ఆంధ్రప్రభ (వారపత్రిక)

ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక 1952లో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వంలో ప్రారంభమైంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు ఈ పత్రికను ప్రచురించింది.

ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు దృశ్యచిత్రం

సంపాదకులుసవరించు

శీర్షికలుసవరించు

 • నలుపు తెలుపు
 • మాణిక్యవీణ
 • ప్రమదావనం
 • కొత్త కలాలు
 • కొత్త పుస్తకాలు
 • వైద్య విజ్ఞానం
 • పద సంపద
 • చిత్రప్రభ
 • బాలప్రభ
 • హైదరాబాదు లేఖ
 • చరిత్రకెక్కని చరితార్థులు
 • మరపురాని మనీషి
 • మిత్ర వాక్యం మొదలైనవి.

రచనలుసవరించు

ఈ పత్రికలో కథలు, నవలలు, సాహిత్య విషయాలు, పుస్తక సమీక్షలు, కార్టూనులు, కవితలు మొదలైనవి ఎన్నో ప్రచురింపబడ్డాయి. ఈ పత్రిక ద్వారా ప్రాచుర్యం పొందిన కొన్ని రచనలు కాదంబరి (బాణభట్టు రచనకు విద్వాన్ విశ్వం తెలుగు అనువాదం), కృష్ణవేణి (రంగనాయకమ్మ నవల), పద్మవ్యూహం (కొండముది శ్రీరామచంద్రమూర్తి నాటకం), బలిపీఠం (రంగనాయకమ్మ నవల), ధర్మచక్రం (కోడూరి కౌసల్యాదేవి నవల),ఏదిపాపం? (చివుకుల పురుషోత్తం నవల), నటరత్నాలు (మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి), రేపటి వెలుగు (ద్వివేదుల విశాలాక్షి నవల) మొదలైనవి.

రచయితలుసవరించు

యండమూరి వీరేంద్రనాథ్, కొంపెల్ల విశ్వం, అంగర వెంకటకృష్ణారావు, అంగలూరి అంజనీదేవి, అందే నారాయణస్వామి, అంబల్ల జనార్దన్, అక్కిరాజు రమాపతిరావు, అచ్యుతుని రాజశ్రీ, అట్టాడ అప్పల్నాయుడు, అడపా చిరంజీవి, అడపా రామకృష్ణ, అడివి బాపిరాజు, అడివి సూర్యకుమారి, అబ్బూరి ఛాయాదేవి, అయాచితం నటేశ్వరశర్మ, అరిగే రామారావు, అలపర్తి రామకృష్ణ, అల్లం శేషగిరిరావు, అల్లూరి గౌరీలక్ష్మి, అవధానుల విజయలక్ష్మి, అవధానుల సుధాకరరావు, అవసరాల రామకృష్ణారావు, జ్వాలాముఖి, ఆకుండి నారాయణమూర్తి, ఆకునూరి మురళీకృష్ణ, ఆకెళ్ల రాఘవేంద్ర, ఆకెళ్ల శివప్రసాద్, ఆకొండి వెంకటరత్నం, ఆచంట ఉమాదేవి, ఆచంట జానకీరాం, ఆచంట హైమవతి, ఆచార్య తిరుమల, ఆడెపు లక్ష్మీపతి, ఆదివిష్ణు, ఆదూరి వెంకటసీతారామమూర్తి, ఆనందారామం, ఆవంత్స సోమసుందర్, ఇంద్రగంటి జానకీబాల, ఇలపావులూరి మురళీమోహనరావు, ఇల్లిందల సరస్వతీదేవి, ఇసుకపల్లి దక్షిణామూర్తి, ఉన్నవ విజయలక్ష్మి, ఉపద్రష్ట శాయి, ఎన్.ఆర్.నంది, ఎమ్బీయస్ ప్రసాద్, ఎల్.ఆర్.స్వామి, ఎస్వీ.కృష్ణజయంతి, ఎస్వీ జోగారావు, ఐ.వి.ఎస్.అచ్యుతవల్లి, ఐతా చంద్రయ్య, సత్యవాడ (ఓగేటి) ఇందిరాదేవి , కవనశర్మ, కె.ఎన్.వై.పతంజలి, కలువకొలను సదానంద, కస్తూరి మురళీకృష్ణ, కె. రామలక్ష్మి, కె.సభా, కేతు విశ్వనాథరెడ్డి, కొడవటిగంటి కుటుంబరావు, కొమ్మనాపల్లి గణపతిరావు, కొమ్మూరి వేణుగోపాలరావు, కొర్లపాటి శ్రీరామమూర్తి, కొర్రపాటి గంగాధరరావు, కొలకలూరి ఇనాక్, కోడూరి కౌసల్యాదేవి, కోవెల సుప్రసన్నాచార్య, గిడుగు రాజేశ్వరరావు, గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి, గుడిపాటి వెంకటచలం, గొల్లపూడి మారుతీరావు, గోవిందరాజు సీతాదేవి, ఘండికోట బ్రహ్మాజీరావు, చందు సుబ్బారావు, చల్లా రాధాకృష్ణ శర్మ, చాగంటి తులసి, చాగంటి సోమయాజులు, చిలుకూరి దేవపుత్ర, సౌభాగ్య, సింగమనేని నారాయణ, శ్రీరంగం శ్రీనివాసరావు, శారదా అశోకవర్థన్ మొదలైనవారు.

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు