బెర్బెరిన్
బెర్బెరిన్ తెలుపు లేదా పసుపు, స్ఫటికాకార, నీటిలో కరిగే ఆల్కలాయిడ్, బార్‌బెర్రీ లేదా గోల్డెన్‌సీల్ నుండి లభిస్తుంది, దీనిని యాంటీపైరోటిక్, యాంటీ బాక్టీరియల్, జీర్ణకారి మందుగా ఉపయోగిస్తారు.రసాయన ఫార్ములాC20H19NO5.[1]బెర్బెరిన్ ఒక ఆర్గానిక్ హెటెరోపెంటాసైక్లిక్ సమ్మేళనం, ఆల్కలాయిడ్ యాంటీబయాటిక్, బొటానికల్ యాంటీ ఫంగల్ ఏజెంట్, బెర్బెరిన్ ఆల్కలాయిడ్.[2]హైడ్రాస్టిస్ కెనాడెన్సిస్ L., బెర్బెరిడేసి మొక్కల నుండి వెలికి తీసే ఆల్కలాయిడ్. ఇది అనేక ఇతర మొక్కలలో కూడా కనిపిస్తుంది. ఇది ఆంత్రేతరంగా సాపేక్షంగా విషపూరితమైనది, కానీ వివిధ పరాన్నజీవి, ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లకు, యాంటీడైరియాల్‌గా నోటి ద్వారా తీసుకునే మందుగా ఉపయోగించబడుతుంది.[3]బెర్బెరిన్ అనేది గోల్డెన్సల్, బార్‌బెర్రీ, ఒరెగాన్ ద్రాక్షతో సహా అనేక బొటానికల్ ఉత్పత్తులలో కనిపించే క్వాటర్నరీ అమ్మోనియా సమ్మేళనం, ఇది స్థూలకాయం, మధుమేహం, హైపర్‌లిపిడెమియా, గుండె వైఫల్యం, హెచ్.పైలోరీ ఇన్‌ఫెక్షన్ వంటి అనేక పరిస్థితుల కోసం దాని ఉద్దేశించిన యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాల కోసం ఉపయోగించబడుతుంది.,పెద్ద ప్రేగు అడెనోమా నివారణకు కూడా ఉపయోగింపబడుతుంది. [4]
చరిత్ర
మార్చుబెర్బెరిన్ పసుపు రంగుకు ప్రసిద్ధి చెందిన ఒక మొక్క ఆల్కలాయిడ్. ఇది సాంప్రదాయ ఆరోగ్య పద్ధతుల్లో ఉపయోగించడంతో పాటు ఉన్ని, పట్టు వంటి బట్టలపై వస్త్ర రంగుగా కూడా ఉపయోగించబడింది.పురాతన చైనాలో సుదీర్ఘ చరిత్రతో, బెర్బెరిన్ యొక్క మొదటి ఉపయోగం షెన్ నాంగ్ బెన్‌కో జింగ్ లేదా ది డివైన్ ఫార్మర్స్ క్లాసిక్‌లో నమోదు చేయబడింది, ఇది మౌఖిక సంప్రదాయం ద్వారా సంకలనం చేయబడిన ఔషధ మొక్కల గురించిన పుస్తకం.చైనీస్ సంప్రదాయంలో, బెర్బెరిన్‌ను 3000 BCలో దేవత షెనాంగ్ ఉపయోగించారు, అతను పురాతన చైనీస్ ప్రజలకు వ్యవసాయం, మూలికా ఆరోగ్య పద్ధతుల గురించి బోధించాడని చెప్పబడింది. బెర్బెరిన్ సాంప్రదాయ ఆయుర్వేద ఆరోగ్య పద్ధతులలో కూడా ఉపయోగించబడింది.[5]
వృక్ష సంబంధి వనరులు
