మధురాంతకం నరేంద్ర

మధురాంతకం నరేంద్ర ఒక తెలుగు, ఆంగ్ల రచయిత. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో ఆచార్యుడు.[1] ఆయన ప్రముఖ కథకుడైన మధురాంతకం రాజారాం కుమారుడు. నరేంద్ర తండ్రి పేరు మీదుగా కథాకోకిల అనే పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి యేటా కొంతమంది రచయితలకు సన్మానం చేస్తున్నారు.[2]

మధురాంతకం నరేంద్ర
జననం (1959-07-16) 1959 జూలై 16 (వయసు 64)
రమణయ్యగారి పల్లి, పాకాల మండలం, చిత్తూరు జిల్లా
వృత్తిరచయిత
ఆచార్యుడు
జీవిత భాగస్వామిశ్రీలత
పిల్లలు
  • సింధూర
  • ఇందుమిత్ర
తల్లిదండ్రులు

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

నరేంద్ర చిత్తూరు జిల్లా, పాకాల మండలం, రమణయ్యగారి పల్లెలో 1959, జూలై 16న జన్మించాడు. తండ్రి మధురాంతకం రాజారాం అదే ఊళ్ళో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. కాలక్రమంలో వారి నివాసం పాకాలకు, తరువాత దామలచెరువుకూ మారింది. నరేంద్రకు ఓ తమ్ముడు మహేంద్ర, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. పదో తరగతి అయిన తర్వాత నరేంద్ర పాలిటెక్నిక్ లో డి.ఫార్మసీలో చేర్పించాడు. కానీ బి.ఫార్మసీ చేయాలంటే ఆ అర్హత సరిపోలేదు. ప్రైవేటుగా ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆ తరువాత బి.ఏ పూర్తి చేశాడు.[3] తరువాత ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ, రవీంద్రనాథ్ టాగూర్ కథలపై ఎం.ఫిల్, నయనతార సెహగల్ రచనలపై పీ.హెచ్.డీ చేశాడు.[1] ఉద్యోగ రీత్యా తిరుపతిలోనే స్థిరపడ్డాడు.

కుటుంబం మార్చు

ఆయన భార్య పేరు శ్రీలత. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి సింధూర. చిన్నమ్మాయి ఇందుమిత్ర. పెద్దమ్మాయి భర్త ధీరజ్ కృష్ణతో కలిసి అమెరికాలో నివాసం ఉంటున్నది.

రచనా వ్యాసంగం మార్చు

పాలిటెక్నిక్ చదువుతుండగానే చివరికి దొరికిన జవాబు అనే పేరుతో మొదటి కథ రాశాడు. తరువాత చందమామ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్ర ప్రభ లాంటి వార పత్రికల్లో అనేక కథలు ప్రచురితమయ్యాయి. తర్వాత ఎం.ఫిల్ చేస్తున్నపుడు కథా రచనకు కొంత విరామం దొరికింది. తర్వాత కథా రచనను మరింత సీరియస్ గా తీసుకుని కథలు రాయడం మొదలు పెట్టాడు.

రచనలు మార్చు

  • ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం (నవల)
  • మనోధర్మ పరాగం (నవల)

సంపాదకీయం మార్చు

  1. కథ 2017 (పుస్తకం)[4]

పురస్కారాలు మార్చు

సాహితీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2014 లో మల్లెమాల సాహితీ పురస్కారం అందుకున్నాడు.[5]

  • 1981 - ఎం. ఏలో అత్యధిక మార్కులు సాధించినందుకుగాను రామారావు పురస్కారం
  • 1994 - మద్రాసు తెలుగు అకాడమీ పురస్కారం
  • 1994 - కథ పురస్కారం - కొత్తఢిల్లీ
  • 2001 - జ్యేష్ట పురస్కాతం - విశాఖపట్నం
  • ATA పురస్కారం
  • 2006 - పరుచూరి రాజారాం పురస్కారం - గుంటూరు
  • 2005 - మెక్సికో విశ్వవిద్యాలయ పురస్కారం
  • 2007 -లో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం
  • 2009 - కేతు విశ్వనాథరెడ్డి పురస్కారం, నందలూరు
  • 2012 - రవీంద్రనాథ్ టాగూర్ పురస్కారం, నెల్లూరు
  • 2012 - పెద్దిబొట్ల సాహితీ పురస్కారం, విజయవాడ
  • 2022- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.[6]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "ఎస్వీ యూనివర్శిటీలో మధురాంతకం నరేంద్ర ప్రొఫైలు". svuniversity.ac.in. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం. Retrieved 5 October 2016.[permanent dead link]
  2. సంపాదకులు. "మధురాంతకం రాజారాం అవార్డుల విజేతలు". vaakili.com. వాకిలి. Retrieved 5 October 2016.
  3. "జీవితానికి సాహిత్యం ఉపనది". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Retrieved 16 December 2016.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (26 November 2018). "సిక్కోలులో 'కథ 2017' ఆవిష్కరణ". Archived from the original on 17 మార్చి 2020. Retrieved 17 March 2020.
  5. "మల్లెమాల పురస్కారం అందుకున్న నరేంద్ర". kadapa.info. Retrieved 5 October 2016.
  6. "మధురాంతకం నరేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు- వారాల ఆనంద్‌కు అనువాద పురస్కారం". Prajasakti (in ఇంగ్లీష్). Archived from the original on 2023-03-15. Retrieved 2023-03-15.