హఫీజ్‌పేట
హఫీజ్‌పేట, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం. ఇది కూకట్‌పల్లి, మాదాపూర్, మియాపూర్ ప్రాంతాలకు సమీపంలో ఉంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ లోని వార్డు నంబరు 109 లో ఉంది.[1]
హఫీజ్‌పేట | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 049 |
Vehicle registration | టిఎస్ 07 |
లోక్‌సభ నియోజకవర్గం | చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
సమీప ప్రాంతాలు
మార్చుహఫీజ్పేట సమీపంలోని ప్రాంతాలు:[3]
- మదీనగూడ
- కొండపూర్
- శిల్పా లేఔట్
- కొత్తగూడ
- ఫార్చ్యూన్ ఫీల్డ్స్
- అల్విన్ కాలనీ
- సప్తగిరి కాలనీ
- అప్గోస్ కోప్ హెచ్‌ఎస్‌జి సొసైటీ
- ఉషోదయ ఎన్‌క్లేవ్
ప్రజా రవాణా
మార్చుహఫీజ్పేట నుండి 5 కి.మీ.ల దూరంలో మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో హఫీజ్‌పేట నుండి బస్సు నంబర్లు 222 (కోఠి-లింగంపల్లి-పటాన్‌చెరు), 10హెచ్ (ఆల్విన్ కాలనీ - సికింద్రాబాదు), 216కె/ఎల్ (లింగంపల్లి - మెహదీపట్నం) బస్సు సౌకర్యం ఉంది.[4]
ఇతర వివరాలు
మార్చుస్వతంత్ర సమరయోధులు నివాసముండే సీ.ఆర్.ఫౌండేషన్, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు నిర్వహించే హైటెక్స్, హెచ్‌ఐసీసీ కేంద్రాలు, నోవాటెల్ హోటల్, హైటెక్స్ కమాన్ ముఖద్వారం, నిరుద్యోగులకు నిర్మాణరంగంలో శిక్షణ ఇచ్చే న్యాక్, కొండాపూర్ ఆర్టీయే కార్యాలయం ఈ ప్రాంతంలో ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 జూన్ 2019. Retrieved 15 January 2020.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
- ↑ "Hafeezpet Locality". www.onefivenine.com. Retrieved 2021-01-15.
- ↑ "Genpact company has vacancy of Bpo Call Centre Executive in Mehboob Nagar, hyderabad". www.workindia.in. Retrieved 15 January 2020.