బోడకుంటి వెంకటేశ్వర్లు

బోడకుంటి వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడిగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశాడు. ఆయన 2016లో తెలంగాణ శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమితులయ్యాడు.[3][4]

బోడకుంటి వెంకటేశ్వర్లు
బోడకుంటి వెంకటేశ్వర్లు


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2015 - ప్రస్తుతం
నియోజకవర్గం ఎమ్మెల్యే Quota

వ్యక్తిగత వివరాలు

జననం 5 నవంబర్ 1956
బచ్చన్నపేట, వరంగల్ జిల్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు బి. సిద్దయ్య, లక్ష్మమ్మ
జీవిత భాగస్వామి విజయలక్ష్మి[1]
సంతానం 1 కొడుకు, 1 కూతురు
నివాసం జూబ్లీహిల్స్, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు
మతం హిందూ

జననం, విద్యాభాస్యం మార్చు

బోడకుంటి వెంకటేశ్వర్లు 1956, నవంబరు 5న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, బచ్చన్నపేట గ్రామంలో బి.సిద్దయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్ లోని ఎన్.బి. సైన్స్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

బోడకుంటి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, తొలిసారి 1988లో బచ్చన్నపేట ఎంపీపీగా పోటీ చేసి గెలిచాడు. ఆయన 1995 మే నుండి 1999 అక్టోబరు వరకు వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశాడు. వెంకటేశ్వర్లు 1999లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం స్థానం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. ఆయన ఎమ్మెల్యే కోటా మండలి ఎన్నికల్లో 2009లో తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. వెంకటేశ్వర్లు 2015లో జరిగిన ఎమ్మెల్యే కోటా మండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుండి రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[5] బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు ఎమ్మెల్సీ పదవీకాలం 2021 జూన్ 3న ముగిసింది.

ఎమ్మెల్సీగా మార్చు

  1. వెంకటేశ్వర్లు పెరిక కులస్తులకు భవనం నిర్మిచేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశాడు.[6]
  2. పారిశుధ్య కారికులకు నిత్యావసరాలు పంపిణి చేశాడు.[7]

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (25 March 2021). "బోడకుంటి వెంకటేశ్వర్లును పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి". Namasthe Telangana. Archived from the original on 29 May 2021. Retrieved 29 May 2021.
  2. Lok Sabha (30 May 2021). "Members : Lok Sabha". loksabhaph.nic.in. Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.
  3. Sakshi (28 August 2016). "మండలి చీఫ్ విప్‌గా పాతూరి". Sakshi. Archived from the original on 29 May 2021. Retrieved 29 May 2021.
  4. Namasthe Telangana (2 June 2021). "ఏడేళ్ల పాలనలో బలమైన పునాదులు". Namasthe Telangana. Archived from the original on 3 June 2021. Retrieved 3 June 2021.
  5. Sakshi (15 October 2015). "'ఆ ఎంపీ ఎవరిని తిడతాడో ఆయనకే తెలియదు'". Sakshi. Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.
  6. Mana Telangana (23 August 2018). "పెరికలకు స్థలం". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.
  7. Team, Web (12 May 2020). "పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పాదాభివందనం | Disha daily (దిశ): Latest Telugu News | Breaking news". www.dishadaily.com. Archived from the original on 30 May 2021. Retrieved 30 May 2021.