భారత విశ్వవిద్యాలయాల క్రికెట్ జట్టు
భారత విశ్వవిద్యాలయాల క్రికెట్ జట్టు 1949 అక్టోబరు, 1975 డిసెంబరు మధ్యకాలంలో భారతదేశంలో పర్యటించే విదేశీ జట్లతో 16 మూడు-రోజుల ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడింది.
మ్యాచ్‌లు
మార్చుభారతీయ విశ్వవిద్యాలయాలు ఆడిన 16 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో, రెండింట్లో ఓడిపోయి (1955-56లో న్యూజిలాండ్‌పై, 1958-59లో వెస్ట్ ఇండియన్స్‌పై), మిగిలిన 14 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. డ్రా అయిన మ్యాచ్‌లలో కొన్ని మాత్రమే ఫలితానికి దగ్గరగా వచ్చాయి. 1952-53లో పాకిస్థానీలకు వ్యతిరేకంగా, జయసింహరావ్ ఘోర్పడే 19 పరుగులకు 6 వికెట్లు తీసి పాకిస్థానీలను 92 పరుగులకు అవుట్ చేయడంతో భారత విశ్వవిద్యాలయాలు 248 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని పొందింది. కానీ వర్షం ఆఖరి రోజు ఆటను అడ్డుకుంది. [1] [2] 1964-65లో సిలోన్‌తో జరిగిన మ్యాచ్‌లో, భారత విశ్వవిద్యాలయాలు గెలవడానికి 89 పరుగులు చేయాల్సి ఉండగా, 20 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.[3][4]
1970-71లో కొలంబోలో సిలోన్ బోర్డ్ ప్రెసిడెంట్స్ XIతో జరిగిన ఫస్ట్-క్లాస్ మ్యాచ్ భారత విశ్వవిద్యాలయాల జట్టు భారతదేశంలో ఆడని ఏకైక మ్యాచ్. ఆ మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్ 30, 76 నాటౌట్‌లతో టాప్ స్కోర్ చేశాడు. విజయానికి 106 పరుగులు చేయాల్సిన సిలోన్ జట్టు 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. [5] యూనివర్శిటీల జట్టు సిలోన్‌లోని చిన్న పర్యటనలో యూనివర్శిటీ జట్లతో ఐదు ఫస్ట్-క్లాస్-యేతర మ్యాచ్‌లు కూడా ఆడింది.[6]
1994-95లో భారత యూనివర్శిటీలు, ఇంగ్లండ్ A ల మధ్య జరిగిన నాలుగు-రోజుల మ్యాచ్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఫస్ట్-క్లాస్ కాదని నిర్ణయించింది. ఎందుకంటే విశ్వవిద్యాలయాల జట్టులో ఒకరికి మాత్రమే ఫస్ట్-క్లాస్ అనుభవం ఉంది. ఇంగ్లండ్ A 439 పరుగుల తేడాతో విజయం సాధించింది.[7]
1952-53లో ఘోర్పడే 19 పరుగులకు 6 వికెట్లు తీయడం భారత విశ్వవిద్యాలయాల జట్టుకు అత్యుత్తమ గణాంకాలు. [1] 1964-65 మ్యాచ్‌లో అంబర్ రాయ్ చేసిన 135 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. [3]
టెస్ట్ ప్లేయర్లు
మార్చుచాలా మంది భారతీయ విశ్వవిద్యాలయాల ఆటగాళ్ళు టెస్టు క్రికెట్ ఆడారు. 1949-50లో మొదలై, నానా జోషి, పంకజ్ రాయ్, పాలీ ఉమ్రిగర్, గులాబ్రాయ్ రాంచంద్, దీపక్ శోధన్, సుభాష్ గుప్తేలు భారతదేశం తరపున టెస్టులు ఆడారు. [8] 1970-71 జట్టులో ముగ్గురు (అశోక్ గండోత్రా, మొహిందర్ అమర్‌నాథ్, బుద్ధి కుందరన్) అప్పటికే టెస్ట్ క్రికెట్ ఆడారు. మరో నలుగురు (గవాస్కర్, కెనియా జయంతిలాల్, సురీందర్ అమర్‌నాథ్, దిలీప్ దోషి లు) ఆ తర్వాత ఆడారు. [5]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Indian Universities v Pakistanis 1952-53". CricketArchive. Retrieved 7 February 2021.
- ↑ "Indian Universities v Pakistanis 1952-53". Cricinfo. Retrieved 7 February 2021.
- ↑ 3.0 3.1 "Indian Universities XI v Ceylon 1964-65". CricketArchive. Retrieved 7 February 2021.
- ↑ "Indian Universities XI v Ceylon 1964-65". Cricinfo. Retrieved 7 February 2021.
- ↑ 5.0 5.1 "Ceylon Board President's XI v Indian Universities 1970-71". CricketArchive. Retrieved 7 February 2021.
- ↑ "Indian Universities in Ceylon 1970/71". CricketArchive. Retrieved 7 February 2021.
- ↑ Wisden 1996, p. 1010.
- ↑ "Indian Universities v Commonwealth XI 1949-50". CricketArchive. Retrieved 7 February 2021.