బొడ్డువారిపాలెం, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 523 212., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ భౌగోళికంసవరించు

బొడ్డువారిపాలెం గ్రామం, సంతనూతలపాడు నుండి మద్దులూరు వెళ్ళుచున్నప్పుడు, చండ్రపాలెం తరువాత గంగవరం నుంచి తూర్పు 1/2 కి.మి. తరువాత వస్తుంది.

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామానికి స్కూలు ఉంది.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

త్రాగునీటి సౌకర్యం:-ఈ గ్రామంనకు త్రాగు నీటి సమస్య చాల ఎక్కువ. ఎనికపాడు గ్రామం నుండి మంచి నీటి వసతి ఈ మధ్యన ఏర్పాటు చేశారు. ఈ గ్రామం నుండి విదేశాలలో స్థిర పడ్డ ఎవరయినా దాతలు మంచినీటి వసతి కల్పించినట్లయితే ఈ గ్రామానికి చాలా మేలు చేసిన వారు అవుతారు.

గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

ఈ గ్రామానికి ఈశాన్యమున ఒక చెరువు ఉంది.

గ్రామ పంచాయతీసవరించు

  1. గంగవరం గ్రామం కూడా బొడ్డువారిపాలెం గ్రామ పంచాయితి లోనిదే.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ మంచికంటి వెంకటరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

వినాయకుని గుడిసవరించు

స్కూలు ప్రక్కన వినాయకుని గుడి ఉంది. ఆ గ్రామంలోని ఒక మహిళ చాల కష్టపడి చందాలు పోగుచేసి గుడి కట్టించింది.

శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంసవరించు

ఈ దేవస్థానంలో పొంగళ్ళ వార్షికోత్సవాలు, 2014, జూన్-1, ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలేరమ్మ తల్లి, నాంచారమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి, పోతురాజుస్వామి లకు ప్రత్యేకంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. గత ఐదురోజులుగా గ్రామస్థులు పోలేరమ్మ తల్లికి నీటితో అభిషేకాలు నిర్వహించారు. ఆదివారం ప్రత్యేకంగా పొంగళ్ళు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం వేళలో మహిళలు పొంగళ్ళతో గ్రామంలో ఊరేగింపుగా వెళ్ళి, పోలేరమ్మకు పొంగళ్ళు సమర్పించారు. ఈ సందర్భంగా దేవాలయం ప్రత్యేక అలంకరణలో నిలిచింది. [1]

బొడ్డువారిపాలెం గ్రామంలో బాలినేని వంశస్థుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారు, అయ్యవార్ల కొలుపులను 2017, జూన్-4వతేదీ ఆదివారంనాడు ప్రారంభించెదరు. [3]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

ఇక్కడి భూమి మెట్ట ప్రాంతము. ఎక్కువగా ప్రత్తి, పొగాకు, మిర్చి పంటలు పండిస్తారు.

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

ఈ గ్రామంలోని వారు ఎక్కువగా పాలు తీసుకుని ఒంగోలు పట్టణములో అమ్ముతారు.

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, జూన్-2; 1వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, ఆగస్టు-15; 3వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, జూన్-4; 2వపేజీ.