మా అబ్బాయి

కుమార్ వట్టి దర్శకత్వంలో 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం

మా అబ్బాయి 2017, మార్చి 17న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ రావు, కుమార్ వట్టి నిర్మాణ సారథ్యంలో వట్టి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, చిత్ర శుక్ల ప్రధానపాత్రల్లో నటించగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.

మా అబ్బాయి
మా అబ్బాయి సినిమా పోస్టర్
దర్శకత్వంవట్టి కుమార్
నిర్మాతబలగ ప్రకాష్ రావు
కుమార్ వట్టి
తారాగణంశ్రీవిష్ణు, చిత్ర శుక్ల
ఛాయాగ్రహణంతమశ్యామ్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థ
వెన్నెల క్రియేషన్స్
విడుదల తేదీ
17 మార్చి 2017 (2017-03-17)
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం

మార్చు

అబ్బాయి (శ్రీ విష్ణు) సాప్ట్‌వేర్ ఇంజనీర్. తన పక్కింట్లో ఉన్న అమ్మడు (చిత్ర శుక్ల)తో ప్రేమలో పడతాడు. ఒకరోజు అబ్బాయి తన కుటుంబ సభ్యులతో సాయిబాబ గుడికి వెళ్ళి బయటికి రాగానే బాంబు పేలుడుతో తన తండ్రి, తల్లి, చెల్లి చనిపోతారు. అబ్బాయ్ తన కుటుంబ సభ్యుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అబ్బాయి, అమ్మడు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. తరువాత అతను తన హ్యాకింగ్ స్కిల్‌తో ఉగ్రవాదులను గుర్తించి, వాళ్ళని అంతంచేస్తానని సవాలు చేస్తాడు. చివరకు అబ్బాయ్ పబ్లిక్‌లోని అన్ని ఉగ్రవాద బృందాల గురించి ప్రపంచానికి తెలియజేపి, హైదరాబాద్‌లో మళ్లీ పేలుళ్లు జరిపేందుకు ప్లాన్ వేసి, అతని కుటుంబం చనిపోయిన ప్రదేశంలోనే వారిని చంపుతాడు.[3]

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

నిర్మాణం

మార్చు

కుమార్ వట్టికి దర్శకుడిగా ఇది తొలిచిత్రం. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ దగ్గర ఎడిటర్ గా పనిచేశాడు.[2] 2011లో సోలో సినిమా చిత్రీకరణ సమయంలో తన దర్శకత్వంలో వచ్చే మొదటి సినిమాలో ప్రధానపాత్రలో నటించాలని శ్రీవిష్ణుకి, కుమార్ చెప్పాడు.[4] శ్రీవిష్ణుకి జోడిగా చిత్ర శుక్ల ఎంపిక చేయబడింది. హైదరాబాదు నగరంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.[2]

పాటలు

మార్చు

ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా కందికొండ యాదగిరి, కరుణాకర్ అడిగర్ల, సురేష్ బానిశెట్టి పాటలు రాశారు. పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.[5][6][7]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కదిలే కదిలే (రచన: కందికొండ యాదగిరి)"కందికొండ యాదగిరిసురేష్ బొబ్బిలి4:17
2."ఆ చందమామ (రచన: కందికొండ యాదగిరి)"కందికొండ యాదగిరిస్వీకర్ అగస్త్య4:06
3."గుచ్చి గుచ్చి (రచన: కరుణాకర్ అడిగర్ల)"కరుణాకర్ అడిగర్లఅంజనా సౌమ్య, అనుదీప్ దేవ్4:32
4."హే సాయిరాం"కరుణాకర్ అడిగర్ల (రచన: కరుణాకర్ అడిగర్ల)సాకేత్4:32
5."రంగదేవ (రచన: సురేష్ బానిశెట్టి)"సురేష్ బానిశెట్టిసురేంద్రనాథ్, సాహితి గాలిదేవర4:40
6."సింగారి సింగారి (రచన: సురేష్ బానిశెట్టి)"సురేష్ బానిశెట్టిసింహా, సాహితి చాగంటి3:50
మొత్తం నిడివి:25:57

రేటింగ్

మార్చు

ది హిందూ ఈ చిత్రానికి 1/5 రేటింగ్ ఇచ్చి, "ఏమాత్రం థ్రిల్లర్‌గా సినిమాగా అనిపించలేదని" రాసింది.[8] టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ చిత్రానికి 1.5/5 రేటింగ్ ఇచ్చి, ఈ సినిమాను చూడకపోవడం వల్ల కొంత సమయం, డబ్బు ఆదా అవుతుందని పేర్కొంది.[3]

మూలాలు

మార్చు
  1. "Sree Vishnu's 'Maa Abbayi' to be released on 17th March - Times of India". The Times of India.
  2. 2.0 2.1 2.2 "Sree Vishnu to romance Chitra Shukla in social drama 'Maa Abbayi' - Times of India". The Times of India.
  3. 3.0 3.1 3.2 3.3 "Maa Abbayi Review {1.5/5}: With barely anything positive in this movie, Maa Abbayi doesn't even pass off as a one-time watch". The Times of India.
  4. Jonnalagedda, Pranita (March 15, 2017). "A new beginning". Deccan Chronicle.
  5. "Music Review: Maa Abbayi - Times of India". The Times of India.
  6. "Maa Abbayi - All Songs - Download or Listen Free - JioSaavn". JioSaavn.
  7. "Maa Abbayi Full Songs JUKEBOX - #SreeVishnu - Chitra Shukla - Suresh Bobbili - Kumar Vatti". ARANIndia. 22 February 2017.
  8. Nadadhur, Srivathsan (March 17, 2017). "Maa Abbayi: Terror tales". The Hindu.

ఇతర లంకెలు

మార్చు