మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రాయచోటి నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2]
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | గడికోట శ్రీకాంత్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | రాయచోటి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1982 ఇంటి. నెం. 18-9, బోడిరెడ్డిగారిపల్లి గ్రామం, పడమటికోన, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | వైఎస్‌ఆర్‌సీపీ | ||
తల్లిదండ్రులు | మండిపల్లి నాగిరెడ్డి, సుశీలమ్మ | ||
జీవిత భాగస్వామి | హరిత[1] | ||
సంతానం | నిశ్చల్, నాగ వైష్ణవి | ||
నివాసం | ఇంటి. నెం. 18-9, బోడిరెడ్డిగారిపల్లి గ్రామం, పడమటికోన, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జననం, విద్యాభాస్యం
మార్చుమండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లా, చిన్నమండెం మండలం, పడమటికోన గ్రామంలో మండిపల్లి నాగిరెడ్డి, సుశీలమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పదో తరగతి వరకు కడపలోని నాగార్జున పబ్లిక్ స్కూల్, తిరుపతిలోని రాయలసీమ రెసిడెన్షియల్ కాలేజి నుండి ఇంటర్మీడియట్ , బెంగళూరులో బీడీఎస్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుమండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి స్ఫూర్తితో 2003లో 2003లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్టును ఆశించగా టికెట్టు దక్కలేదు కానీ 2012లో రాయచోటి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి ఓడిపోయాడు.
మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం 2014లో జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలో చేరాడు. ఆయన ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశాడు.
మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి 2021లో వైఎస్‌ఆర్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రాయచోటి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై 2495 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై,[3][4] జూన్ 12న చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[5][6][7][8]
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (8 March 2024). "మండిపల్లి సతీమణి ప్రచారం". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Rayachoti". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ EENADU (13 June 2024). "మొదటిసారి గెలిచి.. మంత్రిగా మెరిసి". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ Andhrajyothy (13 June 2024). "రాంప్రసాద్‌రెడ్డికి మంత్రి వర్గంలో చోటు ఎలా దక్కింది.. ఈయన వెనుక ఉన్నదెవరు !?". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ Sakshi (13 June 2024). "మినిష్టర్ రాముడు". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ EENADU (14 June 2024). "పవన్‌కు పంచాయతీరాజ్... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.