మహారెడ్డి భూపాల్ రెడ్డి

(మహారెడ్డి భూపాల్‌ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

మహారెడ్డి భూపాల్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున నారాయణ్ ఖేడ్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1][2]

మహారెడ్డి భూపాల్‌ రెడ్డి
మహారెడ్డి భూపాల్ రెడ్డి


పదవీ కాలం
2016 - ప్రస్తుతం
నియోజకవర్గం నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం మే 7, 1960
ఖాన్‌పూర్, కల్హేర్ మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మహారెడ్డి వెంకట్ రెడ్డి - శకుంతలమ్మ
జీవిత భాగస్వామి జయశ్రీరెడ్డి
సంతానం రోషన్‌ రెడ్డి, శ్రేయారెడ్డి
నివాసం నారాయణ్‌ఖేడ్

తొలినాళ్ళ జీవితం

మార్చు

భూపాల్ రెడ్డి 1960 మే 7న మహారెడ్డి వెంకట్ రెడ్డి, శకుంతలమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, కల్హేర్ మండలంలోని ఖాన్‌పూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి మహారెడ్డి వెంకట్ రెడ్డి రెండుసార్లు (1978-1978, 1983–1985) నారాయణఖేడ్‌ శాసనసభ్యుడిగా పనిచేశాడు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో సహజంగానే భూపాల్‌రెడ్డికి రాజకీయాలపట్ల ఆసక్తి కలిగింది. భూపాల్ రెడ్డి సోదరుడు మహారెడ్డి విజయపాల్ రెడ్డి కూడా రాజకీయ నాయకుడు, నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఒకసారి శాసనసభ్యుడిగా కూడా పనిచేశాడు.[3] భూపాల్ రెడ్డి 1981లో హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిఎస్సీ డిగ్రీని పొందాడు.[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

భూపాల్‌రెడ్డి 1988లో జయశ్రీరెడ్డిని వివాహమాడారు. వారికి ఒక కుమారుడు (రోషన్ రెడ్డి), ఒక కుమార్తె (శ్రేయారెడ్డి) ఉన్నారు.

కెరీర్

మార్చు

భూపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. మండల స్థాయినుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన భూపాల్‌రెడ్డి, జిల్లా కేంద్ర సహకారబ్యాంకు డైరెక్టర్‌గా ఏడేళ్లు సేవలందించాడు. 2008లో టిఆర్‌ఎస్‌పార్టీ జెండా మెడలో వేసుకున్న భూపాల్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో నారాయణఖేడ్‌నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. టిఆర్‌ఎస్‌లో చేరిననాటినుంచి 2016లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేవరకు 9 సంవత్సరాలపాటు ఆ పార్టీ రైతువిభాగం రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు.

రాజకీయ జీవితం

మార్చు

భూపాల్‌ రెడ్డి 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్లోళ్ళ కిష్టారెడ్డి పై 14,600 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2015లో నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు పట్లోళ్ళ కిష్టారెడ్డి మరణంతో ఖాళీయైన ఈ నియోజకవర్గానికి 2016 ఫిబ్రవరి 13న ఉపఎన్నిక నిర్వహించబడింది. ఈ ఉప-ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి. సంజీవ రెడ్డి పై 53,625 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[5] 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్‌ పై పోటీచేసి 37,042 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[6][7]

మూలాలు

మార్చు
  1. Sakshi (12 May 2019). "ఫ్యామిలీ పాలిటిక్స్‌కు 'నో'". Sakshi. Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  2. Telangana Legislature (2018). "Member's Profile – Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  3. India, The Hans (2019-08-11). "Former MLA Vijaypal Reddy to join BJP". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-01.
  4. Eenadu (14 November 2023). "అత్యధికులు పట్టభద్రులే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  5. Sakshi (17 February 2016). "మహా గెలుపు". Sakshi. Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  6. "Narayankhed Election Result 2018 Live Updates: Maha Reddy Bhupal Reddy of TRS Wins". News18 (in ఇంగ్లీష్). 2018-12-11. Retrieved 2021-07-01.
  7. "Narayankhed Election Result 2018 LIVE: Narayankhed MLA Election Result & Vote Share – Oneindia". www.oneindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-07-09. Retrieved 2021-07-01.