అజిత్ ఖాన్

హిందీ సినిమా నటుడు

హమీద్ అలీ ఖాన్ (1922, జనవరి 27 - 1998, అక్టోబరు 22), అజిత్‌ పేరుతో సుపరిచితుడు. తెలంగాణకు చెందిన సినిమా నటుడు. హిందీ సినిమారంగంలో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించాడు.[1] బెఖాసూర్, నాస్తిక్, బడా భాయ్, మిలన్, బారా దారీ వంటి ప్రముఖ హిందీ సినిమాలలో ప్రధాన నటుడిగా, ఆ తరువాత మొఘల్-ఎ-ఆజం, నయా దౌర్‌లో రెండవ ప్రధాన పాత్రలో నటించాడు.[2]

అజిత్ ఖాన్
అజిత్ ఖాన్ (1956)
జననం
హమీద్ అలీ ఖాన్

(1922-01-27)1922 జనవరి 27
మరణం1998 అక్టోబరు 22(1998-10-22) (వయసు 76)
వృత్తినటుడు
పిల్లలుషెజాద్ ఖాన్

జననం, విద్య

మార్చు

అజిత్ 1922, జనవరి 27న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరం, గోల్కొండ కోట సమీపంలోని దక్కనీ ముస్లిం కుటుంబంలో హమీద్ అలీ ఖాన్‌గా జన్మించాడు.[3] తండ్రి బషీర్ అలీ ఖాన్ నిజాం సైన్యంలో పనిచేస్తుండేవాడు. తల్లి సుల్తాన్ జెహాన్ బేగం గృహిణి. నలుగురు పిల్లలలో హమీద్ ఒకడు; అతనికి ఒక తమ్ముడు వాహిద్ అలీ ఖాన్, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఉర్దూ, తెలుగు భాషలలో మాట్లాడేవాడు. వరంగల్‌లో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన అజిత్, తరువాత హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివాడు.

సినిమారంగం

మార్చు

అందంగా ఉన్న అజిత్ పాఠశాల వయసులోనే సినిమా హీరో చేయడానికి ప్రయత్నించమని తన స్నేహితులు చెప్పేవారు. పాఠశాల చదువు పూర్తిచేసిన తర్వాత, ముంబైకి వెళ్ళడంకోసం డబ్బులు లేకపోవడంతో తన పాఠ్యపుస్తకాలను అమ్మేసి, తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళాడు. కాలేజీ పుస్తకాలు అమ్ముకొని ఇంటి నుంచి ముంబైకి పారిపోయిన అజిత్, 1940ల్లో అదృష్టం అతనికి అనుకూలించలేదు. సినిమారంగంలో నిలకడకోసం, తాను పోషించుకోవడానికి అనేక సినిమాలలో "ఎక్స్‌ట్రా"గా పనిచేశాడు. 1946లో తొలిసారిగా షాహే మిశ్రా సినిమాలో గీతా బోస్ పక్కన నటించాడు. సికిందర్ (వనమాలాతో), హతిమ్తాయ్ (1947), ఆప్ బీటీ (ఖుర్షీద్‌తో), సోనే కి చిదియా (లీలా కుమారితో), ధోలక్ ( మీనా షోరితో), చందా కి చాందిని (మోనికా దేశాయ్‌తో) మొదలైన సినిమాలలో నటించాడు. నళినీ జయవంత్‌తో అత్యధిక సినిమాలు (15) చేశాడు. విలన్‌గా మొదటి సినిమా సూరజ్, ఆ తరువాత జంజీర్, యాదోన్ కి బారాత్ వంటి సినిమాలలో విలన్ పాత్రల్లో నటించాడు.

నానా భాయ్ భట్ సలహా మేరకు "అజిత్" అనే పేరును తన స్క్రీన్-నేమ్‌గా పెట్టుకున్నాడు. బెఖాసూర్‌ సినిమా టైటిల్స్ లో తన పేరును అజిత్ గా వేసుకున్నాడు. మధుబాలతో కలిసి నటించిన బెఖాసూర్ సినిమా 1950లో వచ్చిన అతిపెద్ద సినిమాలలో హిట్‌ సినిమాగా నిలిచింది. ఆ తరువాత హీరోగా నాస్తిక్ (1953), బడా భాయ్, మిలన్, బారాదరి, ధోలక్ వంటి సినిమాలలో నటించాడు. నాస్తిక్ (1953)లో "దేఖ్ తేరే సంసార్ కి హాలత్ క్యా హో గయీ భగవాన్" పాట అజిత్ పై చిత్రీకరించబడింది. కొంతకాలం తరువాత రెండవ ప్రధాన పాత్రలకు మారాడు. అలా నయా దౌర్, మొఘల్-ఎ-ఆజం సినిమాలలో నటించాడు.

తన నాలుగు దశాబ్దాల సినిమారంగ జీవితంలో, పృథ్వీరాజ్ కపూర్, సోహ్రబ్ మోడీ, అమితాబ్ బచ్చన్, ఐఎస్ జోహార్, దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్, ధర్మేంద్ర మొదలైన నటులతో, అనేకమంది నటీమణులతో నటించాడు.[4] 57 సినిమాలలో విలన్‌గా నటించాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

అజిత్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మొదటి భార్య ఆంగ్లో-ఇండియన్, క్రిస్టియన్. వివాహమైన కొద్దికాలంలోనే కొన్ని విభేదాల కారణంగా విడిపోయింది, వారికి పిల్లలు లేరు. తరువాత షాహిదాను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు కుమారులు (షాహిద్ అలీ ఖాన్, జాహిద్ అలీ ఖాన్, అబిద్ అలీ ఖాన్‌) ఉన్నారు. ఆ తరువాత సారాను వివాహం చేసుకున్నాడు. వారికి షెజాద్ ఖాన్,అర్బాజ్ ఖాన్ ఇద్దరు కుమారులు ఉన్నారు.

