మాంగల్య బలం (1958 సినిమా)

(మాంగల్యబలం నుండి దారిమార్పు చెందింది)

మాంగల్య బలం 1958లో విడుదలైన తెలుగు చిత్రం. ఇది బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి రచించిన నవల ఆధారంగా బెంగాలీ భాషలో నిర్మించిన అగ్నిపరీక్ష చిత్రానికి తెలుగు పునర్నిర్మాణం. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ఒకే సారి చిత్రీకరించారు. తెలుగు సినిమా 1958, జనవరి 7న విడుదల కాగా తమిళంలో మంజల్ మహిమై పేరుతో అదే నెలలో 14వ తేదీన విడుదల చేశారు. ఇది ఊటీలో చిత్రీకరణ జరిగిన తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.

మాంగల్య బలం
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణం దుక్కిపాటి మధుసూధనరావు
చిత్రానువాదం ఆదుర్తి సుబ్బారావు, దుక్కిపాటి మధుసూధనరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు
సావిత్రి
రేలంగి
కన్నాంబ
రమణారెడ్డి
సుకుమారి
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం పి.సుశీల
ఘంటసాల
జిక్కి
పి.లీల
జమునారాణి
మాధవపెద్ది సత్యం
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సాంకేతికవర్గం మార్చు

నటీనటులు మార్చు

కథ మార్చు

రావుసాహెబ్ పాపారావు భార్య కాంతమ్మ. ఆమెకు కూతురు సరోజ, కొడుకు సూర్యం. పాపారావు తల్లి పార్వతమ్మ, చెల్లెలు సీత, బావ రామయ్య. సీతకు అనారోగ్యంగా ఉందని తెలిసి, ఆమె ఉంటున్న పల్లెటూరికి తల్లిని పంపుతాడు పాపారావు. ఆమెకు తోడుగా సరోజ, సూర్యం వెళ్తారు. అవసాన దశలోవున్న కూతురి కోరికమేరకు సరోజ, సీత కొడుకు చంద్రశేఖర్ లకు పార్వతమ్మ వివాహం జరిపిస్తుంది. దీనికి ఆగ్రహించిన కాంతమ్మ - కోర్టుద్వారా బాల్య వివాహాన్ని రద్దు చేయిస్తుంది. పార్వతమ్మ పల్లెటూరిలోనే ఉండి చంద్రాన్ని, అల్లుడు రామయ్యను కనిపెట్టుకుని ఉంటుంది. సరోజకు యుక్తవయసు వస్తుంది. ఆమెకు చిన్నప్పటి పెళ్లి గుర్తుండదు. పెద్దవాడైన చంద్రం పట్నంలో చదువుతుంటాడు. అమ్మమ్మ కోరికమేరకు తన భార్య సరోజను కలుసుకుంటాడు. శేఖర్‌గా ఆమె కుటుంబానికి దగ్గరై సరోజ ప్రేమ పొందుతాడు. కాని పాపారావు దంపతులు - డబ్బుగల శేఖర్ మిత్రుడు కైలాసంకు సరోజను ఇచ్చి వివాహం జరిపించాలని అనుకుంటారు. మీనాక్షికి ఇష్టంలేని పెళ్లి చేస్తున్న మేనమామ నుంచి కాపాడిన కైలాసం - ఆమె ప్రేమను సాధిస్తాడు. శేఖర్ - సరోజల చనువు చూసిన అన్న సూర్యం - బాల్యంలోనే ఆమెకు వివాహం జరిగిన విషయాన్ని చెబుతాడు. ఆ విషయం తెలిశాక సరోజ - శేఖర్‌ను దూరం పెడుతుంది. కానీ నాయనమ్మ పార్వతమ్మ ద్వారా చంద్రం, శేఖర్ ఒక్కడేనని తెలుసుకుని ఆనందిస్తుంది. సరోజకు కైలాసంతో పెళ్లి నిశ్చయిస్తుండగా.. శేఖర్‌తో కలిసి పల్లెటూరికి వెళ్లిపోతుంది సరోజ. విషయం తెలుసుకున్న పాపారావు, శేఖర్‌ను అంతం చేసే ఉద్దేశంతో ఆ ఊరికి వెళ్తాడు. తండ్రి ప్రయత్నానికి కూతురు సరోజ, తల్లి పార్వతమ్మ అడ్డుపడిన సమయంలో - పార్వతమ్మకు తూటా తగిలి గాయపడుతుంది. తల్లి స్థితిని, మేనల్లుడి మంచిని గ్రహించిన పాపారావులో మార్పు రావటం, వారందరినీ తీసుకొని పట్నంవచ్చి కాంతమ్మ మనసును మార్చటంతో చిత్రం సుఖాంతమౌతుంది[1].

పాటలు మార్చు

పాట రచయిత సంగీతం గాయకులు
ఆకాశవీధిలో అందాల జాబిలీ - వయ్యారి తారనుచేరి ఉయ్యాల లూగెనే సయ్యాటలాడెనే శ్రీశ్రీ మాస్టర్ వేణు ఘంటసాల, పి.సుశీల
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం పరవశమై ఆడేనా హృదయం శ్రీశ్రీ మాస్టర్ వేణు పి.సుశీల
పెను చీకటాయే లోకం చెలరేగే నాలో శోకం విషమాయె మా ప్రేమా విధియే పగాయే శ్రీశ్రీ మాస్టర్ వేణు ఘంటసాల, పి.సుశీల
వాడిన పూలే వికశించెనే చెర వీడిన హృదయాలు పులకించెనే శ్రీశ్రీ మాస్టర్ వేణు ఘంటసాల, పి.సుశీల
హాయిగా ఆలూమగలై కాలం గడపాలి వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బతకాలి శ్రీశ్రీ మాస్టర్ వేణు పి.సుశీల, సరోజిని

మూలాలు మార్చు

  1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (28 December 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 మాంగల్యబలం". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 14 June 2020.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.

బయటిలింకులు మార్చు