మదీనాగూడ
మదీనాగూడ, తెలంగాణ రాష్ట్ర హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది నగరానికి వాయవ్య దిశలో చందానగర్, హఫీజ్‌పేట, మియాపూర్ ప్రాంతాల మధ్యలో ఉంది.[1][2]
మదీనాగూడ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°29′46″N 78°20′30″E / 17.496111°N 78.341667°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 050 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో చందానగర్, తారానగర్, హఫీజ్‌పేట, మియాపూర్, హెచ్‌ఎమ్‌టి కాలనీ, విశ్వస్వరనగర్ కాలనీ, ఇంద్రారెడ్డి అల్విన్ కాలనీ, ఉషోదయ ఎన్‌క్లేవ్, సప్తగిరి కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[4]
వాణిజ్య ప్రాంతం
మార్చుఇక్కడ అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి. మియాపూర్ ప్రాంతంలో ఒక పెద్ద మార్కెటు ఉంది. చుట్టుపక్కల శివారు ప్రాంతాలలో బాగా ప్రాచూర్యం పొందిన మార్కెటు ఉంది.
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మదీనాగూడ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు (10కెవి: సికింద్రాబాద్ జంక్షన్ నుండి మియాపూర్ బస్టాప్ వరకు, 17/226: ఇసిఐఎల్ బస్ స్టేషను నుండి లింగంపల్లి బస్టాప్ వరకు, 17హెచ్/226సి: ఇసిఐఎల్ బస్టాప్ నుండి భెల్ వరకు, 113కె: లింగంపల్లి బస్టాప్ నుండి ఉప్పల్ బస్టాప్ వరకు, 216కెఎల్: లింగంపల్లి బస్టాప్ నుండి మెహదీపట్నం బస్టాప్ వరకు) సౌకర్యం ఉంది.[5] ఇక్కడికి సమీపంలో చందానగర్ రైల్వే స్టేషను, హఫీజ్‌పేట్ రైల్వే స్టేషను, మియాపూర్ మెట్రో స్టేషను ఉన్నాయి.
ప్రార్థన స్థలాలు
మార్చుఇక్కడికి సమీపంలో షిర్డీ సాయిబాబా దేవాలయం, అయ్యప్పస్వామి దేవాలయం, దుర్గా దేవాలయం, శ్రీ కనకదుర్గ దేవాలయం, మసీదు-ఎ-అమీనా కలీమి, జూబ్లీహిల్స్ మసీదు, ఇస్లామిక్ సెంటర్, మసీదు ఇ ఎరాజ్ మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Madinaguda Locality". www.onefivenine.com. Retrieved 2021-01-29.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-29.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
- ↑ "Madinaguda, Chanda Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-29.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-29.