నటించినవి

మార్చు
  • 1995: క్రిమినల్
  • 1994: గ్యాంగ్‌స్టర్
  • 1994: ఆ గలే లాగ్ జా
  • 1994: బేతాజ్ బాద్షా
  • 1994: ఆతీష్
  • 1993: శక్తిమాన్
  • 1993: ఆద్మీ
  • 1992: జిగర్
  • 1992: పోలీసు ఆఫీసర్
  • 1985: ఫాన్సి కే బాద్
  • 1984: రాజ్ తిలక్
  • 1984: రాజా ఔర్ రానా
  • 1983: దౌలత్ కే దుష్మన్
  • 1983: రజియా సుల్తాన్
  • 1983: మంగళ్ పాండే
  • 1982: చోర్ని
  • 1981: ఖూన్ ఔర్ పానీ
  • 1981: ఆఖ్రీ ముజ్రా
  • 1981: జ్యోతి
  • 1981: ఖుదా కసమ్
  • 1980: చోరోన్ కీ బారాత్
  • 1980: రామ్ బలరామ్
  • 1979: హీరా-మోతీ
  • 1979: మిస్టర్ నట్వర్‌లాల్
  • 1978: ఆహుతి
  • 1978: ఆజాద్
  • 1978: డెస్ పార్దేస్
  • 1978: హీరాలాల్ పన్నాలాల్
  • 1978: కర్మయోగి
  • 1978: రామ్ కసమ్
  • 1977: ఆఖ్రీ గోలీ
  • 1977: చల్తా పుర్జా
  • 1977: అంఖ్ కా తారా
  • 1977: హమ్ కిసీసే కమ్ నహీన్
  • 1976: జానెమన్
  • 1976: చరస్
  • 1976: కాళీచరణ్
  • 1976: సంగ్రామ్
  • 1975: దో ఝూట్
  • 1975: ప్రతిజ్ఞ
  • 1975: వారెంట్
  • 1974: బద్లా
  • 1974: ఖోటే సిక్కాయ్
  • 1974: పాప్ ఔర్ పుణ్య
  • 1974: పత్తర్ ఔర్ పాయల్
  • 1973: బంధే హాత్
  • 1973: చూప రుస్తం
  • 1973: ధర్మం
  • 1973: జుగ్ను
  • 1973: కహానీ కిస్మత్ కీ
  • 1973: షరీఫ్ బుద్మాష్
  • 1973: యాదోన్ కీ బారాత్
  • 1973: జంజీర్
  • 1972: దిల్ కా రాజా
  • 1972: సుల్తానా డాకు
  • 1971: అందాజ్
  • 1971: లాల్ పత్తర్
  • 1971: పరాయ ధన్
  • 1971: పతంగా
  • 1970: హీర్ రాంఝా
  • 1970: ధరి
  • 1970: జీవన్ మృత్యువు
  • 1969: ఆద్మీ ఔర్ ఇన్సాన్
  • 1969: ప్రిన్స్
  • 1968: రాజా ఔర్ రంక్
  • 1967: బాగ్దాద్ కి రాతేన్
  • 1966: సూరజ్
  • 1965: మై హూన్ అల్లాదీన్
  • 1965: నమస్తే జీ
  • 1963: షికారి
  • 1963: కబ్లీ ఖాన్
  • 1962: బర్మా రోడ్
  • 1962: టవర్ హౌస్
  • 1962: బాలికల హాస్టల్
  • 1961: ఒపెరా హౌస్
  • 1960: మొఘల్-ఎ-ఆజం
  • 1960: బారాత్
  • 1959: చార్ దిల్ చార్ రహెన్
  • 1959: గెస్ట్ హౌస్
  • 1958: మెహందీ
  • 1957: మిస్ బాంబే
  • 1957: బడా భాయ్
  • 1957: కిత్నా బాదల్ గయా ఇన్సాన్
  • 1957: నయా దౌర్
  • 1956: 26 జనవరి
  • 1956: ఆన్ బాన్
  • 1956: దుర్గేష్ నందిని
  • 1956: హలకు
  • 1955: ఆజ్ కీ బాత్
  • 1955: బారా దారి
  • 1955: మెరైన్ డ్రైవ్
  • 1955: నఖాబ్
  • 1955: షాజాదా
  • 1955: తీరందాజ్
  • 1954: మాన్
  • 1954: నాస్టిక్
  • 1954: సామ్రాట్
  • 1952: ఆనంద్ మఠం
  • 1952: మోతీ మహల్
  • 1952: తరంగ్
  • 1952: వస్నా
  • 1951: డామన్
  • 1951: ధోలక్
  • 1951: సైయన్
  • 1951: సర్కార్
  • 1950: బెకాసూర్
  • 1949: జీవన్ సాథి
  • 1949: పతంగా
  • 1945: కురుక్షేత్ర

అజిత్ 1998, అక్టోబరు 22న గుండెపోటుతో హైదరాబాదులో మరణించాడు. గోల్కొండ కోట సమీపంలోని జమాలి కుంటలో అంత్యక్రియలు జరిగాయి.[5][6]

పుస్తకం

మార్చు

అజిత్ శత జయంతి సందర్భంగా 2022, ఫిబ్రవరి 25న అజిత్: ది లయన్ అనే పేరుతో ప్రచురించిన అజిత్ జీవిత చరిత్ర పుస్తకాన్ని హైదరాబాదులోని నిజాం క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ చేతులమీదుగా ఆవిష్కరించబడింది.[7]

మూలాలు

మార్చు
  1. Kuldip Singh (17 November 1998). "Obituary: Ajit". The Independent. Archived from the original on 16 December 2013. Retrieved 27 May 2022.
  2. "Bollywood Movie Actor Ajit Khan Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2022-05-27.
  3. "Ajit Khan: The villain with a charming swag". The New Indian Express. Retrieved 2022-05-27.
  4. "Archived copy". Archived from the original on 12 August 2014. Retrieved 27 May 2022.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. Today, Telangana (2022-01-27). "Celebrating 100 years of Ajit Khan, legendary actor from Hyderabad". Telangana Today. Retrieved 2022-05-27.
  6. India, The Hans (2022-05-28). "Hyderabad: Students of MJ Engineering College develop dust, water-proof e-vehicle". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-05-27.
  7. "Book on late actor Ajit Khan launched". The New Indian Express. Retrieved 2022-05-27.