భారతదేశంలోని ప్రసిద్ధ మర్రి చెట్ల జాబితా
భారతదేశంలోని అనేక మత సంప్రదాయాలలో మర్రి పవిత్రంగా పరిగణించబడుతుంది. ఫికస్ బెంగలెన్సిస్ భారతదేశ జాతీయ వృక్షం,[1], మధ్య ప్రదేశ్ రాష్ట్ర వృక్షం.
భారతదేశంలోని గుర్తించదగిన మర్రి చెట్ల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది. ఇక్కడ జాబితా చేయబడిన చెట్లు దాని చారిత్రక, జాతీయ, స్థాన, సహజ లేదా పౌరాణిక సందర్భం ద్వారా ముఖ్యమైనవి లేదా నిర్దిష్టమైనవిగా పరిగణించబడతాయి.
- తిమ్మమ్మ మర్రిమాను, శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండలం, గూటిబయలు గ్రామంలో ఉంది. ఇది కదిరి పట్టణానికి 26 కి.మీ, అనంతపురం నగరానికి 100 కి.మీ దూరంలో ఉంది. ఇది దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షంగా పేరు పొందింది. ఈ మర్రి చెట్టు దాదాపు 5 చదరపు ఎకరములు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు.[2][3] 1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది.
- పిల్లలమర్రిచెట్టు, మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లల మర్రి మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు. అనేక దూర ప్రాంతాలనుంచి ఈ మహావృక్షాన్ని చూడడానికి యాత్రికులు తరలివస్తుంటారు. ముఖ్యంగా డిసెంబరు, జనవరి మాసాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి మహా వృక్షాన్ని సందర్శిస్తారు. సుమారు 700 సంవత్సరాలనాటి ఈ మర్రి వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడవది.[4] దూరం నుంచి చూస్తే ఈ చెట్టు దట్టమైన చెట్లతో నిండిఉన్న చిన్న కొండలాగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా కనిపిస్తుంది. మర్రిచెట్టు ప్రక్కనే మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి.[5]
- పెద్ద మర్రిచెట్టు, కోల్‌కతకు సమీపంలోని హౌరాలో ఆచార్య జగదీష్ చంద్ర బోస్ భారత బోటానిక్ గార్డెన్ లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఈ చెట్టు యొక్క వయసు 200 నుంచి 250 సంవత్సరముల వయసు ఉంటుందని అంచనా. 1925లో మెరుపు దాటికి చెట్టు కొంత భాగం దెబ్బతినటంతో ఈ చెట్టుకు రక్షణ కల్పించేందుకు కొన్ని చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఈ చెట్టు కింద నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి ఈ చెట్టు చుట్టూ 330 మీటర్ల పొడవున్న రహదారి నిర్మించారు. అయితే ఈ చెట్టు ఈ దారిని దాటి వ్యాప్తి చెందుతుంది.
- అడయార్ మర్రి చెట్టు అనేది తమిళనాడులోని చెన్నైలోని అడయార్‌లో ఉన్న 450 సంవత్సరాల పురాతన పెద్ద మర్రి చెట్టు.[6] ఇది థియోసాఫికల్ సొసైటీ ప్రధాన కార్యాలయం మైదానంలో ఉంది, దీని కింద ప్రజలు జిడ్డు కృష్ణమూర్తి, అన్నీ బిసెంట్, మరియా మాంటిస్సోరితో సహా మేధావుల ఉపన్యాసాలను విన్నారు.[7]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "National Tree". Government of India Official website. Retrieved 2012-01-16.
- ↑ C. Sudhakar; R. Suguna Kumari (2008). Women and Forestry. The Associated Publishers. ISBN 978-81-8429-081-3. Retrieved 5 June 2012.
- ↑ Lavanya Vemsani (31 October 2006). Hindu and Jain Mythology of Balarāma: Change and Continuity in an Early Indian Cult. Lewiston, New York: Edwin Mellen Press. ISBN 978-0-7734-5723-2. Retrieved 5 June 2012.
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 8, తేది 27.09.2008
- ↑ నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 248
- ↑ "Banyan Tree". www.ts-adyar.org. Retrieved 2022-09-21.
- ↑ Besant, Annie Wood (March 2003). Theosophist Magazine; October-December 1927. ISBN 9780766151918.