మార్చుఅన్నోనేసి (అన్నికియా, కోయిలోక్లైన్, రోలినియా, జిలోపియా), బెర్బెరిడేసి (బెర్బెరిస్, కౌలోఫిలమ్, జెఫెర్సోనియా, మహోనియా, నందినా, సినోపోడోఫిల్లమ్) (మెనోపావెరినోఫిలమ్) (అర్జెమోన్, బోకోనియా, చెలిడోనియం, కోరిడాలిస్, ఎస్చ్‌స్చోల్జియా, గ్లాసియం, హున్నెమానియా, మాక్లేయా, పాపావర్, సాంగునారియా), రానున్‌క్యులేసి (కాప్టిస్, హైడ్రాస్టిస్,, క్సాంతోర్‌హిజా),, రుటాసియే (ఎవోడియా, ఫెలోడెండ్రాన్,వంటి వివిధ మొక్కల కుటుంబాలు, జాతుల నుండి బెర్బెరిన్ కనుగొనబడింది, వేరుచేయబడింది, లెక్కించబడింది.బెర్బెరిస్ జాతి మొక్క,బెర్బెరిన్ యొక్క అత్యంత విస్తృతంగా పంపిణీ చేయబడిన సహజ వనరుగా ప్రసిద్ధి చెందింది.B.వల్గారిస్ యొక్క బెరడు 8% కంటే ఎక్కువ ఆల్కలాయిడ్‌లను కలిగి ఉన్నది,అందులో బెర్బెరిన్ ప్రధాన ఆల్కలాయిడ్ సుమారు 5% వరకు వున్నది.[6][7]
అర్జెమోన్ మెక్సికానాతో సహా అనేక ఔషధ మొక్కల జాతుల బెరడులు, ఆకులు, కొమ్మలు, రైజోమ్‌లు, వేర్లు, కాండంలలో కూడా బెర్బెరిన్ విస్తృతంగా ఉంటుంది.[8] అలాగే బెర్బెరిస్ అరిస్టాటా, బి. అక్విఫోలియం, బి. హెటెరోఫిల్లా, బి. బీనియానా, కాస్సినియం ఫెనెస్ట్రాటం మొక్కలలో[9]కూడా లభిస్తుంది.
సంగ్రహం
మార్చుబెర్బెరిన్, ఒక క్వాటర్నరీ ప్రోటోబెర్బెరిన్ ఆల్కలాయిడ్ (QPA) అనేది దాని తరగతి/వర్గం లో విస్తృతంగా పంపిణీ చేయబడిన ఆల్కలాయిడ్‌లలో ఒకటి.QPA ఆల్కలాయిడ్స్‌ను వాటి మాతృక నుండి వేరుచేయడం అనేక పద్ధతులను ఉపయోగించి చేయవచ్చు.ఈ పద్ధతుల వెనుక ఉన్న సూత్రాలు ప్రోటోబెర్బెరిన్ ఉప్పు, బేస్/క్షారం మధ్య పరస్పర మార్పిడి ప్రతిచర్యను కలిగి ఉంటాయి.లవణాలు నీటిలో కరుగుతాయి, ఆమ్ల, తటస్థ మాధ్యమంలో స్థిరంగా ఉంటాయి, అయి తే మూల క్షారభాగం సేంద్రీయ ద్రావకాలలో కరుగుతుంది.అందువలన వెలికితీత ప్రక్రియలో, ప్రోటోబెర్బెరిన్ లవణాలు వాటి నిర్దిష్ట క్షారాలుగా మార్చబడతాయి, సేంద్రీయ ద్రావకాలలో మరింతగా సంగ్రహించబడతాయి.[10][7]
బెర్బెరిన్ సంగ్రహణ విషయంలో, మెసెరేషన్(maceration), పెర్కోలేషన్(percolation), సోక్స్‌లెట్, కోల్డ్ లేదా హాట్ కంటిన్యూస్ ఎక్స్‌ట్రాక్షన్ వంటి క్లాసికల్ ఎక్స్‌ట్రాక్షన్ పద్దతులు, మిథనాల్, ఇథనాల్, క్లోరోఫామ్, సజల,/లేదా ఆమ్లీకృత మిశ్రమాల వంటి విభిన్న ద్రావణి వ్యవస్థలను ఉపయోగి స్తున్నారు.కాంతి, వేడికి స్పందించే బెర్బెరిన్ యొక్క సున్నితత్వ గుణం దాని వెలికితీతకు ప్రధాన సవాలు.అందువల్ల, అధిక ఉష్ణోగ్రత, కాంతికి గురికావడం బెర్బెరిన్ క్షీణతకు దారితీస్తుంది, తద్వారా దాని మాతృక రికవరీని ప్రభావితం చేస్తుంది.తన అధ్యయనంలో బాబు, ఇతరులు.[11](2012) సంగ్రహణకు ముందు వెలికితీత, ఎండబెట్టడం చికిత్సలు రెండింటిలోనూ ఉష్ణోగ్రత కీలకమైన కారకాన్ని సూచిస్తుందని నిరూపించింది.
