భారత నీతికథలు

భారత నీతికథలు విజయనగర సంస్థానాస్థానకవి భోగరాజు నారాయణ మూర్తి (1891-1940) రచించిన పుస్తకం. దీని మొదటి భాగాన్ని 1928 సంవత్సరంలోను, రెండవ భాగాన్ని 1931 లోను వేంకటరామ్‌ అండ్ కో, ఏలూరు వారు ముద్రించారు.

భారత నీతి కథలు
కృతికర్త: భోగరాజు నారాయణమూర్తి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నీతిశాస్త్రం
ప్రచురణ: వేంకట్రామ అండ్ కో, ఏలూరు
విడుదల: 1928, 1931


మహాభారతం భారతీయ సంస్కృతిలో అవిభాజ్యమైన భాగం. ఆ గ్రంథంలోని పలు పాత్రల ప్రవర్తనలో కనిపించే నీతి ఈ గ్రంథంలో కథలుగా రచించారు. గురుభక్తికి ఉదంకుడు, మాతృభక్తికి గరుత్మంతుడు, ప్రత్యుపకారానికి కుంతి, కుటుంబ సంరక్షణానికి భీముడు మొదలైన పాత్రలను ఆదర్శంగా స్వీకరించారు. అలాగే దుర్వ్యసనాన్ని నిరసిస్తూ పాండురాజు కథ, పాపప్రతిఫలం ఎలాంటిదో చెప్పేందుకు దుర్యోధనుని పాత్ర ఉపయోగించారు.

విషయసూచికసవరించు

మొదటిభాగముసవరించు

 1. ఉదంకుడు - గురుభక్తి
 2. అగ్నిభట్టారకుడు - సత్యవ్రతము
 3. కద్రువ - మచ్చరము
 4. గరుత్మంతుడు - మాతృభక్తి
 5. జరత్కారుడు - పితృదేవతాప్రీతి
 6. శృంగి - క్రోధము
 7. కచుడు - గురుసేవాధర్మము
 8. శర్మిష్ఠ - గర్వభంగము
 9. యయాతి - ధర్మసంశయములు
 10. పూరుడు - పిత్రాజ్ఞ
 11. శకుంతల - పతిభక్తి
 12. దుష్యంతుడు - లోకాపవాదభీతి
 1. భీష్ముడు - బ్రహ్మచర్యవ్రతము
 2. భీష్ముడు - సోదరప్రేమ, ధర్మదీక్ష
 3. దీర్ఘతముడు - సంసారదుఃఖము
 4. మాండవ్యుడు - హింసాఫలము
 5. పాండురాజు - దుర్వ్యసనము
 6. కుంతి - మంత్రప్రభావము
 7. దుర్యోధనుడు - పాపవ్యవసాయము
 8. ద్రోణుడు - పరాభవము
 9. అర్జునుడు - గురుదక్షిణ
 10. దుర్యోధనుడు - లాక్షాగృహము
 11. భీముడు - కుటుంబరక్షణము
 12. కుంతి - ప్రత్యుపకారబుద్ధి

రెండవభాగముసవరించు

 1. అంగారపర్ణుడు — గర్వభంగము
 2. సంవరణ చరిత్రము - పురోహిత ప్రభావము
 3. విశ్వామిత్రుడు - గర్వభంగము
 4. కల్మాషపాదుడు--బ్రాహ్మణ తిరస్కారము
 5. ఔర్వుడు - భయంకరకోపాగ్ని
 6. అర్జునుడు - ధనుర్విద్యాఫలము
 7. కర్ణాదుల మత్సరము - పరాజయము
 8. పాండవులు - మాతృభక్తి
 9. ఇంద్రసేన - పాతివ్రత్యము
 10. సుందోపసుందులు - మోహప్రభావము
 11. అర్జునుడు--సమయరక్షణము
 12. నంద - బాహ్మణశాపము
 1. అర్జునుడు - శరణాగతరక్షణము
 2. మందపాలుడు - సంతానాపేక్ష
 3. బృహద్రథుడు - పుత్రప్రాప్తి
 4. జరాసంధుడు - సాధుహింసాఫలము
 5. శిశుపాలుడు - దైవదూషణము
 6. ద్రౌపది - పాతివ్రత్య మహాత్మ్యము
 7. కిమ్మీరుడు - మార్గనిరోధము
 8. అర్జునుడు - ఈశ్వరసాక్షాత్కారము
 9. అగస్త్యుడు - వాతాపిజీర్ణము
 10. కౌశికుడు - క్రోధస్వభావము ...
 11. దుర్యోధనుడు - ఘోషయాత్ర ..
 12. సైంధవుడు - పరస్త్రీ వాంఛాఫలము

మూలాలుసవరించు