్ లెక్సా’ (కె.వి. మన్‌ప్రీతం) కథ రాయబడింది. ప్రేమను, దాని పర్యవసానాలను, జీవితపు మాధుర్యాల గురించి ‘సిలకం డబ్బా’ (మేడి చైతన్య) కథలలో చెప్పబడింది. తనకున్న సంక్లిష్ట జీవన శైలిని దాటడానికి, ఒక ప్రశాంతత వైపు మలుపు తీసుకోవడానికి మనిషి సెకండ్ లైఫ్‌ను కోరుకుంటున్నాడా? అన్న నేపథ్యంలో ‘సెకండ్ లైఫ్’ (రవి వీరెల్లి) రాయబడింది. సంక్షోభంలో కూరుకుపోయిన ప్రపంచానికి ఎవర్‌గ్రీన్ ఎంప్లాయిమెంట్‌ను కల్పించేది, తిండి గింజలను ధారపోసేది వ్యవసాయమేనని తెలంగాణ సాంస్కృతిక జీవిత నేపథ్యంగా ‘బతుకమ్మ పుట్టింది’ (చందు తులసి) కథ రాయబడింది.[1]

ఆవిష్కరణ

మార్చు

2021, నవంబరు 21న హైదరాబాదులోని రవీంద్ర భారతి మినీహాలులో ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. కవి, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాజీ సభ్యులు మంగారి రాజేందర్‌ (జింబో), తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సంగిశెట్టి శ్రీనివాస్‌, డా. వెల్దండి శ్రీధర్ తదితరులు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.[2][3]

విషయసూచిక

మార్చు
క్రమసంఖ్య కథ పేరు రచయిత పేరు
1 మెడిటేషన్ పూడూరి రాజిరెడ్డి
2 సిలకం డబ్బా మేడి చైతన్య
3 డియర్ లెక్సా! మన్ ప్రీతం
4 చూపుడు వేలు అఫ్సర్
5 చెప్పదలుచుకున్న మాటేదో సంహితాకిరణ్
6 సెకండ్ లైఫ్ రవి వీరెల్లి
7 కేడా కొడ్త్సా అక్కల చంద్రమౌళి
8 పరిందా! డా. షాజహానా
9 ఉడో ఉప్పులేటి సదయ్య
10 కాసెపుల్ల డా. వెల్దండి శ్రీధర్
11 బతుకమ్మ పుట్టింది చందు తులసి
12 ఆరడుగుల దూరం పెద్దింటి అశోక్ కుమార్
13 నాకూ.. భయమేస్తోంది యామిని నల్ల

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 మన తెలంగాణ (14 November 2021). "సంక్షోభ కాలపు కథలు". www.manatelangana.news. సంగిశెట్టి శ్రీనివాస్, డా. వెల్దండి శ్రీధర్,. Archived from the original on 20 November 2021. Retrieved 25 November 2021.{{cite news}}: CS1 maint: extra punctuation (link)
  2. నమస్తే తెలంగాణ, హైదరాబాదు (21 November 2021). "కథలు హృదయాన్ని తాకాలి". Namasthe Telangana. Archived from the original on 24 November 2021. Retrieved 24 November 2021.
  3. "తెలంగాణ కథ 2020 - 'బుగులు'". andhrajyothy. Archived from the original on 2021-11-25. Retrieved 2021-11-25.