మహరాజు (సినిమా)
మహరాజు 1985 లో విజయ బాపినీడు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం. ఇందులో శోభన్ బాబు, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శోభన్ బాబు కెరీర్ లో చెప్పుకోదగిన సినిమా.[1] ఈ సినిమాను యం. నరసింహరావు రాశి మూవీస్ క్రియేషంస్ పతాకంపై నిర్మించాడు. కె. చక్రవర్తి సంగీతాన్నందించగా వేటూరి, ఆత్రేయ పాటలు రాశారు. దర్శకుడు విజయ బాపినీడు చిత్రానువాదం బాధ్యతలు చూసుకోగా సత్యమూర్తి మాటలు రాశాడు.
మహరాజు | |
---|---|
దర్శకత్వం | విజయ బాపినీడు |
రచన | విజయ బాపినీడు (చిత్రానువాదం), సత్యమూర్తి (మాటలు) |
దీనిపై ఆధారితం | Aarilirundu Arubadu Varai (Tamil)(1979) |
నిర్మాత | యం. నరసింహరావు |
తారాగణం | శోభన్ బాబు, సుహాసిని , శ్రీధర్ |
ఛాయాగ్రహణం | కె. ఎస్. హరి |
కూర్పు | కె. ఆత్మ చరణ్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | జూన్ 25, 1985 |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
ఇది ఆరిలిరుందు అరుబదు వరై అనే తమిళ సినిమాకు పునర్నిర్మాణం. ఇదే సినిమా కన్నడంలో కూడా పునర్నిర్మాణం చేశారు. తమిళంలో రజినీకాంత్ కథానాయకుడిగా నటించాడు.[2]
కథ
మార్చురాంబాబు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. తనకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలు ఉంటారు. తల్లికి సహాయం చేయడం కోసమే చిన్నప్పటి నుంచే పనిలో చేరతాడు. తమ్ముళ్ళను కష్టపడి చదివిస్తాడు. వాళ్ళ కోసం ఎన్నో అప్పులు చేస్తాడు. కానీ వాళ్ళు స్థిరపడిన తర్వాత రాంబాబును పట్టించుకోరు.
తారాగణం
మార్చు- రాంబాబుగా శోభన్ బాబు
- సుహాసిని
- రాంబాబు తండ్రిగా శ్రీధర్
- జగ్గయ్య
- నూతన్ ప్రసాద్
- రాళ్ళపల్లి
- ఈశ్వర్ రావు
- సాయికుమార్
- సుత్తివేలు
- స్వప్న (ప్రత్యేక పాత్ర)
- హరిప్రసాద్
- థమ్
- జయమాలిని (ద్విపాత్రాభినయం)
- శైలజ
- శుభ
- మమత
- శ్రీలక్ష్మి
- గోమతి
- చందన
- అల్లు రామలింగయ్య (అతిథి పాత్ర)
పాటలు
మార్చు- కైలాస గిరిపైన కొలువైన స్వామీ...రాజువయ్యా, మహారాజువయ్యా... (వేటూరి)
- చిరునవ్విస్తా శ్రీవారికి (వేటూరి)
- ఓ పాత్రధారి ఎవరికి తెలుసు (వేటూరి)
- కన్యాకుమారిలో కన్నుకొట్టుకున్నాము (వేటూరి)
- పెళ్ళి చేసి చూడవే చింతామణీ (వేటూరి)
- చెలివో చెలిమివో (ఆత్రేయ)
మూలాలు
మార్చు- ↑ "నటభూషణ్ "శోభన్ బాబు" నటజీవన ప్రస్థానం". Zee News Telugu. 2017-09-26. Retrieved 2020-05-12.
- ↑ "Movies that define 'the actor' Rajinikanth". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-01-07. Retrieved 2020-05-12.