బెంగుళూరు డేస్ (ఆంగ్లం: Bangalore Days) 2014 లో విడుదల అయిన ఒక మలయాళం సినిమా. ఫహద్ ఫాసిల్, నజ్రియా నజీమ్, దుల్కర్ సల్మాన్, పార్వతి తిరువోతు, నివిన్ పౌలీ, ఇషా తల్వార్ నిత్యా మీనన్ ఈ చిత్రం ముఖ్య పాత్రలు పోషించారు. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు అయిన దర్శకురాలు అంజలీ మీనన్, ఈ చిత్రం లో కూడా కేరళ నుండి బెంగుళూరు కి వెళ్ళిన ముగ్గురి దాయాదుల కథ చెప్పారు.

బెంగ‌ళూర్ డేస్
దస్త్రం:'Bangalore Days' 2014 Malayalam Film - Poster.jpg
దర్శకత్వంఅంజలీ మీనన్
రచనఅంజలీ మీనన్
నిర్మాతఅన్వర్ రషీద్
సోఫియా పాల్
తారాగణం
ఫైట్స్జాలీ బాస్టియన్
Narrated byనివిన్ పౌలీ
ఛాయాగ్రహణంసమీర్ తాహిర్
కూర్పుప్రవీణ్ ప్రభాకర్
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
2014 మే 30 (2014-05-30) (Kerala)
సినిమా నిడివి
172
దేశంభారతదేశం
భాషమలయాళం

2016 లో ఇదే చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తమిళం లో బెంగుళూరు నాట్గళ్ గా పునర్నిర్మించటం విశేషం.

కథ మార్చు

ముగ్గురు దాయాదులు అయిన దివ్యా ప్రకాష్ అలియాస్ కుంజు (నజ్రియా నజీం), కృష్ణన్ పి.పి అలియాస్ కుట్టన్ (నివిన్ పౌలీ) అర్జున్ అలియాస్ అజు (దుల్కర్ సల్మాన్) చిన్నప్పటి నుండి ఒకరిపై మరొకరు ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. విడాకులు తీసుకొన్న తల్లిదండ్రులకు దూరంగా అజు బెంగుళూరు మహానగరంలో బైక్ మెకానిక్ గా తనదైన జీవనశైలి లో జీవిస్తూ ఉంటాడు. కుట్టన్ కు బెంగుళూరులోనే సాఫ్టువేరు ఉద్యోగం దొరుకుతుంది. వృత్తిరిత్యా మహానగరంలో ఉన్నా, కుట్టన్ మనసు మాత్రం స్వగ్రామంలోనే ఉంటుంది. అప్పుడే డిగ్రీ పూర్తి చేసిన కుంజు ఆశయం ఐ ఐ ఎం లో ఎం బి ఏ చదవాలని, కానీ తన తల్లిదండ్రులు నమ్మే జ్యోతిష్యుని సలహా మేరకు వృత్తి తప్పితే వేరే ధ్యాస లేని దాస్ (ఫహద్ ఫాజిల్) తో వివాహం నిశ్చయం అవుతుంది. పెళ్ళి చూపుల్లోనే దాస్ తనకు అది వరకే ఒక ప్రేమ వ్యవహారం ఉండేది అని, కానీ ఇప్పుడు అదంతా గతం అని అంజు కు ముఖం పైనే చెప్పేస్తాడు. దాస్ బెంగుళూరు లోనే ఉద్యోగం చేస్తూ ఉండటం తో కుంజు కూడా బెంగుళూరు చేరుకొంటుంది.

దాస్ ముభావంగానే ఉండటంతో కుంజు ఒంటరితనానికి లోను అవుతుంది. తనకి ఈ ఒంటరితనానికి ఉన్న ఒకే ఒక ఆటవిడుపు తన దాయాదులతో గడిపే సమయం. అమాయకపు చక్రవర్తి అయిన కుట్టన్ సాంప్రదాయబద్ధంగా, నమ్రతగా ఉండే అమ్మాయి తనకు భార్యగా రావాలి అని కలలు గంటూ ఉంటాడు. అయితే బెంగుళూరు నుండి కొచ్చి వెళ్ళే విమానం లో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్న మీనాక్షి (ఇషా తల్వార్) తో ప్రేమలో పడతాడు. మీనాక్షి ని తరచుగా కలుస్తూ, సిగ్గరి గా ఉన్న కుట్టన్ మారిపోతాడు. అయితే ఒక రోజు మీనాక్షి ఫ్లాట్ కు ఆమె పూర్వ ప్రేమికుడు రావటంతో మీనాక్షి తనను కేవలం అతనిని మరచిపోవటానికి ఒక పావుగా వాడుకొంటున్నట్లు తెలుసుకొని ఆమె తో తెగదెంపులు చేస్కొంటాడు.