వెలికితీత ఉష్ణోగ్రతతో పాటు, బెర్బెరిన్ సంగ్రహమంలో కూడా ద్రావకాల(solvents) ఎంపిక కీలకమైన దశగా పరిగణించబడుతుంది.ఎక్కువగా ఉపయోగించే వెలికితీత ద్రావకాలు.మిథనాల్, ఇథనాల్, సజల లేదా ఆమ్లీకృత మిథనాల్ లేదా ఇథనాల్.ఆమ్లీకృత ద్రావకాలు (సాధారణంగా 0.5% అకర్బన లేదా సేంద్రీయ ఆమ్లాల జోడింపుతో) ఫ్రీ బేస్ ఆర్గానిక్ ఆల్కలాయిడ్స్‌తో కలపడానికి, వాటిని అధిక ద్రావణీయతతో ఆల్కలాయిడ్ లవణాలుగా మార్చడానికి ఉపయోగిస్తారు.[12][13]0.34% ఫాస్పోరిక్ యాసిడ్ గాఢత ఉపయోగించడం సరైనదిగా పరిగణించబడింది. అంతేకాకుండా, రిఫ్లక్స్(reflux), సాక్స్‌లెట్ వెలికితీత వంటి ఇతర సాంప్రదాయిక వెలికితీత పద్ధతులతో పోల్చినప్పుడు, కోల్డ్ యాసిడ్ అసిస్టెడ్ ఎక్స్‌ట్రాక్షన్ 1.1 రెట్లు అధిక బెర్బెరిన్ దిగుబడిని ఇచ్చింది.బెర్బెరిన్ వెలికితీతలో సాంప్రదాయ పద్ధతులు విస్తృతంగా ఉపయోగించబడుతున్నప్పటికీ, ఈ మధ్యకాలంలో అనేక ఇతర విభిన్న పద్ధతులు అభివృద్ధి చేయబడ్డాయి.ఇది మెరుగైన వెలికితీత సామర్థ్యం, తగ్గిన వెలికితీత సమయం, వెలికితీతలో ఉపయోగించే ద్రావకాల ఘనపరిమాణాల తగ్గింపుకు దారితీసింది.[7]
రసాయన నిర్మాణం
మార్చుదాని రసాయన నిర్మాణానికి సంబంధించి, బెర్బెరిన్‌లో మూడు బెంజిను వలయాలు, అమోనియం యోగిక నైట్రోజన్‌ను కలిగి ఉంటుంది, ఇది π–π స్టాకింగ్, ఎలక్ట్రానిక్ ఇంటరాక్షన్‌ల ద్వారా ACHE యొక్క CAS లేదా PASకి బంధించవచ్చు, తత్ఫలితంగా ACHE యొక్క సంభావ్య నిరోధకంగా ఉపయోగించవచ్చు.[14]బెర్బెరిన్ యొక్క నిర్మాణం డైహైడ్రోయిసోక్వినోలిన్ రింగ్, సమతల లక్షణాలతో కూడిన ఐసోక్వినోలిన్ రింగ్‌ను కలిగి ఉంటుంది ). సౌష్టవా న్ని నాలుగు వలయాలుగా విభజించవచ్చు, A, B, C, D, A రింగ్ యొక్క C2, C3. కార్బన్ వలయం బెర్బెరిన్ యొక్క చాలా జీవసంబంధ కార్యకలాపాలకు బాధ్యత వహించే మిథైలెనెడియాక్సి సమూహాన్ని ఏర్పరుస్తుంది.[15]C" రింగ్ ఒక క్వాటర్నరీ అమ్మోనియం నిర్మాణాన్ని కలిగి ఉంటుంది (ఆరోమాటిక్ రింగ్‌లో N+తో), ఇది యాంటీ బాక్టీరియల్ చర్యకు అవసరం.[16]"D" రింగ్‌లో, C9, C10 ప్రతి ఒక్కటి మెథాక్సీ సమూహానికి జోడించబడ్డాయి. ప్రస్తుతం, బెర్బెరిన్ యొక్క నిర్మాణ సవరణ అధ్యయనాలు ప్రధానంగా "C", "D" రింగ్‌లపై దృష్టి సారించాయి.[17][18]
