భేతి సుభాష్ రెడ్డి

భేతి సుభాష్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

భేతి సుభాష్‌ రెడ్డి
భేతి సుభాష్ రెడ్డి


శాసనసభ్యుడు
పదవీ కాలం
2018 - ప్రస్తుతం
ముందు ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్
నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1963, అక్టోబరు 20
రామాజీపేట్ గ్రామం, యాదగిరిగుట్ట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి స్వప్నారెడ్డి
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె
నివాసం రవీంద్రనగర్ కాలనీ , స్ట్రీట్ నెం: 8, హబ్సిగూడ, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం

జననం, విద్యాభాస్యం

మార్చు

భేతి సుభాష్‌ రెడ్డి 1963, అక్టోబరు 20న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం, రామాజీపేట్ గ్రామం లో బేతి చంద్రారెడ్డి, కమలమ్మ దంపతులకు జన్మించాడు.[3] ఆయన సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

సుభాష్ రెడ్డికి స్వప్నారెడ్డితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం

మార్చు

భేతి సుభాష్‌ రెడ్డి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్ని, తెరాస పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తూ ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ గా పని చేశాడు. భేతి సుభాష్‌ రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా ఉప్పల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ పై 14169 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[5]

భేతి సుభాష్‌ రెడ్డి 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా ఉప్పల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ పై 48168 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[6][7]

భేతి సుభాష్‌ రెడ్డి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు.[8] ఆయన ఏప్రిల్ 18న బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి,[9] భారతీయ జనతా పార్టీలో చేరాడు.[10]

అభివృద్ధి పనులు

మార్చు
  1. మల్లాపూర్ డివిజన్ లోని ఎస్.వి.నగర్ బస్తీ ధవాఖాన సమీపంలోని ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయించాడు.
  2. హబ్సిగూడ డివిజన్ స్ట్రీట్ నెంబర్ 8లోని జిజి బస్తీలో ₹ 7.8 లక్షల వ్యయంతో అంగన్వాడి కమ్యూనిటీ హాలును నిర్మించాడు.
  3. ఉప్పల్ నియోజకవర్గంలో కోటి రూపాయల నిధులతో నూతన గ్రంధాలయ భవనాన్ని నిర్మించాడు.
  4. కాప్రా సర్కిల్ 10 కోట్ల 85 లక్షలతో 6 తీమ్ పార్కులను ఏర్పాటుచేశాడు.

మూలాలు

మార్చు
  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. Elections in India (2018). "Uppal Election Result 2018 Live Updates: Candidate List, Winner, Runner-up MLA List". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
  3. Eenadu (25 November 2023). "నల్గొండ నుంచి వచ్చారు... నగరంలో గెలిచారు". Archived from the original on 25 November 2023. Retrieved 25 November 2023.
  4. admin (2019-01-10). "Uppal MLA Bethi Subhash Reddy". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-23.
  5. "Bethi Subhas Reddy(TRS):Constituency- UPPAL(RANGAREDDY) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-23.
  6. NDTV (2018). "UPPAL Election Result 2018, Winner, UPPAL MLA, Telangana" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
  7. "Bethi Subhas Reddy(TRS):Constituency- UPPAL(MEDCHAL-MALKAJGIRI) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-23.
  8. Eenadu (6 April 2024). "పార్లమెంటు నియోజకవర్గాల్లో భారాస సమన్వయకర్తల నియామకం". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
  9. NTV Telugu (18 April 2024). "బీఆర్ఎస్ కు భేతి సుభాష్ రెడ్డి గుడ్ బై." Archived from the original on 18 April 2024. Retrieved 18 April 2024.
  10. "బీజేపీలో చేరిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి". 18 April 2024. Archived from the original on 18 April 2024. Retrieved 18 April 2024.