భార్గవి (నటి)

భార్గవి (1983 - డిసెంబర్ 16, 2008) తెలుగు చలనచిత్ర నటి. 2005లో వచ్చిన దేవదాసు చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించిన భార్గవి, అష్టా చమ్మా సినిమాలో హీరోయిన్ గా నటించింది. కొన్ని ధారావాహికల్లో కూడా నటించింది.[2]

భార్గవి కోల
జననం1983
గోరింట్ల, గుంటూరు జిల్లా
మరణండిసెంబర్ 16, 2008[1]
బంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణ
మరణ కారణంహత్య
నివాస ప్రాంతంబంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణ
ప్రసిద్ధిసినిమా, టెలివిజన్ నటి,
పదవీ కాలం2005 నుండి 2008 వరకు
మతంహిందువు
భార్య / భర్తప్రవీణ్ కుమార్ / బుజ్జి
పిల్లలుఒక బాబు
తండ్రిరాజేంద్రప్రసాద్ కోల
తల్లిభానుమతి

జననంసవరించు

భార్గవి 1983లో రాజేంద్రప్రసాద్ కోల, భానుమతి దంపతులకు గుంటూరు జిల్లా, గోరింట్ల గ్రామంలో జన్మించింది.[2]

సినీరంగ ప్రస్థానంసవరించు

2005లో వచ్చిన దేవదాసు చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. అటుతర్వాత మా ఊరి వంట, ఆట వంటి జీ తెలుగు కార్యక్రమాలతోపాటూ... అమ్మమ్మ.కాం, అమృతం వంటి ధారావాహికల్లో నటించింది. అన్నవరం, రక్ష, హాలీడేస్, అంజనీ పుత్రుడు, మిస్టర్ మేధావి, పాండురంగడు వంటి చిత్రాలతోపాటు 2008 లో వచ్చిన అష్టా చమ్మా సినిమాలో రెండవ హీరోయిన్ గా నటించింది.

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు
2009 హాలీడేస్ హాసిని
2009 అంజనీ పుత్రుడు కన్యక శిరోమణి తులసి
2008 మిస్టర్ మేధావి షీలా
2008 పాండురంగడు
2008 అష్టా చమ్మా వరలక్ష్మీ
2008 రక్ష లక్ష్మీ
2006 అన్నవరం సీతా
2005 దేవదాసు హీరో బృందం

నటించిన సీరియళ్లుసవరించు

సంవత్సరం సీరియల్ పేరు పాత్రపేరు
2007 అమ్మమ్మ.కాం నందు
2007 అమృతం ఉమాదేవి (అప్పాజీ కూతురు)

టెలివిజన్ కార్యక్రమాలుసవరించు

  • ఆట (జీ తెలుగు)
  • మా ఊరి వంట (జీ తెలుగు)

మరణంసవరించు

భార్గవి 2008, డిసెంబర్ 16న హైదరాబాద్, బంజారాహిల్స్ లోని తన స్వగృహంలో తన భర్త ప్రవీణ్ చేతిలో హత్యకు గరైంది. భార్గవి చనిపోయిన తరువాత ప్రవీణ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.[1]

ప్రవీణ్ (బుజీ) గత ఐదు సంవత్సరాలుగా ఒక సంగీత ఆర్కెస్ట్రా (సాయిబాబా ఆర్కెస్ట్రా) ను నడుపుతున్నారు. ప్రవీణ్ (బుజీ)కి గతంలో రెండుసార్లు (గుంటూరు మాజీ DSP కుమార్తె డాలీ, సుబ్బు చిత్రనటి స్వప్న) వివాహం జరిగింది. అతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

2006, ఫిబ్రవరి 12న నెల్లూరు లోని మురళీ కృష్ణ హోటల్ లో బుజ్జి స్నేహితుల సమక్షంలో బుజ్జి భార్గవిల వివాహం జరిగిందని తెలుస్తుంది.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 నవతరంగం. "'అష్టాచెమ్మ' భార్గవి మృతి". navatarangam.com. Archived from the original on 22 జూన్ 2017. Retrieved 12 June 2017.
  2. 2.0 2.1 టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "భార్గవి , Bhargavi". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 12 June 2017.