మనసులో మాట
మనసులో మాట 1999 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో శ్రీకాంత్, జగపతి బాబు, మహిమా చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. పి. ఉషారాణి నిర్మాతగా చంద్రకిరణ్ ఫిల్మ్స్, శ్రీ స్రవంతి మూవీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.
మనసులో మాట | |
---|---|
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
రచన | ఎస్. వి. కృష్ణా రెడ్డి (స్ర్కీన్ ప్లే), మరుధూరి రాజా (మాటలు) |
నిర్మాత | పి. ఉషారాణి |
తారాగణం | జగపతి బాబు, శ్రీకాంత్ మహిమా చౌదరి |
ఛాయాగ్రహణం | హరి అనుమోలు |
కూర్పు | కె. రాంగోపాల్ రెడ్డి |
సంగీతం | ఎస్.వి.కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థలు | చంద్రకిరణ్ ఫిల్మ్స్, శ్రీ స్రవంతి మూవీస్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 2, 1999 |
సినిమా నిడివి | 152 ని. |
భాష | తెలుగు |
కథ
మార్చుశేఖర్, వసంత్ లు ఒకే కళాశాలలో చదువుతుంటారు. వారి పరిచయం గొడవతో మొదలై స్నేహంగా మారుతుంది. శేఖర్ చెల్లెలు ప్రియ. ప్రియను చూడగానే ఆమె శేఖర్ చెల్లెలు అని తెలియక ముందు వసంత్ ప్రేమలో పడతాడు. తర్వాత వసంత్ శేఖర్ ప్రేమ అంటే నమ్మకం లేని వ్యక్తి అని తెలుసుకుని అతని గతం గురించి తెలుసుకుంటాడు. శేఖర్ మరో చెల్లెలు రాధ శేఖర్ స్నేహితుడితో పారిపోయి పెళ్ళి చేసుకుని ఉంటుంది. ఈలోగా వసంత్ కు తాను ప్రేమిస్తున్న ప్రియ శేఖర్ మరో చెల్లెలు అని తెలుస్తుంది. వారి స్నేహానికి భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతో తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటాడు. ఇది తెలిసిన ప్రియ ఆత్మహత్యాయత్నం చేస్తుంది. వీరిద్దరి స్నేహితుడు గురుమూర్తి శేఖర్ కు అసలు విషయం తెలియజేస్తాడు. తన స్నేహానికి విలువనిచ్చి ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడ్డ వసంత్ కు తన చెల్లెలినిచ్చి వివాహం చేయడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పనంటూ వాళ్ళ పెళ్ళి జరిపించడంతో కథ ముగుస్తుంది.
తారాగణం
మార్చు- వసంత్ గా శ్రీకాంత్
- శేఖర్ గా జగపతి బాబు
- ప్రియగా మహిమా చౌదరి
- శేఖర్ తల్లిగా సంగీత
- గురుమూర్తిగా ఆలీ
- బండ్ల గణేష్
పాటలు
మార్చు- ఈశ్వరా నింగినేలను (గానం: ఉదిత్ నారాయణ్) రచన: వేటూరి సుందర రామమూర్తి
- ప్రేమా ఓ ప్రేమా వచ్చావా ప్రేమ (గానం: చిత్ర) రచన:సిరివెన్నెల సీతారామ శాస్త్రి
- ప్రేమించు ఒక్కసారి మిత్రమా (గానం: ఉదిత్ నారాయణ్, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం) రచన:వేటూరి సుందర రామమూర్తి
- హం హమ్,(గానం: ఉన్ని కృష్ణన్) రచన: వేటూరి సుందర రామమూర్తి
- నేల మీద జాబిలి (ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,చిత్ర) రచన: వేటూరి సుందర రామమూర్తి
- ఏ రాగముంది ,(ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం) రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి.
- డీరి డీరి డీరి డీరీడి (ఉదిత్ నారాయణ్ ,సుందండ , కోరస్.) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి.