మార్చి 20, 1951లో పంజాబ్ లోని అమృత్‌సర్లో జన్మించిన మదన్‌లాల్ (Madan Lal Udhouram Sharma) [1] భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 1974 నుంచి 1987 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున 31 టెస్టులు, 67 వన్డేలు ఆడినాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చక్కగా రాణించి 10,000 పరుగులు, 600 వికెట్లు సాధించాడు.

మదన్‌ లాల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మదన్‌ లాల్ ఉద్ధవ్‌రామ్‌ శర్మ
పుట్టిన తేదీ (1951-03-20) 1951 మార్చి 20 (వయసు 73)
అమృత్‌సర్, పంజాబ్
మారుపేరుమద్దీ పా, మద్దత్ లాల్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 130)1974 జూన్ 6 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1986 జూన్ 19 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 5)1974 జూలై 13 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1987 మార్చి 20 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1968–1972పంజాబ్
1973–1991ఢిల్లీ
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 39 67 232 111
చేసిన పరుగులు 1,042 401 10,204 1,171
బ్యాటింగు సగటు 22.65 19.09 42.87 25.45
100లు/50లు 0/5 0/1 22/50 0/5
అత్యుత్తమ స్కోరు 74 53* 223 64
వేసిన బంతులు 5,997 3,164 33,123 5,456
వికెట్లు 71 73 625 119
బౌలింగు సగటు 40.08 29.27 25.50 30.20
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 0 27 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 5 0
అత్యుత్తమ బౌలింగు 5/23 4/20 9/31 4/20
క్యాచ్‌లు/స్టంపింగులు 15/– 18/– 141/– 31/–
మూలం: ESPNCricinfo, 4 August 2014

టెస్ట్ క్రికెట్

మార్చు

మదన్‌లాల్ భారత్ తరఫున 31 టెస్టులలో పాల్గొని 22.65 సగటుతో 1042 పరుగులు సాధించాడు. అందులో 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 74 పరుగులు. బౌలింగ్‌లో 71 టెస్ట్ వికెట్లు సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 పర్యాయాలు తీసుకున్నాడు. టెస్టులలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 23 పరుగులకు 5 వికెట్లు.

వన్డే క్రికెట్

మార్చు

మదన్‌లాల్ 67 వన్డేలలో పాల్గొని 19.090 సగటుతో 401 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్థసెంచరీ ఉంది. వన్డేలలో ఇతడి అత్యధిక స్కోరు 53 పరుగులు నాటౌట్. బౌలింగ్‌లో 29.27 సగటుతో 73 వికెట్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 20 పరుగులకు 4 వికెట్లు.

ప్రపంచ కప్ క్రికెట్

మార్చు

1975 ప్రపంచ కప్ క్రికెట్‌లో మదన్‌లాల్ తొలి బంతిని ఇంగ్లాండుకు చెందిన డెన్నిస్ అమిస్కు బౌలింగ్ చేశాడు.[2] రెండో సారి భారత్ ప్రపంచ కప్ సాధించిన 1983లో కూడా ప్రాతినిధ్యం వహించాడు.

రిటైర్‌మెంట్ తరువాత

మార్చు

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటర్‌మెంట్ పొందిన తరువాత మదన్‌లాల్ అనేక స్థానాలలో క్రికెట్ పదవులను నిర్వహించాడు.

మూలాలు

మార్చు
  1. http://content.cricinfo.com/ci/content/player/30873.html | మదన్‌లాల్ ప్రొఫైల్
  2. "Who Shrunk Test Cricket?". Rediff. 2002-12-26. Retrieved 2007-04-02.