బేగం పారా (1926 డిసెంబరు 25 - 2008 డిసెంబరు 9) 1940లు, 1950లలో ఎక్కువ చిత్రాలలో చేసిన ఒక భారతీయ హిందీ చలనచిత్ర నటి.[1][2] దాదాపు 50 ఏళ్లపాటు విరామం తీసుకుని 2007లో, ఆమె తిరిగి సంజయ్ లీలా బన్సాలీ సావరియాలో సోనమ్ కపూర్ అమ్మమ్మ పాత్ర పోషించింది. 1950వ దశకంలో ఆమె బాలీవుడ్ గ్లామర్ గర్ల్‌గా ప్రసిద్ధి చెందింది, ఎంతగా అంటే, లైఫ్ మ్యాగజైన్ ఆమెతో ఒక ప్రత్యేక సెషన్‌ను ఆమె చక్కటి ఛాయాచిత్రాలకు అంకితం చేసింది.[3][4]

బేగం పారా
1951లో లైఫ్ మ్యాగజైన్ ఫోటో షూట్ లో బేగం పారా
జననం
జుబేదా ఉల్ హక్

(1926-12-25)1926 డిసెంబరు 25
జీలం, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత పంజాబ్, పాకిస్తాన్, పాకిస్తాన్)
మరణం2008 డిసెంబరు 9(2008-12-09) (వయసు 81)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1944–1956, 2007
జీవిత భాగస్వామినాసిర్ ఖాన్ (భారతీయ సినిమా నటుడు)
పిల్లలు3, అయూబ్ ఖాన్ (భారతీయ సినిమా నటుడు)తో సహా
బంధువులుదిలీప్ కుమార్ (బావమరిది)
రుఖ్సానా సుల్తానా (సోదరి)
అమృతా సింగ్ (మనవరాలు)
సైరా బాను ( వదిన)

ప్రారంభ జీవితం

మార్చు

బేగం పారా బ్రిటిష్ ఇండియాలోని జీలమ్‌(ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది)లో జుబేదా ఉల్ హక్‌గా జన్మించింది . ఆమె కుటుంబం అలీఘర్‌కు చెందినది. ఆమె తండ్రి, మియాన్ ఎహ్సానుల్-హక్, ప్రస్తుతం ఉత్తర రాజస్థాన్‌లో ఉన్న బికనీర్ రాచరిక రాష్ట్రానికి న్యాయ సేవ చేసాడు, అక్కడ అతను అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించాడు. అలాగే, ఆయన తన కాలంలో మంచి క్రికెటర్.[5] బేగం పారా చాలా క్రమశిక్షణతో, ఇంకా ఉదారంగా పెరిగింది. ఆమె తన బాల్యాన్ని బికనీర్‌లో గడిపింది. ఆమె అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో చదువుకుంది. ఆమె అన్నయ్య మస్రురుల్ హక్, 1930ల చివరలో నటుడిగా కెరీర్ మల్చుకోవడానికి ముంబై వెళ్లాడు. అక్కడ అతను బెంగాలీ నటి ప్రోతిమా దాస్‌గుప్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.[6]

బేగం పారాకు లుక్స్‌తో బాగా ఆకట్టుకునే గుణం ఉండడంతో ఆమెకు చాలా పాత్రలకు అవకావాలు వచ్చాయి. అలాంటి ఒక ఆఫర్ శషధర్ ముఖర్జీ, దేవికా రాణి నుండి వచ్చింది. ఆమె తండ్రి అయిష్టంగానే ఆమె కోరికలను అంగీకరించాడు.[7]

కెరీర్

మార్చు

బేగం పారా నటించిన మొదటి చిత్రం పూణేలోని ప్రభాత్ స్టూడియోస్ నుండి 1944లో రూపొందిన చాంద్. ఈ చిత్రంలో ప్రేమ్ ఆదిబ్ హీరోగా నటించగా, సితార దేవి వ్యాంప్‌గా నటించింది. ఆ తరువాత, ఆమె, ఆమె కోడలు ప్రొతిమా ‘పిగ్మాలియన్’ నవల ఆధారంగా ఛమియా (1945) అనే చిత్రాన్ని నిర్మించారు, అది మళ్లీ భారీ విజయాన్ని సాధించింది.[8]

ఆమె సోహ్ని మహివాల్ (1946), ఈశ్వర్‌లాల్, దీక్షిత్‌లతో జంజీర్ (1947), రాజ్ కపూర్‌తో నీల్ కమల్ (1947), నర్గీస్‌తో మెహందీ (1947), భరత్ భూషణ్, గీతా బాలిలతో సుహాగ్ రాత్ (1948), ఝల్కా (1948), అజిత్ ఖాన్‌తో మెహర్బానీ (1950) వంటి చిత్రాలలో నటించింది.[9]

ఆమె ఉస్తాద్ పెడ్రో (1951)లో కూడా పని చేసింది. దీనిని అప్పటి సుప్రసిద్ధ నటుడు షేక్ ముఖ్తార్ నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇది ఒక ఆహ్లాదకరమైన చిత్రం, యాక్షన్, రొమాన్స్, స్టంట్స్‌తో నిండిపోయి ఉంటుంది.[10]

