మహారాణిపేట మండలం

ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నం జిల్లాలోని మండలం

మహారాణిపేట మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా లోని 11 మండలాలలో ఒకటి. ఇది విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ క్రింద నిర్వహించబడుతుంది. దీని పరిపాలనా కేంద్రం మహారాణిపేటలో ఉంది. ఈ మండలం బంగాళాఖాతం తీరంలో ఉంది. దీనికి ఉత్తరాన విశాఖపట్నం గ్రామీణ మండలం, పశ్చిమాన విశాఖపట్నం పట్టణ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.[1]

మహారాణిపేట
మహారాణిపేట is located in Andhra Pradesh
మహారాణిపేట
మహారాణిపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో మహారాణిపేట స్థానం
Coordinates: 17°42′36″N 83°18′11″E / 17.709920°N 83.303109°E / 17.709920; 83.303109
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
భారతదేశపు జిల్లావిశాఖపట్నం
పరిపాలనా కేంద్రంమహారాణిపేట
భాష
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)

మహారాణిపేట పౌర సదుపాయాలకు బాధ్యత వహించే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నందున ఈ మండలంలో గ్రామాలు లేవు.[2][3]

2022 లో ఏర్పడిన మండలం - చరిత్ర మార్చు

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 ముందు విశాఖపట్నం జిల్లాలో ఉన్న 43 మండలాలలో విశాఖపట్నం పట్టణ మండలం ఒకటి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా విశాఖపట్టణం జిల్లా పరిధిని సవరించి, విశాఖపట్నం పట్టణ మండలం స్థానంలో కొత్తగా సీతమ్మధార,  గోపాలపట్నం, ములగాడ , మహారాణిపేట  అనే నాలుగు మండలాలు కొత్తగా ఏర్పడ్డా యి. వీటిలో సీతమ్మధార మండలం కొత్తగా ఏర్పడిన భీముని పట్టణం రెవెన్యూ డివిజను పరిధిలో చేరగా, మిగిలిన మూడు మండలాలు విశాఖపట్టణం జిల్లా, పూర్వపు విశాఖపట్టణం రెవెన్యూ డివిజను పరిధి కిందకు చేరాయి.[4] [5]అయితే ఈ నాలుగు మండలాలలో ఎటువంటి గ్రామాలు లేవు, మహా విశాఖ నగరపాలక సంస్థకు చెందిన వార్డులు, ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "Visakhapatnam district - District handbook of statistics" (PDF). Visakhapatnam district website, Government of AP. Retrieved 2022-05-12.
  2. "Sub-District Details of Visakhapatnam District". The Registrar General & Census Commissioner, India. Retrieved 23 October 2014.
  3. "Visakhapatnam (urban) mandal villages" (PDF). apland.ap.nic.in. Archived from the original (PDF) on 19 మార్చి 2015. Retrieved 23 అక్టోబరు 2014.
  4. https://ahd.aptonline.in/AHMS/Views/DownLoads/All26Districts.pdf
  5. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.

వెలుపలి లంకెలు మార్చు