మహాగౌరీ దుర్గా

మహాగౌరీ దుర్గా నవదుర్గల అలంకారాల్లో ఎనిమదవ అవతారం.

మహాగౌరీ దుర్గా నవదుర్గల అలంకారాల్లో ఎనిమదవ అవతారం. నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలనూ ఈ అమ్మవారు తీర్చగలదు. జీవితంలోని  కష్టాలన్నిటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చు అని భక్తుల నమ్మిక.[1] మహాగౌరీదేవినాలుగు చేతులుతో ఉంటుంది. కుడిచేయి అభయముద్రలో ఉండగా, కింది కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. కింది ఎడమ చేతిలో ఢమరుకం ఉండగా, పై ఎడమ చేయి దీవిస్తున్నట్టుగా ఉంటుంది.

మహాగౌరీ
మహాగౌరీ దుర్గా (నవదుర్గల అలంకారాల్లో ఎనిమదవ అవతారం)
అందం, మహిళ దేవత
దేవనాగరిमहागौरी
అనుబంధంపార్వతి అవతారం/ఆది పరాశక్తి
నివాసంకైలాస పర్వతం
మంత్రంశ్వేతే వ్స్ సమారుధ శ్వేతాంబర్ధర శుచిహ్। మహాగౌరి శుభం దఘన్మహదేవ్ప్రమోద॥
ఆయుధములుత్రిశూలం, డమరుకం (తాంబూరి), అభయముద్ర, వరద ముద్ర
భర్త / భార్యశివుడు
తోబుట్టువులుగంగ, విష్ణువు
పిల్లలుకార్తికేయుడు, వినాయకుడు, జ్యోతి, అశోక సుందరి
వాహనంఎద్దు

పద చరిత్ర మార్చు

మహాగౌరి అనే పేరు గొప్ప తెలుపు అని అర్ధం, దుర్గాదేవి తెలుపు రంగులో, చాలా అందంగా ఉంటుంది. (మహ, మహా = గొప్ప; గౌరీ, గౌరీ = తెలుపు). మహాగౌరీని సాధారణంగా నాలుగు చేతులతో చిత్రీకరిస్తారు, చేతులు త్రిశూలం, కమలం, ఢమరుకం కలిగి ఉంటాయి, నాల్గవది ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు కమలం కూడా ఉంటుంది. దుర్గాదేవి తెల్లని బట్టలు ధరించి, తెల్లటి ఎద్దును నడుపుతున్నట్లుగా చూపబడుతుంది.

కథ మార్చు

పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడంకోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంది. కాబట్టి, ఆమె రాజ భవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి, అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫానులను కూడా లెక్కచేకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగింది. దాంతో పార్వతి శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది. అప్పుడు ఆమె తన శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటుచేసుకుంది. చివరికి, శివుడు ఆమెముందు ప్రత్యక్షమై, ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను తన ముడి వేసిన జుట్టు నుండి వెలువడే గంగా నది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపాడు. గంగ పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారింది. ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు.

తల్లి గౌరీ దేవి, శక్తి, మాతృదేవత, దుర్గా, పార్వతి, కాళీ అని అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఆమె పవిత్రమైనది, తెలివైనది. చెడు పనులను చేసేవారిని శిక్షించి, మంచి వ్యక్తులను రక్షిస్తుంది. తల్లి గౌరీ మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది.

మూలాలు మార్చు

  1. Hindu Astrology (2011-09-28). "Mahagauri | Durga Pooja Ashtmi Tithi". Astrobix.com. Archived from the original on 2013-01-02. Retrieved 2013-02-04.