1951లో ఆమె లైఫ్ మ్యాగజైన్ ఫోటో షూట్ కోసం ఫోటోగ్రాఫర్ జేమ్స్ బర్క్ కెమేరాకు పోజులిచ్చింది.[11] ఆమె మొదటి ఇన్నింగ్స్ లో చివరి పాత్ర 1956లో కర్ భలా చిత్రంలో పోషించింది.[12] మొఘల్-ఎ-ఆజం (1960)లో [[నిగార్ సుల్తానా|నిగర్ సుల్తానా]] పాత్ర 'బహార్'లో నటించడానికి ఆమెకు ఆఫర్ వచ్చింది. అయితే, ఆమె తన ఇమేజ్‌కి వ్యతిరేకంగా భావించినందున ఆమె పాత్రను పోషించడానికి నిరాకరించింది.[13]

ఆమె 2007లో సంజయ్ లీలా బన్సాలీ సావరియాలో సోనమ్ కపూర్ అమ్మమ్మగా వెండితెరపై శక్తివంతమైన పునరాగమనం చేసింది. అయితే, ఇది ఆమె చివరి చిత్రంగా మారింది.[14]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె నటుడు, చిత్రనిర్మాత, బాలీవుడ్ స్టార్ దిలీప్ కుమార్ తమ్ముడు అయిన నటుడు నాసిర్ ఖాన్‌ను వివాహం చేసుకుంది.[15] వారికి లుబ్నా, నాదిర్, నటుడు అయూబ్ ఖాన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే, ఆమెకు ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు, కిచ్చు దాండియా ఒక జ్యువెలరీ డిజైనర్, తాహురా ఖాన్, జోహ్రా ఖాన్.

ఆమె భర్త 1974లో మరణించాడు.[16] ఆమె భర్త మరణించిన తర్వాత, ఆమె తన కుటుంబంతో కలిసి ఉండటానికి 1975లో కొంతకాలం పాకిస్థాన్‌కు వెళ్లింది, రెండు సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి భారతదేశానికి మకాం మార్చింది.[17]

ఫిల్మోగ్రఫీ

మార్చు

(పాక్షికం)

  • సావరియా (2007) - సకీనా అమ్మమ్మ
  • కర్ బాలా
  • కిస్మెత్ కా ఖేల్ (1956)
  • పెహ్లీ జనక్ (1955)
  • షాజాదా (1955)
  • లైలా మజ్ను (1953)
  • నయా ఘర్ (1953)
  • 'బాగ్దాద్' (1952)
  • పాగల్ (1950)
  • మెహర్బానీ (1950)
  • జర్నా (1948)
  • షహనాజ్ (1948)
  • సుహాగ్ రాత్ (1948) - పారో
  • మెహందీ (1947)
  • నీల్ కమల్ (1947)
  • జంజీర్ (1947)
  • 'ది చైన్' (1947)
  • సోహ్ని మహివాల్ (1946)
  • ఛామియా (1945)
  • చాంద్ (1944)

ఆమె తన 82వ ఏట 2008 డిసెంబరు 9న ముంబైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచింది.[18]

మూలాలు

మార్చు
  1. "5 noted personalities who left Pakistan for India". 2 June 2015.
  2. "Ms Oomph: V Gangadhar meets Begum Para, the original pin-up girl". Rediff.com. 29 November 1997.
  3. Photos, Old Indian. "Sensuous Photographs of Hindi Movie Star Begum Para by Life Magazine Photographer James Burke - 1951".
  4. Hasan, Khalid (2 August 2015). "Begum Para: the Last Glamour Girl". The Friday Times.
  5. Hasan, Khalid (2 August 2015). "Begum Para: the Last Glamour Girl". The Friday Times.
  6. "Begum Para – Memories – Cineplot.com".
  7. "Begum Para – Memories – Cineplot.com".
  8. "6 Facts About Begum Para, One Of Bollywood's Most Legendary Actresses Ever". The Times of India. 8 December 2015.
  9. "Begum Para – Memories – Cineplot.com".
  10. "Rediff On The Net, Movies: An interview with Begum Para". Rediff.com.
  11. collection, Isa Daudpota (22 August 2014). "Begum Para (1951)". The Friday Times.
  12. "6 Facts About Begum Para, One Of Bollywood's Most Legendary Actresses Ever". The Times of India. 8 December 2015.
  13. "Begum Para – Memories – Cineplot.com".
  14. "6 Facts About Begum Para, One Of Bollywood's Most Legendary Actresses Ever". The Times of India. 8 December 2015.
  15. Gangadhar, V. (17 September 2006). "The return of Begum Para". The Hindu. Archived from the original on 12 November 2007.
  16. "Begum Para | Begum Para". Outlookindia.com. 28 May 1997. Retrieved 22 February 2014.
  17. "5 noted personalities who left Pakistan for India". The Express Tribune. 2 June 2015.
  18. మూస:ওয়েব উদ্ধৃতি
"https://te.wikipedia.org/w/index.php?title=బేగం_పారా&oldid=4340117" నుండి వెలికితీశారు