ధమకా (2022 సినిమా)
ధమకా 2022లో తెలుగులో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. రవితేజ, శ్రీలీల, జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలై, జనవరి 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[1]
ధమాకా | |
---|---|
దర్శకత్వం | త్రినాధరావు నక్కిన |
రచన | త్రినాధరావు నక్కిన ప్రసన్న కుమార్ బెజవాడ |
నిర్మాత | అభిషేక్ అగర్వాల్ టీజీ విశ్వ ప్రసాద్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | కార్తీక్ ఘట్టమనేని |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | భీమ్స్ సిసిరోలియో |
నిర్మాణ సంస్థలు | పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ |
విడుదల తేదీs | 23 డిసెంబరు 2022(థియేటర్) 22 జనవరి 2023 (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుస్వామి (రవితేజ) మిడిల్ క్లాస్‌కు చెందిన వ్యక్తి. ఉద్యోగం పోవడంతో నెల రోజుల్లో మరో ఉద్యోగం రాకపోతే చెల్లి (మౌనిక) పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. చెల్లెలి స్నేహితురాలు పావనిని (శ్రీలీల) చూసి ఇష్టపడతాడు. పీపుల్స్ మార్ట్ కంపెనీ అధినేత చక్రవర్తి (సచిన్ ఖేడ్కర్) ఏకైక కొడుకు ఆనంద్ చక్రవర్తి (రవితేజ). తన కూతురు పావనిని ఆనంద్ చక్రవర్తికి ఇచ్చి పెళ్లి చేయాలనీ పావని తండ్రి (రావు రమేష్) అనుకుంటాడు. ఇద్దరినీ చూసిన పావని ఎవరిని ఇష్టపడింది? పీపుల్స్ మార్ట్ కంపెనీని జేపీ(జయరామ్) స్వాధీనం చేసుకోవాలని అనుకుంటాడు. జేపీ ప్రయత్నాలను ఆనంద్ చక్రవర్తి అడ్డుకున్నాడా ? శ్రీలీల ఎవరిని ప్రేమిస్తుంది? అనేదే మిగతా కథ.[2]
నటీనటులు
మార్చుపాటల జాబితా
మార్చు- జింతాక్ , రచన: కాసర్ల శ్యామ్, గానం.భీమ్స్ సిసిరోలియో, మంగ్లే
- మాస్ రాజా, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. నకాశ్ అజీజ్
- వాట్స్ హ్యాపెనింగ్ రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.రమ్యబెహరా , భార్గవి పిళ్ళై
- డు డు డు రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. పృధ్వీ చంద్ర
- దండకడియల్ రచన: భీమ్స్ సిసిరోలియో, గానం. , సాహితి చాగంటి, భీమ్స్ సీసిరోలియో , మాంగ్లి
- పల్సర్ బైక్, రామజోగయ్య శాస్త్రి, గానం. భీమ్స్ సీసిరోలియో
- వాట్స్ హ్యాపెనింగ్ , రచన జానకీరావు రమణ.గానం.యోహని.
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
- నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
- కథ, స్క్రీన్‌ప్లే,మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ[6]
- సంగీతం: భీమ్స్ సిసిరోలియో[7]
- సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
- ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
- పాటలు: కాసర్లశ్యామ్[8]
- గాయకులు: భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ
మూలాలు
మార్చు- ↑ Eenadu (13 January 2023). "రవితేజ 'ధమాకా' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే". Archived from the original on 15 January 2023. Retrieved 15 January 2023.
- ↑ Eenadu (23 December 2022). "రివ్యూ: ధమాకా". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ TV9 Telugu (15 October 2021). "దసరా స్పెషల్ సర్ప్రైజ్.. రవితేజ ధమాకా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్." Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Zee News Telugu (14 February 2022). "రవితేజ మూవీ నుంచి 'శ్రీలీల' ఫస్ట్ లుక్ రిలీజ్.. ఎలా ఉందంటే..!". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
- ↑ Eenadu (15 June 2022). "ప్రణవి 'ధమాకా'". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
- ↑ Andhra Jyothy (11 December 2022). "రౌడీ అల్లుడు సరికొత్త వెర్షన్ ధమాకా" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2022. Retrieved 10 December 2022.
- ↑ Namasthe Telangana (6 December 2022). "ధమాకా మ్యూజికల్ హిట్ అవుతుంది". Archived from the original on 6 December 2022. Retrieved 6 December 2022.
- ↑ Namasthe Telangana (18 August 2022). "'ధమాకా' ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఎనర్జిటిక్ స్టెప్స్‌తో అకట్టుకుంటున్న రవితేజ". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.