అలా ఎలా?
అలా ఎలా? 2014, నవంబర్ 28న విడుదలైన కామెడీ సినిమా. ఈ చిత్రం ద్వారా హెబ్బా పటేల్ తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయం అయ్యింది.[1]
అలా ఎలా? (2014 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | అనీష్ కృష్ణ |
---|---|
నిర్మాణం | అశోక్ వర్ధన్ |
కథ | అనీష్ కృష్ణ |
తారాగణం | రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్, హెబ్బా పటేల్, షాని, ఖుషీ, భానుశ్రీ మెహ్రా, రవి వర్మ |
సంగీతం | భీమ్స్ |
సంభాషణలు | అనీష్ కృష్ణ |
ఛాయాగ్రహణం | సాయి శ్రీరామ్ |
కళ | భాస్కరరాజు |
నిర్మాణ సంస్థ | అశోకా క్రియేషన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రాహుల్ రవీంద్రన్
- వెన్నెల కిశోర్
- హెబ్బా పటేల్
- షాని
- ఖుషీ
- భానుశ్రీ మెహ్రా[2]
- రవి వర్మ
- కొండవలస
- కృష్ణ భగవాన్
కథ
మార్చురెండు కోట్లు కట్నం వస్తుందని తనకి అస్సలు తెలియని దివ్య (ఖుషి) అనే పల్లెటూరి అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధపడిపోతాడు కార్తీక్ (రాహుల్). అయితే పెళ్లికి ముందు ఆమె ఎవరనేది అస్సలు తెలీకపోవడం కంటే తనని పరిచయం చేసుకుని, ప్రేమించి... పెళ్లిలో సర్‌ప్రైజ్ ఇస్తే బాగుంటుందని తన స్నేహితులు (వెన్నెల కిషోర్, షాని) ఇద్దరితో కలిసి ఆమె ఊరికి వెళతాడు. అక్కడ దివ్య స్నేహితురాలు శృతి (హెబ్బా పటేల్) సాయం తీసుకుని దివ్యకి దగ్గర కావాలనుకుంటాడు.[3]
పాటలు
మార్చుఈ సినిమాలో మొత్తం 6 పాటలున్నాయి. వీటికి భీమ్స్ సెసిరోలియో సంగీతం సమకూర్చాడు. వీటీని సిరివెన్నెల సీతారామశాస్త్రి, వనమాలి, భీమ్స్ సెసిరోలియో రచించారు.
క్రమ సంఖ్య | పాట | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | నో నో మిస్టేక్ | రంజిత్ | 3:57 |
2 | ప్రతి చినుకులో నన్ను తడవనీ | ప్రణవి | 3:38 |
3 | ఎదుట పడదు అని తెలుసా తనకు | హరీష్ రాఘవేంద్ర | 4:39 |
4 | ఎదుట కలదు | సూరజ్ | 3:42 |
5 | ధనక్ ధనక్ | నేహా కక్కర్ | 2:27 |
6 | ఎందుకే | సూరజ్ | 4:17 |
పురస్కారాలు
మార్చుసంవత్సరం | అవార్డు | విభాగము | లబ్ధిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
2014 | నంది పురస్కారాలు | ఉత్తమ ఛాయాగ్రహణం | సాయిశ్రీ రామ్[4] | గెలుపు |
మూలాలు
మార్చు- ↑ Ala Ela Movie Review, Times of India, 30 November 2014
- ↑ ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
- ↑ గణేష్ రావూరి. "సినిమా రివ్యూ: అలా ఎలా?". గ్రేట్ ఆంధ్ర. Archived from the original on 11 సెప్టెంబరు 2017. Retrieved 18 January 2018.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (14 November 2017). "2014 నంది అవార్డులు". Archived from the original on 17 నవంబరు 2017. Retrieved 18 January 2018.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)