మంచి రోజులొచ్చాయి

మంచి రోజులు వచ్చాయి 1972, మే 12వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. అక్కినేని నాగేశ్వరరావు, కాంచన జంటగా నటించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకుడు. జెమినీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

మంచి రోజులొచ్చాయి
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూధనరావు
నిర్మాణం ఎస్. ఎస్. బాలన్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కాంచన,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
నాగభూషణం,
అంజలీదేవి
సంగీతం టి. చలపతిరావు
నిర్మాణ సంస్థ జెమిని పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
  1. ఈనాటి సంక్రాంతి అసలైన పండగ సిసలైన పండగ - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
  2. ఎక్కడికమ్మా ఈ పయనం ఏమిటి తల్లి నీ గమ్యం - ఘంటసాల - రచన: దాశరథి
  3. ఎగిరే గువ్వ ఏమంది విసిరే గాలి ఏమంది ప్రకృతిలోన స్వేచ్ఛకన్నా - సుశీల
  4. ఎందుకే పిరికితనం చాలులే కలికితనం రా తెంచుకొని రా - ఎల్. ఆర్. ఈశ్వరి
  5. నేలతో నీడ అన్నది నను తాకరాదని పగటితో రేయి అన్నది - ఘంటసాల - రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి
  6. మంచిరోజులొచ్చాయి పదరా మంచిరోజులొచ్చా - ఘంటసాల, సుశీల బృందం - రచన: డా॥ సినారె
  7. సిరిపల్లె చిన్నది చిందులు వేస్తున్నది చిన్నగాలి తాకిడికే - ఘంటసాల - రచన: కొసరాజు


దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసిన ఈ పాట ప్రాచుర్యం పొందింది.

నేలతో నీడ అన్నది నను తాకరాదనీ
పగటితో రేయి అన్నది నను తాకరాదనీ
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది


వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా
చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురిసేనా
తల్లితండ్రి ఒకరి నొకరు తాకనిదే
నీవు లేవూ నేను లేనూ లోకమే లేదులే


రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా
మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే
మమత లేదూ మనిషి లేడూ మనుగడయే లేదులే

మూలాలు

మార్చు
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.