భోగభాగ్యాలు పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో ఎస్.పరంధామరెడ్డి నిర్మించగా 1981, జూన్ 5న విడుదలైన తెలుగు సినిమా.[1]

భోగభాగ్యాలు
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణ,
శ్రీదేవి,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఎస్.సి. మూవీస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

కథ మార్చు

ఒంటరిగా ఉన్న ఆడపిల్లను చూస్తే తన కారు కదలదని చెప్పే కృష్ణ ఆగర్భ శ్రీమంతుడు, భోగలాలసుడు. తన బాబాయి కొడుకు చక్రంతో కలసి కనిపించిన ప్రతి అందమైన అమ్మాయిని వలలో వేసుకుని అనుభవించి వదిలివేయడంలో సిద్ధహస్తుడు. అలాంటి కృష్ణకు ఒక రోజున ఒక బస్ స్టాపులో అందమైన రాధ కనిపిస్తుంది. కృష్ణ ట్రయల్స్ పని చేయవు. దానితో "నెల తిరగక ముందే ఆ అమ్మాయిని నా పడకగదికి రప్పిస్తాను" అని కృష్ణ శపథం చేస్తాడు. దానిని నెరవేర్చుకోవడం కోసం రాధ తండ్రి ఫిడేలు రామదాసును మంచి చేసుకుంటాడు. రాధకి ఉద్యోగం ఇప్పిస్తాడు. మొదట్లో కృష్ణ అంటే అసహ్య పడిన రాధ కృష్ణను అభిమానించనారంభిస్తుంది. కృష్ణ కూడా రాధను ప్రేమిస్తాడు. చక్రం ఇది చూసి వారిద్దరి మధ్య చీలిక తేవడనికి కుట్ర పన్నుతాడు. రాధ తండ్రి చనిపోతాడు. దానికి కారణం కృష్ణ అని రాధ నమ్ముతుంది. కృష్ణను కావాలని వివాహం చేసుకుని అతడు ఆస్తినంతా తనపేరు మీద వ్రాయించుకుంటుంది. అతడిపై పగ తీర్చుకుంటుంది. ఇందుకు చక్రం సాయపడతాడు. కృష్ణ త్రిశూల్ రూపంలో వచ్చి చక్రం ఎత్తులను చిత్తుచేస్తాడు.[2]

పాటలు మార్చు

  • ఇదిగిదిగోరా ఢింబకా నీవు కోరిన గోపిక

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Bhoga Bhagyalu (P. Chandrasekhara Reddy) 1981". ఇండియన్ సినిమా. Retrieved 11 September 2022.
  2. వి.ఆర్. (12 June 1981). "చిత్రసమీక్ష: భోగభాగ్యాలు" (PDF). ఆంధ్రపత్రిక. No. సంపుటి 68 సంచిక 70. Archived from the original (PDF) on 11 సెప్టెంబర్ 2022. Retrieved 11 September 2022. {{cite news}}: Check date values in: |archive-date= (help)

బయటిలింకులు మార్చు