ఒక వైపు కుంజు, దాస్ ల వైవాహిక జీవితం ముక్కలు చెక్కలు అవుతూ ఉంటుంది. ఒక రోజు జరిగిన వాగ్వాదం తర్వాత దాస్ వద్ద మాత్రం ఉండే ఒక తాళం చెవితో ఆ ఇంట్లోని ఒక గది లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నటాషా ఫ్రాన్సిస్ (నిత్యా మీనన్) ఫోటోలు, ఆమెకు చెందిన వస్తువులు చూసి ఆశ్చర్యానికి గురౌతుంది. దాస్ హృదయంలో తనకు ఎంత మాత్రం చోటు లేదని గ్రహించిన అంజు, కుట్టన్ తో బాటు ప్రయాణం అయ్యి పుట్టింటికి చేరుకొంటుంది. అయితే అప్పటికే కుట్టన్ తండ్రి తన్ ఆస్తిపాస్తులను మొత్త్ం కుట్టన్ అతని సోదరికి వీలునామా వ్రాసి శాశ్వత తీర్థయాత్ర లకు వెళ్ళి పోవడం తో కుట్టన్ కూడా బాధాకర పరిస్థితులలోకి నెట్టి వేయబడతాడు. తల్లి కోరడం తో కుట్టన్ ఆవిడ ను కూడా బెంగుళూరు తీసుకొని వస్తాడు.

అజు ఒక బైక్ రేసింగ్ గ్యాంగ్ లో చేరి వారి బైకు లను రిపేర్లు చేస్తూ ఉంటాడు. రేడియో జాకీ అయిన సారా (పార్వతి తిరువోతు) ను ప్రేమించటం మొదలు పెడతాడు. ఆమెను చూడటానికి రేడియో స్టేషనుకు వెళ్ళగా, ఆమె (కాళ్ళు పని చేయకపోవటమ్ వలన) వీల్ చెయిర్ ను వాడటం చూస్తాడు. మొదట ఇరువురూ సంశయించినా, స్నేహితులు అయ్యాక ప్రేమలో పడతారు. అయితే ఉన్నత విద్యను అభ్యసించటానికి సారా ఆస్ట్రేలియా వెళ్తోందని తెలిసి అజు నిరాశ చెందుతాడు.

కుంజు, దాస్ లు విడాకులకు సిద్ధం అవుతుండగా, తాను చేరిన బైక్ రేసర్ల గ్యాంగ్ లో అందరూ ఎప్పుడూ మాట్లాడుకొనే అద్భుతమైన రేసర్ శివ యే దాస్ అని, అతని పూర్తి పేరు శివదాస్ అని, అతను నటాషా ఒకరినొకరు ప్రేమించుకొన్నారని, అయితే ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నియమాన్ని ఉల్లంఘించటం వలన జరిగిన రోడ్డు ప్రమాదంలో శివదాస్, నటాషాను కోల్పోయాడని, ఆమె మరణం తర్వాత శివదాస్ ఏమైపోయాడో బైకర్లు ఎవరికీ తెలియదు అని తెలుసుకొంటాడు. ఈ విషయాన్ని అజు కుంజుకు తెలుపగా, కుంజు దాస్ వద్దకు తిరిగి వచ్చి అతని తోనే ఉంటూ ఎం బీ ఏ చదువుతూ ఉంటుంది. కుంజు నటాషా తల్లిదండ్రులను కలిసి దాస్ పై వారికి ఉన్న అపార్థాలను తొలగించి వేస్తుంది. దాని తర్వాత దాస్ గతాన్ని మరచిపోవటం, కుంజు కు దగ్గర అవ్వటం తో వారి వైవాహిక జీవితం గాడిన పడుతుంది.

కుట్టన్ తల్లి బెంగుళూరులో పూర్తి నాగరికతకు అలవాటు పడిపోతుంది. కుట్టన్ సోదరి అమెరికా లోని ఓక్లహామా లో ఉండటం తో తను కూడా అక్కడికే బయలుదేరుతుంది. విమానాశ్రయం లో మీనాక్షి తారసపడుతుంది. మీనాక్షి కుట్టన్ ను మరల కోరుకొన్నా, కుట్టన్ ఆమెను నిరాకరిస్తాడు.

