భీమాంజనేయ యుద్ధం

మహాలక్ష్మీ మూవీస్ వారి భీమాంజనేయ యుద్ధం చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకుడు వి.వి.రామచంద్ర. ఈ చిత్రంలో భీముని పాత్రను దండమూడి రాజగోపాల్, ఆంజనేయుని పాత్రను కామినేని ఈశ్వరరావు ధరించారు. ఇంకా ఈ చిత్రంలో ద్రౌపదిగా ఎస్.వరలక్ష్మి, నలకూబరునిగా కాంతారావు, రంభగా కాంచన, సౌదామినిగా రాజశ్రీ, మరియూ కైకాల సత్యనారాయణ, రమణారెడ్డి మొదలైనవారు నటించారు. ఈ చిత్రానికి తాండ్ర సుబ్రహ్మణ్యం కథను అందించగా, కె.వి.నాగేశ్వరరావు కళాదర్శకత్వం, టి.వి.రాజు సంగీతం నిర్వహించారు.

భీమాంజనేయ యుద్ధం
(1966 తెలుగు సినిమా)
BHEEMAANJANEYA YUDHYAM POSTER.jpg
చందమామ లో చలనచిత్ర ప్రకటన
దర్శకత్వం ఎస్.డి.లాల్
తారాగణం కాంతారావు,
రాజశ్రీ,
చలం
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ మహాలక్ష్మీ మూవీస్
భాష తెలుగు

చలం నారదుడిగాసవరించు

ఈ చిత్రంలో హాస్య నటుడు చలం నారదుడు పాత్రలో కనిపిస్తాడు. చలం ఈ పాత్ర వెయ్యటం అదే మొదటిసారి చివరిసారి కూడా!

పాటలు, పద్యాలుసవరించు

 1. అనుజన్ముండటంచు సంతతము నాకానందసంజాత (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
 2. అనుపమ వీర సింహుడని ఆలులమందు ప్రశస్తి - పద్యం -మాధవపెద్ది
 3. అవశిష్ఠంబులు దీర్చి సర్వము పరిత్యాగము గావించి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
 4. ఆలము సేయబూని నిటలాక్షుడు నన్నెదిరించు (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
 5. ఇటు ఇటు ఓ రాజా ఇటు ఎటు ఎటు ఓ రాజ ఎటు రారాదా - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: డా. సినారె
 6. కలన జయింపలేక బలగర్వమడంగియు చింత (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
 7. కలలన్ని ఫలియించె ఈనాడే తలపులు చిగురించె ఈ నాడే - పి.సుశీల - రచన: డా. సినారె
 8. కాళీచిత్తసరోజబంబహర గంగా శశాంక ప్రియా - వెంకట్రావు - రచన: తాండ్ర
 9. జపమేమి జేసెనో జనక మహారాజు కల్యాణరాముని కాళ్ళు (పద్యం) - ఘంటసాల - రచన:తాండ్ర
 10. జయ జయ జానకిరామ రఘుకుల సోమా పావన - ఘంటసాల,సరోజిని - రచన: రాజశ్రీ
 11. ధరణి శ్రీరామచంద్రుడే దైవమేని సీత భూజాత లోకమాత (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
 12. నేనే నేనే మధుగీతి నవరసపూరిత నవవిలాసవతి నేనే - పి.సుశీల,ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆరుద్ర
 13. పండెన్ దుష్టచతుష్ఠయంబునకు పాపంబు ఆపదలు (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
 14. పలికే రాగం పిలిచే భావం నేనేలే నింగిలోన నేలపైన నేనేలే - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: డా. సినారె
 15. ప్రాంచితకీర్తిశాలి యగు పాండునృపాలుడు నాదు తండ్రి (పద్యం) - మాధవపెద్ది - రచన:తాండ్ర
 16. రామనామ సుధా మధురాతి మధుర పావానాక్షరసేవ (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
 17. రామా రఘుకుల సోమా.. శ్రీరామ జయరామా నీలనీరద కోమల - ఘంటసాల- రచన: తాండ్ర
 18. వీరుడనే ధీరుడనే వినవే ఓ భామా ఔనన్నా కాదన్నా - పి. శ్రీరామ్ - రచన: రాజశ్రీ
 19. సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత తొందర ఏల - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె
 20. సిగలోన విరిసిన సౌగంధికా చెలిమికే నీవే ( బిట్ ) - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె
 21. సురభామినీ సౌదామినీ కలహంస ఓలే ఇటురావే - ఘంటసాల - రచన: డా. సినారె

మూలాలుసవరించు

ఈ చిత్రం ఇదే పేరుతో కన్నడ భాష లోనికి డబ్బింగ్ చెయ్యబడింది