మోదుకూరి జాన్సన్
మోదుకూరి జాన్సన్ (ఆగస్టు 8, 1936 - డిసెంబరు 24, 1988) నటుడు, నాటక రచయిత. 1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన 'మరో ప్రపంచం' సినిమా ద్వారా రచయితగా పరిచయం అయ్యారు.[1]
మోదుకూరి జాన్సన్ | |
---|---|
జననం | ఆగస్టు 8, 1936 కొలకలూరు గ్రామం, గుంటూరు జిల్లా |
మరణం | డిసెంబరు 24, 1988 |
మరణ కారణం | గుండెపోటు |
ప్రసిద్ధి | నటులు, నాటక కర్త |
తండ్రి | మోదుకూరి గరువయ్య (పేటూరు) |
తల్లి | రత్తమ్మ |
జననం - విద్యాభ్యాసం - ఉద్యోగం
మార్చువీరు గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో 1936, ఆగస్టు 8 తేదీన జన్మించారు. వీరు ప్రాథమిక విద్యాభ్యాసం దుగ్గిరాల, గుంటూరులో చేసిన తర్వాత ఆంధ్ర విశ్వ కళాపరిషత్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. తెనాలి లో కొంతకాలం న్యాయవాది గా పనిచేశారు,
నాటకరంగ ప్రస్థానం
మార్చుఢిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో పాల్గొని బహుమతులు అందుకున్నారు. వీరు [[నటనాలయం (నాటకం)|నటనాలయం]],[2] దేవాలయం, హృదయాలయ, సిలువభారం మొదలైన నాటకాలు రాసి ప్రదర్శించారు. ఢక్కాభిషేకం నవల రాశారు. రాగ హృదయం అనే రూపకానికి నేపథ్యగానం అందించారు. ఛండాలిక, పైరుపాట సంగీత రూపకాలకు సంగీత దర్శకత్వం వహించారు.
సినీరంగ ప్రస్థానం
మార్చుమోదుకూరి రాసిన నటనాలయం నాటకం అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ నాటకం చూసే అక్కినేని నాగేశ్వరరావు - ఆదుర్తి సుబ్బారావు లు తమ సొంత చిత్రమైన మరో ప్రపంచం సినిమాకు సంభాషణల రచయితగా అవకాశం ఇచ్చారు.[3] వీరు కరుణామయుడు (1978), ఇంద్రధనుస్సు (1978), మానవుడు - దానవుడు (1972), విచిత్ర దాంపత్యం (1971), డబ్బుకు లోకం దాసోహం (1973), ఆంధ్ర కేసరి, దేశోద్ధారకులు మొదలైన సినిమాలకు సంభాషణలు రాశారు.[4]
రచించిన పాటలు
మార్చు- కదిలింది కరుణరథం... సాగింది క్షమా యుగం (కరుణామయుడు)[5]
- మన జన్మభూమి... బంగారు భూమి(పాడిపంటలు)[1]
- స్వాగతం దొరా (దేశోద్ధారకులు)[3]
మరణం
మార్చువీరు 1988, డిసెంబరు 24 తేదీన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 నవ తెలంగాణ. "జాన్సన్ చిరస్మరణీయుడు". Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 8 August 2017.
- ↑ అద్భుత నాటకం నటనాలయం, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 24 జూలై 2017, పుట.14
- ↑ 3.0 3.1 సాక్షి (24 December 2014). "ఆ పాట.. ఆయన.. చిరంజీవులు". Sakshi. రెంటాల జయదేవ. Archived from the original on 14 జూలై 2017. Retrieved 8 August 2017.
- ↑ విశాలాంధ్ర, సాహిత్యం (22 February 2010). "తెనాలి తేజోమూర్తులు బొల్లిముంత, జాన్సన్". పెనుగొండ లక్ష్మీనారాయణ. Archived from the original on 11 సెప్టెంబరు 2019. Retrieved 11 September 2019.
- ↑ సాక్షి. "కదిలింది కరుణరథం". Retrieved 8 August 2017.