నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం
ఇది భారతదేశ తెలంగాణ రాష్ట్రములోని సంగారెడ్డి జిల్లాలోని 5 శాసనసభ స్థానాలలో నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఇది జహీరాబాదు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనికి వచ్చును.[1]
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 18°2′24″N 77°46′48″E |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చు- మనూర్
- నారాయణఖేడ్
- కల్హేర్
- శంకరంపేట్
- సిర్గాపూర్
- నాగలిగిద్ద
- కంగ్టి
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చు- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు[2]
2009 ఎన్నికలు
మార్చు2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణారెడ్డి పోటీచేయగా, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎస్.భూపాల్ రెడ్డి పోటీపడ్డాడు. ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయపాల్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి అమర్ సింగ్ పవార్ పోటీచేశారు.[4]
2014ఎన్నికలు
మార్చు2014 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీచేసిన ప.కిష్టా రెడ్డి తన సమీప ప్రత్యర్థియు తె.రా.స అభ్యర్థియునైన మ.భూపాల్ రెడ్డిపై 14746 ఓట్ల తేడాతో గెలుపొందిరి. ఆ ఎన్నికలలో ప.కిష్టారెడ్డికి 62,347 ఓట్లు, మ.భూపాల్ రెడ్డీకి 47,601 ఓట్లు లభించినవి. 2015 ఆగస్టు 25 నాడు ప.కిస్టారెడ్డి గుండెపోటుతో మరణించారు.
2016 ఉప-ఎన్నిక
మార్చునారాయణ్ఖేడ్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు ప.కిష్టారెడ్డి మృతితో ఖాళీయైన ఈ నియోజకవర్గమునకు 2016 ఫిబ్రవరి 13 నాడు ఉప ఎన్నిక నిర్వహింపబడెను. ఆ ఉప-ఎన్నికలో అధికార తె.రా.స.కు చెందిన మ.భూపాల్ రెడ్డి గెలుపొందిరి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Andhrajyothy (17 November 2023). "ఖేడ్‌లో ఢీ అంటే ఢీ". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
- ↑ Eenadu (15 November 2023). "శాసనసభ బాట పట్టారిలా." Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009