బెంగుళూరు లత
సినిమా నేపథ్య గాయని
బెంగళూరు లత దక్షిణభారత చలనచిత్ర నేపథ్య గాయని. ఈమె కన్నడ, తెలుగు భాషాచిత్రాలలో పాటలు పాడింది. ఈమె జి.కె.వెంకటేష్, సుసర్ల దక్షిణామూర్తి, సాలూరు హనుమంతరావు, కె.వి.మహదేవన్, టి.వి.రాజు, సత్యం, ఎం.రంగారావు, టి.జి.లింగప్ప, విజయభాస్కర్ మొదలైన సంగీత దర్శకుల చిత్రాలలో పనిచేసింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రాజ్‌కుమార్, ఎస్.జానకి వంటి గాయకులతో కలిసి పాడింది. సముద్రాల సీనియర్, దాశరథి, ఆరుద్ర, వడ్డాది, ఆర్.ఎన్.జయగోపాల్, ఉదయశంకర్, జి.వి.అయ్యర్ వంటి రచయితల పాటలకు తన గాత్రాన్ని అందించింది.
బెంగళూరు లత | |
---|---|
జన్మ నామం | బి. ఆర్. లతా |
జననం | బెంగళూరు, కర్ణాటక, భారతదేశం |
మూలం | కర్ణాటక |
సంగీత శైలి | నేపథ్య గానం |
వృత్తి | గాయని |
క్రియాశీల కాలం | 1962-1990 |
జీవిత భాగస్వామి | సోము |
సంబంధిత చర్యలు | ఎం. రంగారావు, సాలూరు హనుమంతరావు |
వ్యక్తిగత జీవితం
మార్చులతా నటుడు టొమాటో సోమును వివాహం చేసుకున్నాడు.
తెలుగు సినిమా పాటల జాబితా
మార్చుబెంగుళూరు లత పాడిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:
విడుదల సం. | సినిమా పేరు | పాట | ఇతర గాయకులు | సంగీత దర్శకుడు | రచయిత |
---|---|---|---|---|---|
1963 | నర్తనశాల | సలలిత రాగ సుధారస రాగం సర్వకళామయ నాట్యవిలాసం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | సుసర్ల దక్షిణామూర్తి | సముద్రాల రాఘవాచార్య |
1963 | నర్తనశాల | శీలవతీ నీ గతి ఈ విధిగ మారెనా | సుసర్ల దక్షిణామూర్తి | సముద్రాల రాఘవాచార్య | |
1965 | చంద్రహాస | ఇలకు దిగిన అందాల తారవో సౌందర్యరాణివో పాలకడలిలో | ఘంటసాల వెంకటేశ్వరరావు | సాలూరు హనుమంతరావు | |
1968 | అంతులేని హంతకుడు | ఓ అమ్మాయి ఓ అమ్మాయి నీ మృదుహాసం | పి.బి.శ్రీనివాస్ | కె.వి.మహదేవన్ | వడ్డాది |
1968 | దేవకన్య | కన్నులన్ని పులకించు వేళ చెలి తొలితొలి వలపులు | ఘంటసాల వెంకటేశ్వరరావు | టి.వి.రాజు | సి.నారాయణరెడ్డి |
1972 | బుల్లెమ్మ బుల్లోడు | అమ్మ అన్నది ఒక చల్లనిమాట | రమణ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | చెళ్ళపిళ్ళ సత్యం | దాశరథి |
1977 | అదృష్టవంతురాలు | వెలుగైనా నీడైనా జగతికి సహజం కాదా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | చెళ్ళపిళ్ళ సత్యం | ఆరుద్ర |
1979 | లక్ష్మీ పూజ | మురిపాలే చూపి మోహాలే రేపి ముద్దుల్లో ముంచి ముంచి మోజు పెంచరా | పి.సుశీల | చెళ్ళపిళ్ళ సత్యం | వీటూరి |
కన్నడ చిత్రాల జాబితా
మార్చుఈమె పాటలు పాడిన కన్నడ చలనచిత్రాలు[1]:
- మహాత్మ కబీర్ (1962)
- శ్రీరామాంజనేయ యుద్ధ (1963)
- మధుమాలతి (1964)
- నాంది (1964)
- ఎమ్మె తమ్మణ్ణ (1966)
- గంగె గౌరి (1967)
- చక్రతీర్థ (1967)
- చిన్నారి పుట్టణ్ణ (1968)
- చూరిచిక్కణ్ణ (1969)
- మృత్యుపంజరదల్లి గూఢచారి 555 (1970)
- అళియ గెలెయ (1971)
- మాలతి మాధవ (1972)
- కావేరి (1975)
- ఇదు నమ్మదేశ (1976)
- మనస్సినంతె మాంగల్య (1977)
- ముయ్యిగె ముయ్యి (1978)
- భలే హుడుగ (1978)
- అత్తెగె తక్క సొసె (1979)
- పట్టణక్కె బంద పత్నియరు (1980)
- నాగ కాలభైరవ (1981)
- నంబర్ ఐదో ఎక్క (1981)
- అవళిజవళి (1981)
- గుణ నోడి హెణ్ణు కొడు (1982)
- కళసాపురద హుడుగరు (1982)
- కార్మిక కళ్ళనల్ల (1982)
- సువర్ణ సేతువె (1982)
- కల్లువీణె నుడియితు (1883)
- రుద్రనాగ (1984)
- బెంకి బిరుగాళి (1984)
- అదే కణ్ణు (1985)
- ధృవతారె (1985)
- జ్వాలాముఖి (1985)
- లక్ష్మీకటాక్ష (1985)
- మరియద మాణిక్య (1985)
- మారుతి మహిమె (1985)
- తాయియ హోణె (1985)
- స్నేహ సంబంధ (1985)
- మధుర బాంధవ్య (1986)
- బజార్ భీమ (1987)
- మానసవీణె (1987)
- శివభక్త మార్కాండేయ (1987)
- హృదయపల్లవి(1987)
- ఊరిగిట్ట కోళ్ళి (1988)
- సంసార నౌకె (1989)
- హళ్ళియ సురాసురరు (1990)
మూలాలు
మార్చుబయటిలింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో బెంగుళూరు లత పేజీ