కరవది

ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం లోని గ్రామం


కరవది, ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్ 523 182., ఎస్.టి.డి.కోడ్ = 08592.

కరవది
రెవిన్యూ గ్రామం
కరవది is located in Andhra Pradesh
కరవది
కరవది
నిర్దేశాంకాలు: 15°32′56″N 80°06′49″E / 15.549°N 80.1136°E / 15.549; 80.1136Coordinates: 15°32′56″N 80°06′49″E / 15.549°N 80.1136°E / 15.549; 80.1136 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఒంగోలు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,643 హె. (6,531 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం6,327
 • సాంద్రత240/కి.మీ2 (620/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523182 Edit this at Wikidata

గ్రామ వివరణసవరించు

మండలం పేరు ఒంగోలు
జిల్లా ప్రకాశం
రాష్ట్రం ఆంధ్రపదేశ్
భాష తెలుగు
ఎత్తు: సముద్రమట్టానికి 12 మీటర్లు
తపాలా కార్యాలయం

గ్రామ భౌగోళికంసవరించు

ఈ గ్రామం ఒంగోలుకు 10 కి.మీ. దూరంలో ఉంది.

సమీపంలోని గ్రామాలుసవరించు

కొప్పోలు 2.1 కి.మీ, చేకూరుపాడు 2.7 కి.మీ, త్రోవగుంట 3.6 కి.మీ, ఉలిచి 5.4 కి .మీ, నందిపాడు 5.6 కి.మీ.

సమీప పట్టణాలుసవరించు

ఒంగోలు 6.2 కి.మీ, నాగులుప్పలపాడు 10.8 కి.మీ, మద్దిపాడు 10.9 కి.మీ, కొత్తపట్నం 14.5 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

ఈ గ్రామంలోని రైల్వే స్టేషన్, విజయవాడ-చెన్నై రైలు మార్గములో ఉంది.

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

పోలవరపు రంగయ్య, రత్తమ్మ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు

1961 లో ప్రారంభించిన ఈ పాఠశాల శిథిలావస్థలో ఉన్నదని తెలిసిన, ఆర్థికంగా స్థిరపడిన 40 మంది పూర్వ విద్యార్థులు, భవన నిర్మాణానికి రు. 20 లక్షల విరాళంతో భవనాన్ని పునర్నిర్మించడమే గాకుండా, కళావేదిక, ముఖద్వారం, ప్రహరీ గోడ మొదలగు అదనపు వసతులు కలుగజేశారు. 2012, జనవరి-12,13 తేదీలలో, ఈ పాఠశాల స్వర్ణోత్సవాలు జరుపుకున్నది. [3]

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

  1. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
  2. మహిళామండలి.
  3. కరవదిలోని ప్రధానవీధులలో, వాటర్ షెడ్ పథకం క్రింద, 35 సౌరవిద్యుద్దీపాలు ఏర్పాటుచేసారు. ఒక్కొక్కటి రు.18,000-00 కాగా, దీనిలో రు. 3,600-00 పంచాయతీ చెల్లించగా మిగతాది ప్రభుత్వం రాయితీగా ఇచ్చింది. [6]
  4. ఈ గ్రామంలో నూతనంగా ఒక విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి, ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. స్థల పరిశీలనలో ఉంది. [7]

గ్రామ పంచాయతీసవరించు

  1. మండలంలోని 14 పంచాయతీలలో ఏకైక మేజర్ పంచాయతీ ఇది.
  2. శ్రీ పోలవరపు వెంకటరామయ్య, 2001-2006 మధ్య, ఈ గ్రామ సర్పంచిగా పనిచేసారు. 2006-2011 మధ్య, వీరి శ్రీమతి విజయలక్ష్మి, ఈ గ్రామ సర్పంచిగా సేవలందించారు. అప్పట్లో ఎవ్వరూ వ్యక్తిగతంగా ఎలాంటి సాయం ఆశించేవారు కాదు. గ్రామస్థులు తమకందరికీ అవసరమైన వసతులు, వనరుల గురించే సర్పంచిని ప్రశ్నించేవారు. [2]
  3. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి గొలిమి దుర్గారాణి, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
  4. 2016-17 సంవత్సరానికి సంబంధించి, రాష్ట్రస్థాయిలో ఉత్తమ పంచాయతీ సర్పంచిగా, ఈ గ్రామ పంచాయతీ సర్పంచి శ్రీమతి గొలిమి దుర్గారాణి ఎంపికైనారు. 2017, ఏప్రిల్-24న, రాష్ట్ర రాజధాని వెలగపూడిలో నిర్వహించు పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలలో భాగంగా, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతుల మీదుగా ఈమెకు ఈ పురస్కారం అందజేసెదరు. [11]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ సీతారాముల, వేణుగోపాల, రామలింగేశ్వరస్వామివారల అలయాలుసవరించు

కరవది గ్రామంలోని సీతారాముల, వేణుగోపాల, రామలింగేశ్వరస్వామి వార్ల దేవస్థానాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, చైత్య శుక్ల విదియ (ఉగాది మరుసటి రోజు) నుండి 11 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [5]

శ్రీ రామస్వామి, వేంకటేశ్వరస్వామివారల అలయాలుసవరించు

ఈ గ్రామంలోని శ్రీ రామస్వామి వేంకటేశ్వరస్వామివారల అలయాలలో, 2017, మార్చి-26వతేదీ ఆదివారంనాడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. [8]

శ్రీ సాయిబాబా ఆలయంసవరించు

కరవది గ్రామంలో 2010 లో నూతనంగాషిర్డీ సాయిబాబా ఆలయం నిర్మితమైనది. ఇక్కడ సీతారాముల కళ్యాణం బాగుగా జరిపించెదరు.

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

ప్రధాన ఉత్పత్తి ఇటుకల తయారీ.

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 6,327 - పురుషుల సంఖ్య 3,174 - స్త్రీల సంఖ్య 3,153 - గృహాల సంఖ్య 1,673;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,732.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,369, మహిళల సంఖ్య 3,363, గ్రామంలో నివాస గృహాలు 1,597 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2,643 హెక్టారులు. గ్రామసంబంధిత వివరాలు [1]

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2013, జూలై-21; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, జనవరి-28; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, ఆగస్టు-3; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, ఏప్రిల్-1; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2014, మే-28;11వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, సెప్టెంబరు-24; 1వపేజీ. [8] ఈనాడు ప్రకాశం; 2017, మార్చి-10; 2వపేజీ. [10] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017, మార్చి-29; 3వపేజీ. [11] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, ఏప్రిల్-24; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కరవది&oldid=3120065" నుండి వెలికితీశారు