మార్టూరు సుబ్బులు

మార్టూరు సుబ్బులు తెలుగు నాటకరంగంలో సీనియర్ నటీమణి.

మార్టూరు సుబ్బులు
జననంమార్టూరు, ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
ప్రసిద్ధిరంగస్థల నటీమణి

జననం మార్చు

సుబ్బులు ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా, మార్టూరు లో జన్మించారు. నాటకరంగంలోకి ప్రవేశించిన తరువాత మార్టూరు నుండి తెనాలి కి స్థిరపడ్డారు.

రంగస్థల ప్రస్థానం మార్చు

బళ్లారి రాఘవ, కన్నాంబ, కాంచనమాల, కళ్యాణం రఘురామయ్య, పులిపాక వెంకటప్పయ్య మొదలైన ప్రముఖ నటీనటులతో కలిసి నటించారు.

వీరి కంఠస్వరం చాలా మధురంగా ఉండేది. తులసీ జలంధర నాటకంలో ఈవిడ పాడిన పద్యాలకు చాలా గుర్తింపు వచ్చింది. ఈవిడ దాదాపు 15 గ్రామఫోన్ రికార్డులు ఇచ్చారు. పులిపాక వెంకటప్పయ్య తో కలిసి నటించిన నాటకాలకు ఎక్కువ ప్రేక్షకాదరణ లభించడమేకాకుండా, కాంట్రాక్టర్లకు మంచి లాభాలు వచ్చాయి. పూర్ణిమ, కళ్యాణి, కన్నాంబ వంటి నటీమణులతో సుబ్బులు పోటీపడి నటించేవారు.

నటించిన నాటకాలు - పాత్రలు మార్చు

సుబ్బులుగారు తులసీ జలంధర నాటకంలో నటించారు. యశోద, ద్రౌపది, తులసీ, సత్యభామ వంటి ప్రముఖ పాత్రలు పోషించారు.

మూలాలు మార్చు

  • మార్టూరు సుబ్బులు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 329.