బొజ్జల గోపాలకృష్ణారెడ్డి

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి

నియోజకవర్గం శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా

వ్యక్తిగత వివరాలు

జననం (1949-04-15) 1949 ఏప్రిల్ 15 (వయసు 75)
ఊరందూరు, మద్రాసు రాష్ట్రం, (ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్)
మరణం 2022 మే 6
హైదరాబాదు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి బృంద
సంతానం పద్మ, సుధీర్
నివాసం జూబ్లీ హిల్స్, హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్
మతం హిందు

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరందూరు గ్రామంలో 1949 ఏప్రిల్ 15న జన్మించాడు. ఆయన తండ్రి గంగసుబ్బరామిరెడ్డి కూడా శ్రీకాళహస్తికి ఎమ్మెల్యేగా పనిచేశాడు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి 1968లో బీయెస్సీ పట్టాను, 1972లో లా పట్టాను పుచ్చుకున్నాడు.

రాజకీయ జీవితం మార్చు

వివాహం అయిన తరువాత ఆయన లా ప్రాక్టీసు చేయడానికి హైదరాబాదు వెళ్ళాడు. తరువాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1989లో శ్రీకాళహస్తి శాసనసభానియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందాడు. తర్వాత 1994, 1999, 2009, 2014లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994-2004 మధ్య కాలంలో నారా చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో ఐటీ మంత్రిగా, రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతినిథి ఎస్సీవీ నాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. మళ్ళీ 2009 ఎన్నికల్లో అదే నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు. 2003 అక్టోబరు 1న అలిపిరి సమీపంలో ఘాట్‌ రోడ్డు లో నక్సలైట్లు క్లెమోర్‌ మైన్స్‌ పేల్చి న ఘటనలో ఆయనతో పాటు బొజ్జల కూడా కారులో ప్రయాణిస్తున్నారు. ఆయన స్వల్ప గాయాలతో  బయటపడ్డారు. బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అత్యంత ఆప్తులు.

మ‌ర‌ణం మార్చు

73 ఏళ్ల బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి అనారోగ్యంతో 2022 మే 6న హైద‌రాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.[1] ఆయనకు శ్రీమతి బృంద, కూతురు పద్మ, కుమారుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఉన్నారు.[2]

మూలాలు మార్చు

  1. "Telangana news: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత". web.archive.org. 2022-05-06. Archived from the original on 2022-05-06. Retrieved 2022-05-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Sakshi (6 May 2022). "మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.