సారా ఆస్ట్రేలియా ప్రయాణం అయ్యే రోజునే, బైకర్స్ గ్యాంగ్ తరఫున అజు పోటీ చేసి, పందెం లో మొదటి స్థానం లో గెలుస్తాడు. కుంజు, కుట్టన్, (శివ)దాస్ లు అజు మనసులో సారా యే ఉందని తెలుసుకొంటారు. (మితిమీరిన వేగం వలనే నటాషాను కోల్పోయాడు కాబట్టి) అప్పటి వరకు కారును చాలా నెమ్మదిగా నడిపే శివదాస్, తన డ్రైవింగ్ నైపుణ్యంతో వేగంగా అజును సారా ఇంటికి చేరుస్తాడు. తన కోసం వచ్చిన అజును చూడగనే సారా తన ఆస్ట్రేలియా ప్రయాణాన్ని రద్దు చేసుకొంటుంది. భరతనాట్యం అభ్యసిస్తున్న పాశ్చాత్య యువతి మిచెల్లీ ను కుట్టన్ వివాహం చేసుకోవటం తో కథ ముగుస్తుంది.

అవార్డులు మార్చు

Award Date of ceremony[lower-alpha 1] Category Recipient(s) Result Ref.
Asianet Film Awards 11 January 2015 Best Popular film Bangalore Days గెలుపు [1]
Best Director Anjali Menon గెలుపు
Star of The Year Dulquer Salmaan గెలుపు
Performer of The Year Fahadh Faasil గెలుపు
Best Supporting Actress Parvathy Thiruvothu గెలుపు
Best Music Director Gopi Sundar గెలుపు
Best Lyricist Rafeeq Ahamed ("Ethu Kari Raavilum") గెలుపు
Best Male Playback Singer Haricharan ("Ethu Kari Raavilum") గెలుపు
Asiavision Awards 14 November 2014 Best Entertaining Movie Bangalore Days (Anjali Menon) గెలుపు [2]
Performer of The Year - Male Dulquer Salmaan గెలుపు
Star of The Year – Male Nivin Pauly గెలుపు
Star of the Year - Female Nazriya Nazim గెలుపు
New Sensation in Acting Parvathy Thiruvothu గెలుపు
Best Music Director Gopi Sundar గెలుపు
Best Cinematographer Sameer Thahir గెలుపు
Filmfare Awards South 26 June 2015 Best Film – Malayalam Bangalore Days Nominated [3]
[4]
Best Director – Malayalam Anjali Menon గెలుపు
Best Supporting Actor – Malayalam Fahadh Faasil Nominated
Best Supporting Actress – Malayalam Parvathy Thiruvothu గెలుపు
Best Music Director – Malayalam Gopi Sundar గెలుపు
Best Male Playback Singer – Malayalam Haricharan ("Ethu Kari Raavilum") గెలుపు
Vijay Yesudas & Sachin Warrier ("Thudakkam Mangalyam") Nominated
Kerala State Film Awards 10 August 2015 Best Actor Nivin Pauly గెలుపు [5]
Best Actress Nazriya Nazim గెలుపు
Best Screenplay (Original) Anjali Menon గెలుపు
South Indian International Movie Awards 6—7 August 2015 Best Film – Malayalam Bangalore Days గెలుపు [6]
[7]
Best Debut Producer – Malayalam Anwar Rasheed & Sophia Paul గెలుపు
Best Director – Malayalam Anjali Menon గెలుపు
Best Cinematographer – Malayalam Sameer Thahir Nominated
Best Supporting Actress – Malayalam Parvathy Thiruvothu గెలుపు
Best Music Director – Malayalam Gopi Sundar గెలుపు
Best Lyricist – Malayalam Rafeeq Ahamed ("Ethu Kari Raavilum") Nominated
Best Male Playback Singer – Malayalam Haricharan ("Ethu Kari Raavilum") Nominated
Best Dance Choreographer – Malayalam Brinda ("Thudakkam Mangalyam") Nominated
Vanitha Film Awards 15 February 2015 Most Popular Actress Nazriya Nazim గెలుపు [8]
Popular Song of the Year "Mangalyam Thanthunanena" గెలుపు

మూలాలు మార్చు

  1. Date is linked to the article about the awards held that year, wherever possible.
  1. "17th Asianet Film Awards". International Business Times. 12 January 2015. Retrieved 17 April 2020.
  2. "Asiavision Awards 2014". International Business Times. 3 November 2014. Retrieved 17 April 2020.
  3. "62nd Filmfare Awards South 2015". International Business Times. 4 June 2015. Retrieved 17 April 2020.
  4. "Winners of 62nd Britannia Filmfare Awards South". Filmfare. 27 June 2015. Retrieved 17 April 2020.
  5. "Kerala State Film Awards 2014". International Business Times. 10 August 2015. Retrieved 17 April 2020.
  6. "SIIMA 2015 Malayalam Nominations". International Business Times. 16 June 2015. Retrieved 17 April 2020.
  7. "SIIMA 2015 Malayalam Winners". South Indian International Movie Awards. Archived from the original on 17 మే 2017. Retrieved 17 April 2020.
  8. "Vanitha–Cera Film Awards". International Business Times. 12 February 2015. Retrieved 17 April 2020.