భక్త పోతన (1943 సినిమా)

(భక్త పోతన(1942 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

ప్రసిద్ధ తెలుగు కవి పోతన జీవితం ఇతివృత్తంగా వెలువడిన సినిమా ఇది. చిత్తూరు నాగయ్య నటజీవితంలో ఒక కలికితురాయిగా ఈ సినిమాను చెప్పుకోవచ్చును. పోతన వ్యక్తిత్వంలో భాగమైన భక్తి, వినయం, పాండిత్యం - అన్నింటినీ నాగయ్య చక్కగా చూపించారు. ఇదే సినిమా మళ్లీ 1966లో వచ్చినప్పుడు అందులో నాగయ్య వేదవ్యాసునిగా నటించాడు.

భక్త పోతన
(1943 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.రెడ్డి (కదిరి వెంకటరెడ్డి)
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం చిత్తూరు నాగయ్య,
ముదిగొండ లింగమూర్తి,
డి.హేమలతాదేవి,
నాళం వనజ,
టంగుటూరి సూర్యకుమారి,
బెజవాడ రాజారత్నం,
వల్లభజోస్యుల శివరాం,
జంధ్యాల గౌరీనాథశాస్త్రి,
కె.మాలతి,
సామ్రాజ్యం
సంగీతం చిత్తూరు నాగయ్య
నేపథ్య గానం మాలతి,
చిత్తూరు నాగయ్య,
నాళం వనజ,
సముద్రాల రాఘవాచార్య,
బెజవాడ రాజారత్నం,
వల్లభజోస్యుల శివరాం
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం కె.రామనాథ్
కళ ఎ. కె. శేఖర్
నిర్మాణ సంస్థ నారాయణ స్వామి మూలా,
బి.ఎన్.రెడ్డి
భాష తెలుగు

తారాగణం మార్చు

  • పోతనగా చిత్తూరు నాగయ్య
  • అజామిలినిగా ముదిగొండ లింగమూర్తి
  • పోతన కుమార్తెగా బేబీ వనజ
  • పోతన కుమారునిగా వల్లభజోస్యుల శివరాం
  • శ్రీనాథునిగా జంధ్యాల గౌరీనాథశాస్త్రి
  • శ్రీనాథుని కుమార్తెగా కె. మాలతి
  • ఆస్థాన నర్తకిగా సామ్రాజ్యం
  • ఇతర పాత్రల్లో హేమలత, టంగుటూరి సూర్యకుమారి, బెజవాడ రాజారత్నం, తదితరులు

విడుదల మార్చు

 
సినిమాలో సన్నివేశాలు

సినిమాకి ప్రచార వ్యవహారాలు తర్వాతికాలంలో నిర్మాతగా మారిన బి.నాగిరెడ్డి చూసుకున్నారు. అదే సమయంలో బెంగళూరు నగరంలో జెమిని వారి బాలనాగమ్మ విడుదల కానుండడంతో, ఆ సినిమాకి పోస్టర్లతో విపరీతమైన ప్రచారం చేశారు. అన్ని పోస్టర్ల మధ్య ఎలా చేసినా సినిమాకి ప్రాచుర్యం లభించడం అసాధ్యమని గ్రహించిన నాగిరెడ్డి వేరే పథకం వేశారు. దాని ప్రకారం నగరంలోని మల్లేశ్వరం మిట్ట సెంటర్లో విజయవాడ కళాకారులు తయారుచేసిన 30 అడుగుల ఆంజనేయుని కటౌట్ ఏర్పాటుచేశారు. దానికి పదడుగల ఎత్తైన పీఠం చేయించి, పీఠం మీద భక్తపోతన సినిమా పోస్టర్ రాశారు. రాత్రికి రాత్రే ఏర్పాటుచేసిన ఈ కటౌట్ చూసేందుకు తీర్థప్రజల్లా జనం రావడంతో చాలా మంచి ప్రచారం జరిగింది.
సినిమా విడుదలకు ముందురోజు బుకింగ్ క్లర్కుతో క్యూ పద్ధతి ఏర్పాటుచేయించమని నాగిరెడ్డి చెప్పగా, అంతమంది జనం రారని కొట్టిపారేశారు. అయితే నాగిరెడ్డి అంచనాలను నిజం చేస్తూ విపరీతమైన జనం రావడంతో, టికెట్ కౌంటర్ కూడా ధ్వంసమైపోయింది. వారిని ఎలాగో నియంత్రించి, ఆ రాత్రికే క్యూ సిస్టమ్ ఏర్పరిచారు. సినిమా ఘనవిజయం సాధించింది.[1]

పాటలు మార్చు

పాట రచయిత సంగీతం గాయకులు
సర్వమంగళ నామా సీతారామా సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య నాగయ్య బృందం
మా వదిన సుకుమారి వదినా మంగళకర వదనా సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య కుమారి వనజాగుప్త, మాలతి
ఇంటి ముందర చిక్కుడు సెట్టు సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య లింగమూర్తి
నను పాలింపగ చనుదెంచితివా కరుణాసాగర శ్రీరామా సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య నాగయ్య, కుమారి వనజాగుప్త
ఇది మంచి సమయము రారా సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య బెజవాడ రాజరత్నం
మాతాపిత గురుదేవాహిత (మానవసేవే మాధవసేవ) సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య నాగయ్య, కుమారి వనజాగుప్త, మాలతి
నమ్మితినమ్మా సీతమ్మా సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య డి.హేమలతాదేవి
పావన గుణ రామాహరే సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య నాగయ్య
రా పూర్ణచంద్రికా రా గౌతమి రావే సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య కుమారి వనజాగుప్త
నను విడచి కదలకురా రామయ్య రామా సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య నాగయ్య
ఆటలాడదు వదిన మాటలాడదు సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య కుమారి వనజాగుప్త
రామ రామ సీతారామ మేఘశ్యామా మంగళధామా సముద్రాల రాఘవాచార్య చిత్తూరు నాగయ్య నాగయ్య, కుమారి వనజాగుప్త, మాలతి బృందం

వనరులు మార్చు

కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య

మూలాలు మార్చు

  1. బి., నాగిరెడ్డి (మార్చి 2009). జ్ఞాపకాల పందిరి. చెన్నై: బి.విశ్వనాథ రెడ్డి.