భూపతిరాజు శ్రీనివాసవర్మ

భూపతిరాజు శ్రీనివాస వర్మ భారతదేశానికి రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నరసాపురం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1][2]

భూపతిరాజు శ్రీనివాసవర్మ
భూపతిరాజు శ్రీనివాసవర్మ


కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 జూన్ 2024 - ప్రస్తుతం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు రఘురామ కృష్ణంరాజు
నియోజకవర్గం నరసాపురం

వ్యక్తిగత వివరాలు

జననం 1967 ఆగస్టు 4
భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు సూర్య నారాయణ రాజు
జీవిత భాగస్వామి వెంకటేశ్వరీ దేవి
నివాసం 7-7-46/P1, ఫ్లాట్.నెం.601, అపార్ట్‌మెంట్ స్ట్రీట్, రఘుకుల టవర్స్, కుముదవల్లి రోడ్, నరసయ్య అగ్రహారం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

శ్రీనివాస వర్మ జూన్ 9న మోదీ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[3][4]

రాజకీయ జీవితం

మార్చు

శ్రీనివాసవర్మ 1967 ఆగస్టు 4న భీమవరంలో సూర్యనారాయణ రాజు, సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ (పీజీ) పూర్తి చేశాడు. శ్రీనివాసవర్మ 1980ల్లో విద్యాధి దశలో కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌లో పని చేసి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాడు.

భూపతిరాజు శ్రీనివాసవర్మ డీఎన్‌ఆర్‌ విద్యా సంస్థల జాయింట్ సెక్రెటరీ, కరస్పాండెంట్‌గా, భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఛైర్మన్‌గా వ్యవహరించాడు.

రాజకీయ జీవితం

మార్చు

శ్రీనివాసవర్మ 1988లో భారతీయ జనతా పార్టీ ద్వారా కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1991 నుండి 1997 వరకు బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా, 1992-95లో పశ్చిమ గోదావరి జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా, 1997 నుండి 1999 వరకు పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ కార్యదర్శిగా, 2008 నుండి 2014 వరకు రెండు పర్యాయాలు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా పని చేశాడు.

శ్రీనివాసవర్మ 2001 నుండి 2003 వరకు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, 2003 నుండి 2009 వరకు బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీగా పని చేసి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి అనంతరం నరసాపురం లోక్‌సభ కన్వీనర్‌గా పని చేసి 2014లో భీమవరం పురపాలక సంఘం ఎన్నికలలో వార్డు కౌన్సిలర్‌గా గెలిచి ఇన్‌చార్జి చైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2018 నుండి 2020లో జిల్లా బీజేపీ ఇన్‌ఛార్జిగా, 2020 నుండి 23 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నరసాపురం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూడురు ఉమాబాలపై 2,76,802 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[5][6][7]

మూలాలు

మార్చు
  1. Election Commision of India (9 June 2024). "2024 Loksabha Elections Results - Narsapuram". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  2. Eenadu (4 June 2024). "వర్మ ఘన విజయం". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  3. EENADU (9 June 2024). "బీజేపీ వర్మ: సామాన్య కార్యకర్త To కేంద్ర మంత్రిగా." Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  4. BBC Telugu (11 June 2024). "నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవిపై అంతటా చర్చ.. ఇంతకీ ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి?". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  5. ETV Bharat News (4 June 2024). "లక్షకుపైగా ఓట్లతో కూటమి ఎంపీ అభ్యర్థుల మెజారిటీలు - ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఫ్యాన్‌". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  6. Andhrajyothy (9 June 2024). "సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి.. శ్రీనివాసవర్మ". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.
  7. ABP Desham (9 June 2024). "కేంద్ర మంత్రిగా శ్రీనివాస వర్మ - కార్యకర్త నుంచి సెంట్రల్ కేబినెట్ స్థాయి వరకూ రాజకీయ ప్రస్ధానం". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.

బయటి లింకులు

మార్చు