మహారాణిపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతం.[1] విశాఖపట్నం జిల్లాలోని మహారాణిపేట, విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ పరిపాలనలో ఉంది. దీని ప్రధాన కార్యాలయం మహారాణిపేటలో ఉంది. దీనికి చుట్టుపక్కల సీతమ్మధార, గోపాలపట్నం ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర వైద్య కళాశాల, కింగ్ జార్జ్ హాస్పిటల్, అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి.[2]

మహారాణిపేట
సమీపప్రాంతం
మహరాణిపేటలోని కింగ్ జార్జ్ హాస్సిటల్
మహరాణిపేటలోని కింగ్ జార్జ్ హాస్సిటల్
మహారాణిపేట is located in Visakhapatnam
మహారాణిపేట
మహారాణిపేట
విశాఖట్నం నగర పటంలో మహరాణిపేట స్థానం
Coordinates: 17°42′36″N 83°18′11″E / 17.709920°N 83.303109°E / 17.709920; 83.303109
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Government
 • Typeమేయర్
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530002
శాసనసభ నియోజకవర్గందక్షిణ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గంవిశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం

భౌగోళికం

మార్చు

ఇది 17°42′36″N 83°18′11″E / 17.709920°N 83.303109°E / 17.709920; 83.303109 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో నెహ్రూ నగర్ కాలనీ, పాండురంగపురం, సిరిపురం, జగదాంబ జంక్షన్, హెచ్‌పిసిఎల్ కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

వార్డులు

మార్చు

మహారాణిపేట మండలంలోని వార్డులు

  1. అల్లిపురం
  2. చెంగల్‌రావుపేట
  3. గోదారి
  4. మహారాణిపేట
  5. సంత
  6. పోర్ట్
  7. సీతారామస్వామి ఆలయం
  8. శివాలయం
  9. వాల్తేరు

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మహారాణిపేట మీదుగా విశాఖపట్నం విమానాశ్రయం, రామకృష్ణ బీచ్, ఆర్టీసీ కాంప్లెక్స్, కైలాసగిరి, వుడా పార్క్, కపులతుంగ్లం, సింహాచలం బస్ స్టేషన్, పెందుర్తి, కొత్తవలస మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]

మూలాలు

మార్చు
  1. "Maharani Peta Locality". www.onefivenine.com. Retrieved 2021-05-14.
  2. "about". the hindu. 11 December 2017. Retrieved 13 December 2017.
  3. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 15 May 2021.