మహమ్మద్ ఫైజల్ పడిప్పురా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు.

మహమ్మద్ ఫైజల్
మహమ్మద్ ఫైజల్


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2014 – ప్రస్తుతం
ముందు మొహమ్మెద్ హందుల్లా సయీద్
నియోజకవర్గం లక్షద్వీప్

వ్యక్తిగత వివరాలు

జననం 1975 మే 28
ఆండ్రోట్‌, లక్షద్వీప్, భారతదేశం
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు శ్రీ పూకోయ తంగల్ కున్నంకలం, సఫియాబీ పాడిప్పురా
జీవిత భాగస్వామి రహ్మత్ బేగం
సంతానం 4 (1 కుమారుడు, 3 కుమార్తెలు)
నివాసం ఆండ్రోట్‌, లక్షద్వీప్
పూర్వ విద్యార్థి యూనివర్సిటీ అఫ్ కాలికట్
మూలం http://164.100.47.194/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=4786

జననం, విద్యాభాస్యం మార్చు

మహమ్మద్ ఫైజల్ 1975 మే 28న లక్షద్వీప్‌లోని ఆండ్రోట్‌లో శ్రీ పూకోయ తంగల్ కున్నంకలం, సఫియాబీ పాడిప్పురా దంపతులకు జన్మించాడు. ఆయన 1998లో సర్ సయ్యద్ కాలేజ్, కన్నూర్ నుండి జంతుశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని, 2000లో కాలికట్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) డిగ్రీని పూర్తి చేశాడు.

మహమ్మద్ ఫైజల్ 19 సెప్టెంబర్ 2002న రహ్మత్ బేగంను వివాహం చేసుకున్నాడు. వారికీ నలుగురు పిల్లలు ఫజ్నా బింద్ ఫైజల్, ఆయిషా లియానా, ఆయిషా నవీదా & ఎస్.ఎం కుత్బుధీన్ భక్తియార్ ఉన్నారు.

రాజకీయ జీవితం మార్చు

మహమ్మద్ ఫైజల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో లక్షద్వీప్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన 2014 నుండి 2016 వరకు రవాణా, పర్యాటకం & సంస్కృతిపై స్టాండింగ్ కమిటీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

మహమ్మద్ ఫైజల్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి లక్షద్వీప్ నియోజకవర్గంకు 17వ లోక్‌సభకు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన 13 సెప్టెంబర్ 2019 నుండి పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా & మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.

లోక్‌సభ సభ్యత్వం రద్దు, పునరుద్ధరణ మార్చు

మొహమ్మద్ ఫైజల్‌ 2009లో కొంత మంది అనుచరులతో కలిసి కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్‌ అల్లుడు పదాంత సాలిహ్‌పై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. సాలిహ్‌ ఇచ్చిన వాంగ్మూలంతో ఫైజల్‌ పై కేసు నమోదైంది.  ఈ ఘటనపై నమోదైన కేసును కవరట్టి సెషన్స్‌ కోర్టు  విచారించింది. రాజకీయ కక్షలతోనే సాలిహ్‌ను హత్య చేయడానికి కుట్రపన్నారని కోర్టు స్పష్టం చేసి నిందితులకు పదేండ్ల జైలుశిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధించింది.[1]

కవరట్టి సెషన్స్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఫైజల్‌ కేరళ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. దానిని విచారించిన కోర్టు ఆయనకు విధించిన శిక్షపై స్టే విధించింది. అయినప్పటికీ ఫైజల్‌పై అనర్హతను లోక్‌సభ సెక్రటేరియట్‌ ఎత్తివేయలేదు. తనను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సచివాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌పై మహ్మద్ ఫైజల్​ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దింతో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ అనర్హత వేటును 2023 మార్చి 29న లోక్‌సభ సెక్రటేరియట్‌ రద్దుచేసింది.[2]

మూలాలు మార్చు

  1. Sakshi (12 January 2023). "లక్షద్వీప్‌ ఎంపీకి పదేళ్ల ఖైదు". Retrieved 30 March 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Eenadu (29 March 2023). "లక్షద్వీప్‌ ఎంపీ ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత". Retrieved 30 March 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)