భార్యాభర్తలు
భార్యాభర్తలు 1961లో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం.[1] ఈ సినిమాని 1961లో కే. ప్రత్యగాత్మ గారి దర్శకత్వంలో ఏ.వి సుబ్బారావు గారి నిర్మాణంలో అక్కినేని నాగేశ్వరావు గారి ప్రధాన పాత్ర గా విడుదలయింది. ఇం దులో అక్కినేని నాగేశ్వర్రావు, కృష్ణ కుమారి ఇందులో ప్రధాన పాత్రగా పోషించారు. ఈ సినిమాని తమిళ భాషలో నున్న నవలా పెంన్మానం ఆధారంగా చిత్రీకరించారు. అదేవిదంగా ఇదే కధాంశంతో 1963లో ఎల్వి ప్రసాద్ నిర్మాణంలో శివాజీ గణేశన్, బి సరోజ దేవి ప్రధాన పాత్రగా చిత్రీకరించారు. ఈ సినిమాకి ఎస్. రాజేశ్వర రావు సంగీతాన్ని సమకూర్చారు
భార్యాభర్తలు (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ప్రత్యగాత్మ |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ కుమారి, [jayanti] |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుఇందులో శారదా ( కృష్ణ కుమారి ) ఉపాధ్యాయురాలు. వీరి తండ్రి న్యాయవాది శివ కమయ్య ( రమణ రెడ్డి ). తన జీవితం సాగుతున్న క్రమంలో ఆనంద్ అనే వ్యక్తి తనను ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమను ఆమె తిరస్కరిస్తుంది. ఈ క్రమంలో శారదా కుటుంబ సభ్యులు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇది తనకి నచ్చలేదు. కాల క్రమేణా ఆనంద్ వ్యక్తిత్వవాన్ని మెచ్చి తనతో ప్రేమలో పడుతుంది. ఇది ఇలా ఉండగా ఆనంద్ పూర్వపు ప్రేమికురాలు హేమలత ( గిరిజ ) మరల తరసా పడి తనను మళ్ళి పెళ్లి చేసుకోవాలని హెచ్చరిస్తుంది. ఆనంద్ ను తన ఇంటికి రావాలని భయపెడుతుంది. ఆనంద్ తన ఇంటికి చేరుకున్న క్రమంలో హేమలత ( గిరిజ ) ను తన భర్త తనను చంపడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆనంద్ అతన్ని అడ్డుకొని తనని కాపాడుతాడు. ఈ గొడవ సాగుతున్న క్రమంలో ఆంజనేయులు తప్పు ను ఒప్పుకుంటాడు.
పాత్రలు-పాత్రధారులు
మార్చునటీనటులు | పోషించిన పాత్ర |
---|---|
అక్కినేని నాగేశ్వరరావు | ఆనంద్ |
కృష్ణకుమారి | శారద |
రేలంగి వెంకట్రామయ్య | లాయరు రామానందం |
గుమ్మడి వెంకటేశ్వరరావు | ధర్మారావు, ఆనంద్ తండ్రి |
బి. పద్మనాభం | ఆంజనేయులు |
గిరిజ | హేమలత |
సూర్యకాంతం | తాయారు, లాయరు భార్య |
హేమలత | |
రమణారెడ్డి | శివకామయ్య, శారద తండ్రి |
చదలవాడ కుటుంబరావు | కుటుంబయ్య |
నిర్మలమ్మ | మాణిక్యమ్మ, ఆనంద్ తల్లి |
సంధ్య | కనకం, శారద తల్లి |
జయంతి | |
బొడ్డపాటి |
సాంకేతిక బృందం
మార్చు- మూలకథ: డాక్టర్ కె. త్రిపురసుందరి (లక్ష్మి)
- మాటలు: శ్రీశ్రీ, అట్లూరి పిచ్చేశ్వరరావు
- పాటలు: శ్రీశ్రీ, కొసరాజు, ఆరుద్ర
- సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
- నేపథ్యగానం: ఘంటసాల, సుశీల, జిక్కి, మాధవపెద్ది, స్వర్ణలత
- నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
- ఛాయాగ్రహణం: సి. నాగేశ్వరరావు
- శబ్దగ్రహణం ఎ. కృష్ణన్
- కళాదర్శకత్వం: జి.వి.సుబ్బారావు
- కూర్పు: అక్కినేని సంజీవి
- స్టిల్స్: సత్యం
- పబ్లిసిటీ: టి.వి.యస్.శర్మ
- అసోసియేట్ డైరెక్టరు: తాతినేని రామారావు
- నిర్మాత: ఎ.వి.సుబ్బారావు
- స్క్రీన్ప్లే - దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
- నిర్మాణం: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
- స్టుడియో: విజయా - వాహినీ
- విడుదల: నవయుగ ఫిలింస్
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఓ సుకుమార నను జేర రావోయి... ఇటు రావోయి | శ్రీశ్రీ | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల పి.సుశీల |
జోజోజోజోజోజో చూచి, చూచి, కళ్ళు కాయలే కాచాయి | కొసరాజు | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల జిక్కి |
జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయిహాయిగా తీయతీయగా | శ్రీశ్రీ | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం | శ్రీశ్రీ | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల పి.సుశీల |
ఏమని పాడెదనో ఈ వేళ, మానసవీణ మౌనముగా నిదురించిన వేళా | శ్రీశ్రీ | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల |
కనకమా చిట్టి కనకమా ముద్దు కనకమా నా మాట , రచన:కొసరాజు , గానం.మాధవపెద్ది , స్వర్ణలత
నిలువగలేని వలపుల రాణి నీకొరకే తపించునులే , రచన: శ్రీ శ్రీ , గానం.ఘంటసాల , పి.సుశీల
విరటుని రాణి వాసమున వెల్గేడి భారతశక్తి (పద్యం) రచన: శ్రీ శ్రీ , గానం.పి.సుశీల .
పురస్కారాలు
మార్చు- ఈ చిత్రం 1962 లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమాగా ఎన్నుకోబడింది.[2]
మూలాలు
మార్చు- ↑ ముళ్లపూడి, వెంకటరమణ (2011). భార్యాభర్తలు వెండితెర నవల. హైదరాబాద్: హాసం ప్రచురణలు.
- ↑ "9th National Film Awards". International Film Festival of India. Archived from the original on 2 డిసెంబరు 2016. Retrieved 8 September 2011.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.