భౌతిక ధర్మాలు
మార్చుబెర్బెరిన్ అనేది 145.1–146.7°C ద్రవీభవన స్థానం కలిగిన పసుపు ఘన పదార్థం; ఇది వేడి నీటిలో కరుగుతుంది, చల్లటి నీరు లేదా ఇథనాల్‌లో కొద్దిగా కరుగుతుంది, బెంజీన్, ఈథర్, క్లోరోఫామ్, ఇతర సేంద్రీయ ద్రావకాలలో కరగదు.[15]
లక్షణం/గుణం | మితి/విలువ |
అణు ఫార్ములా | C20H18NO+4 |
అణు భారం | 336.4 గ్రా/మోల్[19] |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 145°C[20] |
మరుగు స్థానం | 486.8°C(స్థూల అంచనా) [21] |
సాంద్రత | 1.2976 (స్థూల అంచనా)[21] |
వక్రీభవన గుణకం | 1.5800(అంచనా)[21] |
నీటిలో ద్రావణీయత | 43.48గ్రా/లీ(25ºC) [21] |
ఔషధం గా వినియోగం
మార్చు- ఇది మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు వంటి ఇతర పరిస్థితులకు చికిత్స చేయడంలో సహాయపడవచ్చు. అయితే, కడుపు నొప్పి, వికారం వంటి దుష్ప్రభావాలు కలిగి ఉన్నది.[22]
- ఇది హృదయ స్పందనను బలోపేతం చేయడంలో సహాయపడవచ్చు, ఇది కొన్ని గుండె పరిస్థితులతో ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది బ్యాక్టీరియాను చంపవచ్చు, శరీరం రక్తంలో చక్కెరను ఎలా ఉపయోగిస్తుందో నియంత్రించడంలో సహాయపడుతుంది, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా రక్తంలో ఇతర కొవ్వులు, అధిక రక్తపోటు కోసం ప్రజలు సాధారణంగా బెర్బెరిన్‌ను ఉపయోగిస్తారు. ఇది కాలిన గాయాలు, క్యాన్సర్ పుండ్లు, కాలేయ వ్యాధి, అనేక ఇతర పరిస్థితులకు కూడా ఉపయోగించబడుతుంది, అయితే ఈ ఉపయోగాలలో చాలా వాటికి మద్దతు ఇవ్వడానికి మంచి శాస్త్రీయ ఆధారాలు లేవు.[23]
- బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడంలో, అనేక దీర్ఘకాలిక పరిస్థితుల నుండి రక్షించడంలో ఇది సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.[24]
- ఇది ఇతర ప్రయోజనాలతో కూడా ముడిపడి ఉండవచ్చు, డిప్రెషన్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వంటి పరిస్థితుల చికిత్సలో సహాయపడుతుంది.
