వల్లభజోస్యుల శివరాం

వల్లభజోస్యుల శివరాం పాతతరం సినిమా నటుడు. సహాయ పాత్రలలో ఎక్కువగా నటించాడు.[1] ఇతడు వాహినీ స్టూడియోలో శబ్దగ్రాహకుడిగా చేరి ఒకవైపు సినిమాలలో నటిస్తూనే సౌండ్ ఇంజనీర్‌గా అనేక సినిమాలకు శబ్దగ్రహణం చేశాడు[2]. ఇతడు ముక్కామల, ఎన్.టి.ఆర్, జగ్గయ్య, కె.వి.ఎస్‌.శర్మ మొదలైన వారితో కలిసి నవజ్యోతి సమితి అనే నాటక సంస్థ ద్వారా అనేక నాటకాలను ప్రదర్శించాడు.[3]

నటించిన సినిమాలు మార్చు

ఇతడు నటించిన తెలుగు సినిమాలలో కొన్ని:

  1. భక్త పోతన (1942) - పోతన కుమారుడు
  2. మాయా మచ్ఛీంద్ర (1949)
  3. గుణసుందరి కథ (1949) - వీరసేన యువరాజు
  4. షావుకారు (1950) - నారాయణ
  5. విప్రనారాయణ (1954) - మహారాజు
  6. రోజులు మారాయి (1955)
  7. మంచి మనసుకు మంచి రోజులు (1958)
  8. సీతారామ కళ్యాణం (1961)
  9. రంగులరాట్నం (1967)

మూలాలు మార్చు

  1. రాజశేఖర్, పిడూరి (1 October 2015). "అసహాయశూరులు". వాకిలి.
  2. "నటుడు, సాంకేతిక నిపుణుడు....?". Archived from the original on 2017-10-19. Retrieved 2016-10-25.
  3. దొమ్ము శ్రీనివాసరావు. "ముత్యాలముగ్గు (1975) - ఎంతటి రసికుడివో తెలిసెరా". EDUCATION AND ENTERTAINMENT. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటిలింకులు మార్చు