వర్ధమాన మహావీరుడు

జైనమత సన్యాసి
(మహావీర్ నుండి దారిమార్పు చెందింది)

వర్ధమాన మహావీరుడు, జైనమతంను పునరుద్ధరించిన ఇరవై నాలుగవ తీర్థంకరుడు. పూర్వ వైదిక శకంలోని తీర్థంకరుల ఆధ్యాత్మిక, తాత్విక, నైతిక బోధనలను ఆయన వివరించాడు. అతడు జైన సంప్రదాయంలో, సా.శ.పూ. 6వ శతాబ్దంలో భారతదేశంలోని బీహార్ లోని క్షత్రియ కుటుంబంలో జన్మించినట్లు నమ్ముతారు. అతను 30 సంవత్సరాల వయస్సులో, ప్రపంచంలోని అన్ని వస్తువులను విడిచిపెట్టాడు, ఆధ్యాత్మిక మేల్కొలుపుతో ఒక సన్యాసిగా అయ్యాడు. ఆతడు 12 సంవత్సరాలపాటు తీవ్రమైన ధ్యానం, తీవ్ర తపస్సుల తరువాత అతను కెవాలా జ్ఞాన (సర్వవ్యాపకత్వం) సాధించి సా.శ.పూ. 6వ శతాబ్దం లో మోక్షాన్ని సాధించినట్లు జైనులు విశ్వసిస్తారు. అతడు 30 సంవత్సరాలు బోధించాడు, కార్ల్ పోటర్ వంటి పండితులు అతని జీవితచరిత్రను అస్పష్టంగా భావిస్తారు; కొంతమంది అతను గౌతమ బుద్ధతో సమకాలీనమైన వానిగా, సా.శ.పూ. 5వ శతాబ్దంలో నివసించినట్లు సూచిస్తున్నారు. మహావీరుడు 72 సంవత్సరాల వయస్సులో మోక్షం పొందాడు.

వర్ధమాన మహావీరుడు
రాజస్థాన్ లోని కురౌలీలో శ్రీ మహావీర్ జీ ఆలయంలో గల శ్రీ మహావీర్ స్వామి యొక్క ప్రతిమ
24వ తీర్థంకరుడు
ఇతర పేర్లువీర, అతివీర, వర్ధమాన, సన్మతినాథ[1][2][3][4][5]
మంత్రంశ్రీ మహావీరాయ నమః
గుర్తుసింహం[6]
తోబుట్టువులునందివర్ధన
సుదర్శన
పిల్లలుప్రియదర్శన, అనొజ్జ అనికూడా వ్యవహరిస్తారు (స్వేతాంబర)
పండుగలుమహావీర జన్మ కళ్యానక్, దీపావళి
తండ్రిసిద్ధార్ధ కుందగ్రామ
తల్లిత్రిశాల
రాజవంశంఇక్ష్వాకు వంశం
తరువాతి వారుపద్మనాభ[7]
అంతకు ముందు వారుపార్శ్వనాథుడు

ఆధ్యాత్మిక విముక్తికి అహింస(అహింస), సత్యం(నిజం), అస్తేయ(దొంగతనం చేయకపోవటం), బ్రహ్మచర్య(పవిత్రత), ఆపరిగ్రహ(అనుబంధం లేకుండావుండడం) అవసరమని తెలిపాడు. అనేకతవాద, శ్యాదవాద, నయావాదా సూత్రాలను బోధించాడు. మహావీరుడి బోధనలను అతని ప్రధాన శిష్యుడు ఇంద్రభూతి గౌతమ జైన ఆగమాల పేరుతో సంకలనం చేశాడు. జైన సన్యాసులచే వాచ్యంగా కొనసాగిన గ్రంథాలు, శ్వేతాంబర సంప్రదాయంలో సా.శ. 1వ శతాబ్దంలో తొలిగా లిఖించినప్పుడు చాలావరకు నశించాయని నమ్ముతారు. అలా వ్రాయబడినవి జైనమతం యొక్క పునాది గ్రంథాలయ్యాయి.

మహావీరుని చిత్రం పీఠ పక్కతలంపై సింహం చిహ్నంతో, పీఠంపై సాధారణంగా కూర్చున్న లేదా నిలబడ్డ ధ్యాన భంగిమలో వుంటుంది. వీటి తొలి రూపాలు ఉత్తర భారతదేశంలోని మధురలోని పురావస్తు ప్రాంతాలలో దొరికాయి. వీటిని సా.శ.పూ 1వ శతాబ్దం నుండి సా.శ.2వ శతాబ్దం కాలానికి చెందినవిగా గుర్తించారు. అతని పుట్టిన రోజును మహావీర్ జయంతిగా, నిర్యాణం(ముక్తి) పొందిన రోజును (ప్రధమ శిష్యుడు ఇంద్రభూతి గౌతమ జ్ఞానోదయం పొందిన రోజు కూడా) జైనులు దీపావళిగా ఆచరిస్తారు.

ఇతడు వైశాలీ నగరం సమీపంలో జన్మించాడు

జీవిత విశేషాలు

మార్చు

మహావీరుని అసలుపేరు వర్ధమానుడు. జ్ఞానోదయమైన తరువాత ' మహావీరుడు ' అని పేరు పొందాడు. ఈయన భార్య పేరు యశోద. వీరికి ' ప్రియదర్శి ' అను పుత్రిక ఉంది. ఈమె వర్థమానుని మేనల్లుడు జామాలిని వివాహమాడింది. వర్థమానుడు తన 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలిగోశాలుని శిష్యునిగా ఉన్నాడు. ఆ తరువాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు. తన 43వ ఏట సాలవృక్షం కింద తపోసిద్దిని పొందాడు. తదనంతరం... వర్ధమానుడు అంగ, మిథిల, కోసల, మగధదేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని పాగపురిలో నిర్యాణం పొందాడు.

బోధనలు

మార్చు

వీరి ప్రకారం సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనేవి మోక్షమార్గాలు. వీటినే త్రిరత్నాలు అంటారు. పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస, సత్యం, అపరిగ్రహం, అస్థేయం అనే నాలుగింటికి బ్రహ్మచర్యం అనేదానిని వర్ధమానుడు కలిపాడు. ఈ ఐదింటిని పంచవ్రతాలు అంటారు. వీటిని పాటిస్తూ త్రిరత్నాలతో జీవించిన వారికి కైవల్యం లభిస్తుందని జైనం బోధిస్తుంది. బ్రాహ్మణ ఆధిక్యతను తిరస్కరించాడు. పవిత్రమైన జీవనం గడుపుతూ, తపస్సు చేస్తే ఎవరైనా కైవల్యం పొందవచ్చునని బోధించాడు.

ప్రపంచ చరిత్రలోనే అంతకుమునుపు కనీవినీ ఎరుగని రీతిలో అహింసాయుత పద్ధతిలో స్వేచ్ఛను పొందిన భారతదేశ స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపించిన మహాత్మాగాంధీ గారి అహింస, శాంతి మార్గాలకు స్ఫూర్తి వర్ధమాన మహావీరుడు.

 
మహావీరుని జననం, కల్పసూత్ర, నుండి (1375-1400).

పాదపీఠికలు

మార్చు
  1. Dundas 2002, p. 25.
  2. Davidson & Gitlitz 2002, p. 267.
  3. Kailash Chand Jain 1991, p. 38.
  4. Jaini 2000, p. 9.
  5. Hubbard 1807, p. 310.
  6. Tandon 2002, p. 45.
  7. Dundas 2002, p. 276.

ఇవీ చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు