బొంభాట్
బొంభాట్, 2020 డిసెంబరు 3న విడుదలైన తెలుగు సైన్స్ ఫిక్షన్ సినిమా. సుచేతా డ్రీమ్‌వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో విశ్వస్ హన్నూర్కర్ నిర్మించిన ఈ సినిమాకు రాఘవేంద్ర వర్మ దర్శకత్వం వహించాడు.[1] సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన ఈ సినిమాలో సాయి సుశాంత్ రెడ్డి, చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి నటించగా, [2] జోష్. బి[3] సంగీతాన్ని అందించాడు. డైరెక్టుగా ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయింది.
బొంభాట్ | |
---|---|
దర్శకత్వం | రాఘవేంద్ర వర్మ |
రచన | అక్షయ్ పూల |
కథ | కె. రాఘవేంద్రరావు |
నిర్మాత | విశ్వస్ హన్నూర్కర్ |
తారాగణం | సాయి సుశాంత్ రెడ్డి చాందిని చౌదరి సిమ్రాన్ చౌదరి |
ఛాయాగ్రహణం | మంతెం సతీష్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | జోష్.బి |
నిర్మాణ సంస్థ | సుచేతా డ్రీమ్‌వర్క్స్ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల తేదీ | 3 డిసెంబరు 2020 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా సారాంశం
మార్చుపుట్టడంతోనే దురదృష్టాన్ని తన వెంట తెచ్చుకున్న విక్కి (సుశాంత్ రెడ్డి) ని ముట్టుకుంటే ఆ దురుదృష్టం తమకు కూడా వస్తుందని భావించి అతడి తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, చుట్టుపక్కన జనాలు అందరూ తనని దూరం పెడతుంటారు. మాట్లాడడానికి కూడా ఎవరూ లేకపోవడంతో ఒక సైంటిస్ట్ (శిశిర్ శర్మ) తో పరిచయం చేసుకొని, అతనితో మాట్లాడుతుంటాడు. ఇంతలో సైంటిస్ట్ చనిపోవడంతో, అతని కూతురు మాయ (సిమ్రాన్ చౌదరి) ను చూసుకోవాల్సిన బాధ్యత విక్కీపై పడుతుంది. గర్ల్ ఫ్రెండ్ చైత్ర (చాందిని చౌదరి) తో విక్కీకి ఉన్న సమస్యలను తీర్చుతున్న సమయంలో మరో మ్యాడ్ సైంటిస్ట్ (మకరంద్ దేశ్ పాండే) వీరి జీవితంలోకి వస్తాడు. ఆ తరువాత విక్కీ లైఫ్ కి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. మాయ అసలు కథ ఏమిటి? ఆమె వెనుక ఈ మ్యాడ్ సైంటిస్ట్ ఎందుకు పడుతున్నాడు అనేది మిగతా కథ.[4]
నటవర్గం
మార్చు- సాయి సుశాంత్ రెడ్డి (విక్కీ)
- చాందిని చౌదరి (చైత్ర)
- సిమ్రాన్ చౌదరి (మాయ)
- ప్రియదర్శి పులికొండ (కరణ్)
- శిశిర్ శర్మ (మాయ తండ్రి ప్రొఫెసర్ ఆచార్య)
- మకరంద్ దేశ్పాండే (మ్యాడ్ సైంటిస్ట్)
- వినీత్ కుమార్ (దాదా)
- తనికెళ్ళ భరణి (విక్కీ తండ్రి వరహామూర్తి)
- హేమ (విక్కీ తల్లి కుమారి)
- ఫిష్ వెంకట్ (దాదా అనుచరుడు)
- ప్రమోదిని (మాయ తల్లి)
- ధన్వి (చిన్నప్పటి మాయ)
- సిల్లీ మాంక్స్ సంజయ్ (చైత్ర తండ్రి)
- రమదేవి (చైత్ర అమ్మమ్మ)
పాటలు
మార్చుఈ సినిమాకు జోష్. బి సంగీతం అందించాడు. పాటలు లహరి మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.[5][6]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఇష్క్ కియా (రచన: రామాంజనేయులు)" | రామాంజనేయులు | సునీత సారధి | 4:19 |
2. | "స్వామి నాథ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | చందన బాల కళ్యాణ్, కార్తీక్, హరిణి ఇవటూరి | 5:16 |
3. | "చుప్పనాతి (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | శరణ్య శ్రీనివాస్ | 3:29 |
4. | "కాలం ప్రవాహం (రచన: గంగోత్రి విశ్వనాధ శాస్త్రి)" | గంగోత్రి విశ్వనాధ శాస్త్రి | ఎం.ఎం. కీరవాణి | 2:35 |
5. | "నువ్వంటే ఇష్ట్రమంటే (రచన: రామాంజనేయులు)" | రామాంజనేయులు | అభయ్ జోధపుర్కర్, పద్మలత రామానంద్ | 3:38 |
6. | "కాలం ప్రవాహం (రచన: గంగోత్రి విశ్వనాధ శాస్త్రి)" | గంగోత్రి విశ్వనాధ శాస్త్రి | మాస్టర్ రాహుల్ వెల్లై | 2:35 |
7. | "స్వామి నాథ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | యాజిన్ నిజార్, చందన బాల కళ్యాణ్, హరణి ఇవటూరి | 5:16 |
స్పందన
మార్చుది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు పత్రికకు చెందిన మనోజ్ కుమార్ ఈ సినిమాకు 1/5 రేటింగ్ ఇచ్చాడు. "డ్రామా లేదా లాజిక్‌లకు అందని సైన్స్ ఫిక్షన్ చిత్రం" అని రాశాడు. హిచ్కాక్ "ఎక్కడ నాటకం ప్రారంభమవుతుందో అక్కడ తర్కం ముగుస్తుంది" అన్న మాటలను సాకుగా "తర్కానికి అందని పూర్తిగా అర్ధంలేని సినిమాను రూపొందించారని కుమార్ అభిప్రాయపడ్డాడు.
"ఇది సైన్స్ కాదు. మందకొడిగా సాగిన కథ" అని ది హిందూ పత్రికకు చెందిన సంగీత దేవి రాసింది.[7] ది న్యూస్ మినిట్ పత్రికకు చెందిన జాహ్నవి రెడ్డి ఈ సినిమాకు 2/5 రేటింగ్ ఇచ్చింది.
మూలాలు
మార్చు- ↑ Arikatla, Venkat (2019-11-04). "Legendary Director Helping Telugu Science Fiction Film". greatandhra.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-22.
- ↑ "Sai Sushanth turns hero with a romcom-meets-fantasy flick - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-09-22.
- ↑ TelanganaToday. "Sushanth Reddy teams up with Simran in 'Bombhaat'". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-22.
- ↑ Sakshi (5 December 2020). "ఇది ఓ సిల్లీ రోబో!". Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.
- ↑ "Ishq Kiya Lyric Video - Bombhaat | Sushanth, Chandini, Simran | Ramanjaneyulu, Sunitha Sarathy". YouTube.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Watch Popular Telugu Trending Lyrical Song Music Video - 'Swami Natha' From Movie 'Bombhaat' Starring Sai Sushanth Reddy And Chandini Chowdary | Telugu Video Songs - Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-22.
- ↑ Dundoo, Sangeetha Devi (2020-12-03). "'Bombhaat' movie review: Whose misfortune is it anyway?". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-12-05.