బూర్గంపాడు మండలం

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మండలం


బూర్గంపాడు మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1]

బూర్గంపాడు
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, బూర్గంపాడు స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, బూర్గంపాడు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°39′00″N 80°52′00″E / 17.6500°N 80.8667°E / 17.6500; 80.8667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం బూర్గంపాడు
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 210 km² (81.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 64,580
 - పురుషులు 32,673
 - స్త్రీలు 31,907
అక్షరాస్యత (2011)
 - మొత్తం 60.18%
 - పురుషులు 69.64%
 - స్త్రీలు 50.05%
పిన్‌కోడ్ 507114

ఇది సమీప పట్టణమైన పాల్వంచ నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం బూర్గంపాడు

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పుసవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

లోగడ ఖమ్మం జిల్లా, పాల్వంచ రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా బూర్గుంపాడు మండలం (1+11) పన్నెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3].

గణాంకాలుసవరించు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 210 చ.కి.మీ. కాగా, జనాభా 64,580. జనాభాలో పురుషులు 32,705 కాగా, స్త్రీల సంఖ్య 31,873. మండలంలో 15,649 గృహాలున్నాయి.[4]

ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన పోలవరం ముంపు గ్రామాలుసవరించు

తెలంగాణ విభజనకు ముందు ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.[5] 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, పోలవరం ఆర్డినెన్స్ ప్రకారం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపింది.అయితే అందులో భాగంగా ఈ మండలంలోని సీతారామనగరం, శ్రీధర (వేలేరు), గుంపెనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట, పెద్ద రావిగూడెం గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసాయి.[6][7][8]ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని కుక్కునూరు మండలం లో విలీనం చేసింది.

మండలం లోని పట్టణాలుసవరించు

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. ఇరవెండి
 2. మోతె
 3. సారపాక
 4. నాగినేనిప్రోలు
 5. బూర్గంపాడు
 6. సోంపల్లి
 7. పినపాక (పి.యమ్)
 8. ఉప్పుసాక
 9. నకిరపేట
 10. మొరంపల్లి బంజార్
 11. కృష్ణసాగర్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-07.
 4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
 5. "Villages and Towns in Burgampahad Mandal of Khammam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-01-10. Retrieved 2022-01-10.
 6. "Wayback Machine" (PDF). web.archive.org. 2017-03-29. Archived from the original on 2017-03-29. Retrieved 2022-09-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 7. "Ordinance on Khammam Villages Deserves to be Scrapped". The New Indian Express. Retrieved 2022-01-11.
 8. https://prsindia.org/files/bills_acts/bills_parliament/2014/AP_Reorganisation_(A)_Bill,_2014_0.pdf

వెలుపలి లంకెలుసవరించు