- ఇంకా, 2017 పరిశీలనా అధ్యయనం ప్రకారం, 12 వారాలపాటు ప్రతిరోజూ 1.2 నుండి 2.0 గ్రా బెర్బెరిన్, కర్ణిక దడ (A-Fib) ఉన్నవారిలో హృదయ స్పందన రేటును నియంత్రించడంలో అమియోడారోన్‌తో సమానంగా ప్రభావవంతంగా ఉందని తెలిసింది.[25][26]
- నోటి పుళ్ళు. బెర్బెరిన్ కలిగి ఉన్న జెల్‌ను పూయడం వల్ల నొప్పి, ఎరుపు, స్రావాలు, క్యాంకర్ పుండ్ల పరిమాణాన్ని తగ్గించవచ్చు.నోటి ద్వారా బెర్బెరిన్ తీసుకోవడం రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది, టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది, PCOS ఉన్నవారిలో నడుము నుండి తుంటి నిష్పత్తిని తగ్గిస్తుంది.[27]
- నోటి ద్వారా ఒంటి గా లేదా ఇతర పదార్ధాలతో, తక్కువ మొత్తం కొలెస్ట్రాల్, బెర్బెరిన్ తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో ,తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL లేదా "చెడు") కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడవచ్చు.[27]
మోతాదు
మార్చుబెర్బెరిన్ సప్లిమెంట్స్ వాదకం కోసం నిర్ధిష్తమైన మోతాదు లేదు.అయినప్పటికీ, చాలా అధ్యయనాలు రెండు సంవత్సరాల వరకు .రోజుకు 0.4, 2 g మధ్య మోతాదులతోతీసుకున్నను ప్రయోజనాలను చూపించాయి.[28][25]
- దాని యొక్క యాంటీ డయేరియా, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్‌ల కోసం ఔషధంగా వాడవచ్చునని ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ నేచురల్ మెడిసిన్‌లో ఇమ్యునాలజీ ప్రొఫెసర్ హీథర్ జ్వికీ, Ph.D చెప్పారు.[29]
దుష్పలితాలు
మార్చు- గర్భధారణ సమయంలో బెర్బెరిన్ సురక్షితం కాదని భావిస్తారు, ఎందుకంటే ఇది ప్లాసెంటాను దాటి అభివృద్ధి చెందుతున్న పిండానికి హాని కలిగిస్తుంది. పిల్లలకు పాలిచ్చె తల్లులకు బెర్బెరిన్ కూడా సిఫారసు చేయబడలేదు, ఎందుకంటే ఇది తల్లి పాల ద్వారా శిశువుకు బదిలీ చేయబడుతుంది.[30]
- సాధారణ దుష్ప్రభావాలు అతిసారం, మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి.[25]
- నవజాత శిశువులకు బెర్బెరిన్ ఇవ్వడం సురక్షితం కాదు. ఇది తీవ్రమైన కామెర్లు ఉన్న నవజాత శిశువులలో సంభవించే అరుదైన మెదడు దెబ్బతినడానికి కారణమయ్యే కెర్నిటెరస్ కల్గించవచ్చు.[25][31] పెద్ద పిల్లలలో బెర్బెరిన్ సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి తగినంత విశ్వసనీయ సమాచారం లేదు.[25]
ఇవి కూడా చదవండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "berberine". dictionary.com. Retrieved 2024-03-28.
- ↑ "CHEBI:16118 - berberine". ebi.ac.uk. Retrieved 2024-03-28.
- ↑ "Berberine". go.drugbank.com. Retrieved 2024-03-28.
- ↑ "Berberine". ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-28.
- ↑ "The Benefits and History of Buzzworthy Berberine". puritan.com. Retrieved 2024-03-28.
- ↑ Arayne M. S.,Sultana N., Bahadur S.S.(2007).The berberis story: Berberis vulgaris in therapeutics. Pak.J.Pharm.Sci.20, 83–92.
- ↑ 7.0 7.1 7.2 "Berberine". ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-28.
