భరద్వాజ రంగావఝ్ఝల
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
భరద్వాజ రంగావఝ్ఝల తెలుగు సినీ దర్శకుడు, రచయిత
జీవిత విశేషాలు
మార్చువిజయవాడలో పుట్టి పెరిగిన భరద్వాజ రంగావఝ్ఝల ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. స్వాతంత్ర్యనంతర భారతదేశ చరిత్రలో గాంధీ హత్య ఘటనకు కారణాలను, ఆ హత్య చేసిన హంతకుడిగా గాడ్సే జీవితంలోని సంఘటనలను 'మరణ వాంగ్మూలం' పేరుతో ఈయన తెలుగు సినిమాగా తీస్తున్నారు. తెలుగు హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని సూరజ్ కొల్లి నిర్మిస్తున్నారు.
ఈ క్రమంలో భరద్వాజ మాట్లాడుతూ గాడ్సే వెనకాల ఉన్న భావాజాలాన్ని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాము. దేశంలో మత సామరస్యం ఉండాలి. ఓపెన్‌గా గాడ్సే గురించి చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాము. అంతా కొత్తవారితో ఈ సినిమా చెయ్యబోతున్నాము. దాదాపు రెండేళ్లు ఈ సినిమాపై నేను రీసెర్చ్ చేశాను. మొదట ఈ సబ్జెక్ట్ మీద నవల రాద్దాం అనుకున్నాను. కానీ గాడ్సే భావజాలాన్ని చెప్పడానికి సినిమా తీస్తే బాగుంటుందని అనిపించింది. గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే 19 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు, 2005లో అతను మరణించాడు. అతను గాంధీ హత్యలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు వంటి అంశాలు ఈ సినిమాలో చూపించడం జరిగింది" అని తెలిపారు.[1]
తెలుగు సినిమా చరిత్ర మీద గతంలో అనేక వ్యాసాలను భరద్వాజ ప్రచురించారు. ప్రగతిశీల భావజాలం కలిగిన భరద్వాజ, కారంచేడు ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. "విరసానివే ముందున్న రోజులు" అనే పేరుతో ఈయన రాసిన వ్యాసం, ఎకె ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన "50 ఏళ్ల విరసం" అనే పుస్తకంలో ప్రచురితమైంది.జులై 2020 నెలలో విరసం నాయకులు వరవరరావు, జేఎన్ యూ ప్రొఫెసర్ సాయిబాబాలను విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో ఒంటరిగా మౌన ప్రదర్శన చేసిన భరద్వాజను కొందరు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషనుకి తీసుకెళ్లారు. ఆ తర్వాత విడిచిపెట్టారు. [2][3][4][5]
మూలాలు
మార్చు- ↑ ":Gandhi Killer Godse Biopic named marana vangmuluam". etvbharat. Archived from the original on 10 మే 2021. Retrieved 10 May 2021.
- ↑ ":Mayabazaar proved major attraction to young moviegoers". telanganatoday. Retrieved 10 May 2021.
- ↑ ":కినిగెలో భరద్వాజ వ్యాస వివరాలు" (PDF). kinige.com. Archived from the original (PDF) on 28 సెప్టెంబరు 2021. Retrieved 10 May 2021.
- ↑ ":భరద్వాజ మౌన ప్రదర్శన". bbc.com. Retrieved 10 May 2021.
- ↑ ":కారంచేడు నుండి గరగపర్రు దాక - భరద్వాజ". avaninews. Retrieved 10 May 2021.