మంద జగన్నాథ్

తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు,

మందా జ‌గ‌న్నాథం తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, 11వ, 13వ, 14వ, 15వ పార్లమెంటు సభ్యులు. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించాడు.[1] ప్రస్తుతం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[2]

మంద జగన్నాథ్
మంద జగన్నాథ్


ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి
పదవీ కాలం
2022-ప్రస్తుతం
(తెలంగాణ రాష్ట్ర సమితి)

మాజీ ఎం.పి.
పదవీ కాలం
1999-2008 (తెలుగుదేశం పార్టీ), 2008-2013 (భారత జాతీయ కాంగ్రెస్), 2013-2014 (తెలంగాణ రాష్ట్ర సమితి)
ముందు మల్లు రవి
తరువాత నంది ఎల్లయ్య
నియోజకవర్గం నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1951-05-22) 1951 మే 22 (వయసు 72)
ఇటిక్యాల, నాగర్‌కర్నూల్ తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ Indian National Congress hand logo.png
జీవిత భాగస్వామి సావిత్రి
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కూతురు
నివాసం హైదరాబాద్, తెలంగాణ
మతం హిందూ

జననం - విద్యాభ్యాసంసవరించు

మంద జగన్నాథ్ 1951, మే 22న తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఇటిక్యాలలో జన్మించాడు. తండ్రి పేరు పెద్ద పుల్లయ్య. వైద్య విద్యలో ఎం.ఎస్. పూర్తి చేశాడు.

వివాహంసవరించు

మంద జగన్నాథ్ కు సావిత్రిలో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఒక కూతురు.

రాజకీయ ప్రస్థానంసవరించు

తెలుగుదేశం పార్టీ నుండి ఎన్నికైన 5మంది ఎంపీలలో మంద జగన్నాథ్ ఒకరు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉంటూ, పార్టీ నిర్ణయాలలో పాల్గొనేవాడు. పార్టీ విప్ కి విరుద్దంగా ఓటు వేసినందుకు సోమనాథ్ చటర్జీ చేత బహిష్కరణకు గురయ్యాడు. 2008, డిసెంబరు 20న జగన్నాథ్ న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతినిధిగా నియమించబడ్డారు. 1999-2008 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ లో, 2008-2013 మధ్యకాలంలో భారత జాతీయ కాంగ్రెస్ లో, 2013-2014 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేశాడు.[3]

2022 జూలై 1న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేత నియమించబడిన జగన్నాథ్, జూలై 6న ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ స‌మ‌క్షంలో బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించాడు.[4]

ఎన్నికల జీవితంసవరించు

గెలుపు

  • 1996 పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ తరపున 48.68% ఓట్లతో గెలిచాడు.
  • 1999 పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ తరపున 53.11% ఓట్లతో గెలిచాడు.
  • 2004 పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ తరపున 45.89% ఓట్లతో గెలిచాడు.
  • 2009 పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున 41.23% ఓట్లతో గెలిచాడు.

ఓటమి

  • 1998 పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ తరపున 40.26% ఓట్లతో ఓడిపోయాడు.

మూలాలుసవరించు

  1. "Manda Jagannadham: Latest News, Videos and Photos | Times of India". Timesofindia.indiatimes.com. Retrieved 2016-12-02.
  2. "దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథం". ETV Bharat News. 2022-07-01. Archived from the original on 2022-07-06. Retrieved 2022-07-06.
  3. నమస్తే తెలంగాణ. "మంచి నడవడికను నేర్పేదే మతం". Retrieved 21 February 2017.[permanent dead link]
  4. telugu, NT News (2022-07-06). "రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధిగా మందా జ‌గ‌న్నాథం బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌". Namasthe Telangana. Archived from the original on 2022-07-06. Retrieved 2022-07-06.