- ↑ Etminan M., Gill S. S., Samii A. (2005). Intake of vitamin E, vitamin C, and carotenoids and the risk of Parkinson's disease: a meta-analysis. Lancet. Neurol. 4, 362–365. 10.1016/S1474-4422(05)70097-1
- ↑ Rojsanga P., Gritsanapan W. (2005). Variation of Berberine Content in Coscinium fenestratum Stem in Thailand Market. Mahidol Univ. J. Pharm. Sci. 32, 66–70.
- ↑ (Marek et al., 2003; Grycová et al., 2007).
- ↑ Babu N. H. R., Thriveni H. N., Vasudeva R. (2012). Influence of drying methods and extraction procedures on the recovery of berberine content in Coscinium fenestratum. J. Nat. Prod. Plant Resour. 2, 540–544.
- ↑ Teng H., Choi O. (2013). Optimum extraction of bioactive alkaloid compounds from Rhizome coptidis (Coptis chinensis Franch.) using response surface methodology. Solvent Extr. Res. Dev. 20, 91–104. 10.15261/serdj.20.91
- ↑ "Optimization of ultrasonic-assisted extraction of bioactive alkaloid compounds from rhizoma coptidis (Coptis chinensis Franch.) using response surface methodology". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-03-28.
- ↑ "Berberine–Melatonin Hybrids". sciencedirect.com. Retrieved 2024-03-28.
- ↑ 15.0 15.1 "Physical and Chemical Properties of Berberine". frontiersin.org. Retrieved 2024-03-28.
- ↑ Gaba, S., Saini, A., Singh, G., and Monga, V. (2021). An Insight into the Medicinal Attributes of Berberine Derivatives: A Review. Bioorg. Med. Chem. 38, 116143. doi:10.1016/j.bmc.2021.116143
- ↑ Xiao, D., Liu, Z., Zhang, S., Zhou, M., He, F., Zou, M., et al. (2018). Berberine Derivatives with Different Pharmacological Activities via Structural Modifications. Mini Rev. Med. Chem. 18 (17), 1424–1441. doi:10.2174/1389557517666170321103139
- ↑ "The Quest to Enhance the Efficacy of Berberine for Type-2 Diabetes and Associated Diseases: Physicochemical Modification Approaches". mdpi.com. Retrieved 2024-03-28.
- ↑ Computed by PubChem 2.2 (PubChem release 2021.10.14)
- ↑ "Showing metabocard for Berberine". hmdb.ca/. Retrieved 2024-03-28.
- ↑ 21.0 21.1 21.2 21.3 "Berberine". chemicalbook.com. Retrieved 2024-03-28.
- ↑ "Everything you need to know about berberine". medicalnewstoday.com. Retrieved 2024-03-28.
- ↑ "Berberine-Uses,Side Effects,and More". webmd.com. Retrieved 2024-03-28.
- ↑ "Berberine–A Powerful Supplement With Many Benefits". healthline.com. Retrieved 2024-03-28.
- ↑ 25.0 25.1 25.2 25.3 25.4 "What is Berberine?". health.com. Retrieved 2024-03-29.
- ↑ Zheng H, Zhu F, Miao P, Mao Z, Redfearn DP, Cao RY. Antimicrobial Natural Product Berberine Is Efficacious for the Treatment of Atrial Fibrillation. Biomed Res Int. 2017;2017:3146791. doi:10.1155/2017/3146791
- ↑ 27.0 27.1 "Berberine-Uses,Side Effects,and More". webmd.com. Retrieved 2024-03-29.
- ↑ "Antimicrobial Natural Product Berberine Is Efficacious for the Treatment of Atrial Fibrillation". hindawi.com. Retrieved 2024-03-29.
- ↑ "Berberine: Uses,Benefits,Supplements And Side Effects". forbes.com. Retrieved 2024-03-29.
- ↑ "Berberine". medlineplus.gov. Retrieved 2024-03-29.
- ↑ "Is berberine a safe alternative treatment for diabetes?". nebraskamed.com. Retrieved 2024-03-29.