ధని ఏలె
ధని ఏలె భారతీయ చిత్రకారుడు, సినిమా పబ్లిసిటి డిజైనర్.[1] సింధూరం (1997) సినిమాతో పబ్లిసిటి డిజైనర్ గా సినీరంగ ప్రవేశం చేశాడు.
ధని ఏలె | |
---|---|
జననం | |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | చిత్రకారుడు |
జీవిత భాగస్వామి | శకుంతల |
పిల్లలు | సూర్యతేజ ఏలె (నటుడు) |
జననం-విద్య
మార్చుఇతడు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలంలోని కదిరేనిగూడెంలో జన్మించాడు. భువనగిరిలో 10వ తరగతి వరకు చదివి, హైదరాబాదుకి వచ్చి సాయంత్రం కళాశాలలో చేరాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుఇతనికి శకుంతలతో వివాహం జరిగింది. వీరి కుమారుడు సూర్యతేజ, 2024లో వచ్చిన భరతనాట్యం సినిమాలో హీరోగా నటించాడు.[2]
కళారంగం
మార్చుకళాశాలలో చదువుతున్నప్పుడు పాకెట్ మనీ కోసం సైన్ బోర్డులు రాసేవాడు. తన అన్న, ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలె ప్రోత్సాహంతో చిత్రకళలో ప్రవేశించాడు. డిగ్రీ చదివి డ్రాయింగ్; లోయర్, హయ్యర్ పరీక్షలతోపాటు టీటీసీ కూడా చేశాడు.
ఉద్యోగం
మార్చునేను 90వ దశకంలో లెటరింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించాడు. తారా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో లెటరింగ్ ఆర్టిస్ట్‌గా చేరాడు. మాన్యువల్‌గా లేఅవుట్‌లను చేసేవాడు. తరువాత కనిష్క అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో చేరాడు. లక్ష్మణ్ సహకారంతో ఈనాడు పత్రికలో ఏడేళ్ళపాటు చిత్రకారునిగా పనిచేశాడు. పేపర్లకు శీర్షికలు, హెడ్ లైన్స్ గీసాడు. తర్వాత టెక్నాలజీ పెరగడంతో ఫోటోషాప్ నేర్చుకుని డిజైనింగ్‌లోకి అడుగుపెట్టాడు.
ఈనాడులో
మార్చుఈనాడులో ధని పనితనం చూసి సితార సినిమా మ్యాగజైన్ ఆర్ట్ డిపార్ట్ మెంట్ కి ట్రాన్స్ ఫర్ చేశారు. అక్కడ కవర్ పేజీ, ఇన్‌సైడ్ లేఅవుట్ డిజైన్‌లు చేసేవాడు. ఈనాడు ఆదివారం అనుబంధం పుస్తకానికి డ్రాయింగ్‌లు, ఇలస్ట్రేషన్‌లు కూడా వేసేవాడు. ఈనాడులో 'వసుంధర' లోగో డిజైన్ చేసింది కూడా ధనినే. రామోజీరావు నిర్మించిన సినిమాలకు కొన్ని లోగోలు కూడా చేశాడు. ధని డిజైన్ చేసిన లోగో ఉషాకిరణ్ 'మనసు మమత' సినిమాకు ఎంపికైంది. దాంతో సినిమాలపై ఆసక్తి పెరిగింది, పోస్టర్ డిజైనింగ్‌లోకి వెళ్లాలనుకున్నాడు.[3]
సినిమారంగం
మార్చు1997లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమాకు తొలిసారిగా పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశాడు. ఆ సినిమా పోస్టర్స్ అన్నీ డిజైన్ చేశాడు. ఆ తరువాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషలలో 350 సినిమాలకు పైగా పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేసి, మంచి గుర్తింపు పొందాడు.[4]
ప్రముఖుల మొదటి సినిమాలు
మార్చుతొలినాళ్లలో దర్శకుడు కృష్ణవంశీ ధనిని బాగా ప్రోత్సహించాడు. తరువాత దర్శకుడు పూరి జగన్నాథ్ తన చిత్రాల్లో అవకాశం కల్పించాడు. పూరి జగన్నాథ్ (బద్రి), శ్రీను వైట్ల (నీకోసం), సంపత్ నంది (ఏమైంది ఈవేళ), అవసరాల శ్రీనివాస్ (ఊహలు గుసగుసలాడే) మొదలైన దర్శకుల మొదటి సినిమాలతోపాటు ప్రభాస్ (ఈశ్వర్), రామ్ చరణ్ (చిరుత), ఆది (ప్రేమకావాలి), నాగశౌర్య (ఊహలు గుసగుసలాడే) మొదలైన హీరోల మొదటి సినిమాలకు కూడా పబ్లిసిటి డిజైనర్ గా పనిచేసి ఆ సినిమాల విజయంలో తనవంతు కృషి చేశాడు.[4]
గుర్తింపు తెచ్చిన పోస్టర్లు
మార్చుబద్రిలో పవన్ కళ్యాణ్ ప్యాంట్ జిప్ లాగుతున్న పోస్టర్, పోకిరిలో మహేష్ బాబు రన్నింగ్ పోజ్ పోస్టర్, బాలకృష్ణ నటించిన అఖండ పోస్టర్లు, కె.జి.యఫ్ చాప్టర్ 2 పోస్టర్లు.[5]
అవార్డులు
మార్చుమదనపల్లి వారు చిత్రకారులకు 30 ఏళ్లుగా అందిస్తున్న అవార్డును వరుసగా ఏడుసార్లు (ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఆ నలుగురు, మొదటి సినిమా, చందమామ, మీ శ్రేయోభిలాషి, రాజు మహారాజు) అందుకున్నాడు. రెండుసార్లు సంతోషం ఫిలిం అవార్డు, మోత్కూరులో మహాకవి పోతన అవార్డులు వచ్చాయి.[4]
ఇతర వివరాలు
మార్చు- తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (టిఎస్ఎఫ్‌డీసీ) లోగోను తయారుచేశాడు.[6]
మూలాలు
మార్చు- ↑ "Dhani Aelay was a lettering artist". The Times of India. 2013-01-19. ISSN 0971-8257. Retrieved 2024-11-11.
- ↑ "Dhani Aelay's son debuts in Bharathanatyam!". Telugu Cinema. 2023-09-21. Retrieved 2024-11-11.
- ↑ "Dhani Aelay chitchat - Telugu film poster designer". www.idlebrain.com. Retrieved 2024-11-11.
- ↑ 4.0 4.1 4.2 ఎస్.ఎన్, చారి (2024-11-11). "బొమ్మ అదిరేట్టు." EENADU. Archived from the original on 2024-11-11. Retrieved 2024-11-11.
- ↑ "Exclusive Interview : Dhani Aelay – KGF 2 posters have brought me superb fame". 123telugu.com (in ఇంగ్లీష్). 2022-04-13. Retrieved 2024-11-11.
- ↑ "Publicity designer Dhani Aelay gets rare award - Telugu News". IndiaGlitz.com. 2018-04-19. Retrieved 2024-11-11.
యితర లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ధని ఏలె పేజీ