భరత్ భూషణ్

భారతదేశ నటుడు

గుడిమళ్ల భరత్ భూషణ్, (జనవరి 3, 1953 - జనవరి 31, 2022) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫోటో చిత్రకారుడు, రచయిత, జర్నలిస్టు, సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్, జనపదాల చిత్రకారుడు. తెలంగాణా సంస్కృతిని ఫోటోలతో చిత్రించిన ఆయన 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకున్నాడు.[1] తెలంగాణ బతుకమ్మ పండుగను గొప్పగా డాక్యుమెంట్ చేసి గుర్తింపు పొందాడు. ఏ ప్రముఖుడి ఫోటో కావాలన్నా పత్రికల వాళ్ళు భరత్ భూషణ్ ను సంప్రదించేవారు.

గుడిమళ్ల భరత్ భూషణ్
జననంగుడిమళ్ల భరత్ భూషణ్
(1953-01-03)1953 జనవరి 3
ఓల్డ్‌ బీట్‌బజార్‌, వరంగల్, వరంగల్ జిల్లా
మరణం2022 జనవరి 31(2022-01-31) (వయసు 69)
పద్మా కాలనీ, నల్లకుంట, హైదరాబాద్
నివాస ప్రాంతంనల్లకుంట, హైదరాబాద్
వృత్తిఛాయాగ్రహకుడు, చిత్రకారుడు
ప్రసిద్ధిచిత్రకారుడు
మతంహిందూ
భార్య / భర్తసుభద్ర
పిల్లలుఅభినవ్, అనుప్రియా
తండ్రిగుడిమల్ల అనుసూయ
తల్లిగుడిమల్ల లక్ష్మీనారాయణ

జననం, విద్య

మార్చు

భరత్ భూషణ్ 1953లో జనవరి 3న లక్ష్మీనారాయణ, అనసూయ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లులో జన్మించాడు. పద్మశాలి కుటుంబానికి చెందిన భరత్ భూషణ్ తండ్రి, వరంగల్ పాతచౌరస్తాలో బట్టల దుకాణం నడిపేవాడు. భరత్ భూషణ్ జేఎన్టీయూలో ఫోటోగ్రఫీలో డిప్లమో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ విద్యను చదువుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

భరత్ భూషణ్ కు సుభద్రతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (అభినవ్), ఒక కుమార్తె (అనుప్రియ) ఉన్నారు.

తెలంగాణ ఉద్యమం

మార్చు

పదవ తరగతిలో ఉన్నప్పుడు 1969 తెలంగాణ ఉద్యమంలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు.

కళారంగం

మార్చు

7 సొంత ఫోటో ఎగ్జిబిషన్స్ , ఇతరులతో కలిసి 6 షోలలో పాల్గొన్నాడు. వరంగల్లులో పాములపర్తి సదాశివరావు చేతులమీద తొలిసారి తన పెయింటింగ్ ప్రదర్శన ఆవిష్కరణ జరిగింది. వరంగల్ ఆర్టు సొసైటీ తనకెన్నో అవార్డులనిచ్చి గౌరవించింది. దృశ్యకళలు, ప్రదర్శనకళల మీద ఎన్నో ఆర్టికల్స్ రాసాడు. హైద్రాబాద్ ఆర్ట్ సొసైటీలో జీవితకాల సభ్యుడిగా ఉన్నాడు. పల్లెల్లోని పాత తలుపులు, మహిళలు, నగలు, అలంకారాలు తన ఫోటోలలో బంధించేవాడు. తరువాత చిత్రకళలో ప్రవేశించి గణేశుడు, హనుమంతుడు, కాలభైరవుడు వంటి తెలంగాణ దేవతల మీద వేసిన పెయింటింగ్స్ కి చాలా అవార్డులు వచ్చాయి.

అవార్డులు

మార్చు
  1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం (2015), తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2.[2]
  2. నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్టు పురస్కారం [3]

పని చేసిన సినిమాలు

మార్చు

ప్రభుత్వ ప్రోత్సాహం

మార్చు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కళలను, కళాకారులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం భరత్ భూషణ్ కు ప్రతి నెల రూ.10 వేలు పింఛను అందజేసింది.[4] ఆయన కేన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నటుడు చిరంజీవి రూ.50 వేల ఆర్థిక సాయం అందించాడు.[5][6] ఆయన మరణాంతరం చిత్రకళ, పోటోగ్రఫీలో ఆయన చేసిన కృషికిగాను సెప్టెంబర్ 2023లో రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి హైదరాబాద్‌లోని జియాగూడలో డబుల్ బెడ్రూం ఇల్లును కేటాయించింది.[7]

గుడిమల్ల భరత్ భూషణ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 2022లో జనవరి 31న హైదరాబాదు నల్లకుంటలోని తన నివాసంలో మరణించాడు.[8]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. సాక్షి, తెలంగాణ (31 May 2015). "రాష్ట్రావతరణోత్సవాల్లో ప్రతిభకు పట్టం". Sakshi. Archived from the original on 19 December 2015. Retrieved 12 October 2021.
  2. జనంసాక్షి, హైదరాబాదు (31 May 2015). "50 మందికి ఆవిర్భావ పురస్కారాలు". Archived from the original on 10 October 2020. Retrieved 2 February 2022.
  3. Andhrajyothy (20 December 2019). "నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్టు పురస్కారానికి ఫొటోగ్రాఫర్ భరత్ భూషణ్ ఎంపిక". Archived from the original on 1 January 2022. Retrieved 1 January 2022.
  4. ETV Bharat News (31 May 2021). "ఆ ముగ్గురు కళాకారులకు ప్రత్యేక పింఛన్". Archived from the original on 2 September 2021. Retrieved 2 September 2021.
  5. Andhrajyothy (23 May 2021). "ఫొటో జర్నలిస్ట్ కి చిరు సాయం". Archived from the original on 23 May 2021. Retrieved 30 December 2021.
  6. HMTV (23 May 2021). "జర్నలిస్టు భరత్ భూషణ్ కు చిరు సాయం". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  7. Namasthe Telangana (30 September 2023). "ప్రముఖ ఫోటో జర్నలిస్టు భరత్ భూషణ్ కుటుంబానికి డ‌బుల్ బెడ్రూం ఇల్లు". Archived from the original on 30 September 2023. Retrieved 30 September 2023.
  8. NTV (31 January 2022). "భరత్ భూషణ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం". Archived from the original on 31 జనవరి 2022. Retrieved 31 January 2022.