మక్కపాటి కృష్ణమోహన్

మక్కపాటి కృష్ణమోహన్ ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, దర్శకులు.

జననం మార్చు

కృష్ణమోహన్ ప్రకాశం జిల్లా, కరవది గ్రామంలో జన్మించారు.

ఉద్యోగం మార్చు

కృష్ణమోహన్ ఉపాధ్యాయుడిగా తెలంగాణ లో పనిచేసి, అటుతర్వాత తెనాలి జూనియర్ కాలేజిలో కాలేజీలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహించి, కొంతకాలానికి మారీసుపేట బ్రాంచి హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, 1996లో పదవి విరమణ చేశారు.

రంగస్థల ప్రస్థానం మార్చు

కృష్ణమోహన్ కి నాలుగున్నర దశాబ్ధాలుగా రంగస్థలంలో అనుభవం ఉంది. 1952లో రంగకవి రాసిన ఇదేనా మా దేశం నాటకంలో మొదటిసారిగా నటించారు. 1954-55 మధ్యకాలంలో కప్పగంతుల మల్లిఖార్జునరావు, డాక్టర్ ముదిగొండ శివప్రసాద్, కె. విశ్వనాథం, తల్లావఝుల పతంజలిశాస్త్రి, తైలం లక్ష్మీనారాయణ, వి.యస్.ఆర్. కామేశ్వరరావు, వావిలాల హరిప్రసాద్, ఎర్రంనేని చంద్రమౌళి మొదలైన వారితో కలిసి ఒంగోలులో 'నవ్య కళాసమితి' అనే నాటక సమాజాన్ని స్థాపించారు.

తెనాలిలో కళాభారతి అనే నాటక సమాజాన్ని స్థాపించి, తన స్వీయ దర్శకత్వంలో జై భవాని వంటి నాటకాలు ప్రదర్శించారు. ప్రదానోపాధ్యాయులుగా ఉంటూనే స్కూల్ విద్యార్థులతో నాటకాలు వేయించేవారు. వీరు స్వయంగా రచించి, దర్శకత్వం వహించిన మనం - మన పిల్లలు అనే నాటిక అనేక బహుమతులు పొందింది.

బహుమతులు మార్చు

ప్రజానాట్యమండలి వారు నిర్వహించిన నాటక పోటీలలో తెలుగు కోపం నాటికకు డాక్టర్ రాజారావ్ చేతులమీదుగా ప్రథమ బహుమతిని అందుకున్నారు. చింతపల్లి హనుమంతరావు రచించిన సుడిగుండాలు నాటకంను రాష్ట్రంలోని వివిధ పరిషత్తులలో ప్రదర్శించి, 16సార్లు ఉత్తమ నటులుగా బహుమతులు అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన 1958, 1959 నాటకోత్సవాలలో పునర్జన్మ, వీలునామా నాటకాలు ప్రదర్శించి ఉత్తమ నటులుగా బహుమతులు అందుకున్నారు. 1963, 1966, 1971 సంవత్సరాలలో ఆంధ్ర నాటక కళా పరిషత్తు వాళ్లు నిర్వహించిన నాటకపోటీలలో చీకటి తెరలు, జ్వాల, మబ్బులు మొదలైన నాటికలు ప్రదర్శించి బహుమతులు పొందారు. ఒంగోలుకు అభ్యుధయ నాటకరంగాన్ని పరిచయం చేస్తూ పెళ్లిచూపులు, వెంకన్న కాపురం, భలేపెళ్లి నాటకాలు ప్రదర్శించారు.

సినిమారంగం మార్చు

యోగానంద్ దర్శకత్వం వహించిన రారా కృష్ణయ్య సినిమాలో జె.వి. సోమయాజులు, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి లతో కలిసి నటించారు. ప్రస్తుతం తెనాలిలో ఉంటున్నారు.

మూలాలు మార్చు

  • మక్కపాటి కృష్ణమోహన్, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 160.